Tata Punch EV : టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ- కొత్త లుక్, అదిరే ఫీచర్లు..
టాటా మోటార్స్ తన అత్యంత విజయవంతమైన పంచ్ ఈవీకి సంబంధించి కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఫిబ్రవరి 20న మార్కెట్లోకి రానున్న ఈ ఎలక్ట్రిక్ కారు, డిజైన్ మార్పులు, అదనపు హంగులతో పాత మోడల్ కంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
మచ్ అవైటెడ్ టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌పై బిగ్ అప్డేట్! ఫిబ్రవరి 20 లాంచ్‌కి ముందే, ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అప్డేటెడ్ వర్షెన్‌ని సంస్థ తాజాగా ఆవిష్కరించింది. రెండేళ్ల క్రితం లాంచ్ అయిన పంచ్ ఈవీకి లభించిన భారీ సక్సెస్‌ను కొనసాగించడానికి ఈ మోడల్ సిద్ధంగా ఉంది. ఇటీవల వచ్చిన ఐసీఈ పంచ్ అప్‌డేట్ తర్వాత, ఇప్పుడు ఎలక్ట్రిక్ మోడల్ని కూడా సంస్థ అప్డేట్ చేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో టాటా పంచ్ ఈవీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్- డిజైన్ మార్పులు..
బొల్డర్ లుక్: కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్‌తో ఈ 2026 టాటా పంచ్ ఈవీ మునుపటి కంటే చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. హెడ్‌ల్యాంప్స్ ఇప్పటికీ వర్టికల్ స్టాక్డ్ యూనిట్‌గా ఉన్నప్పటికీ, వాటి హౌసింగ్ ఇప్పుడు పెద్దదిగా, యాంగులర్‌గా ఉంది.
ఫ్రంట్ ఫాసియా: ఎల్‌ఈడీ డీఆర్ఎల్లు, ముందు భాగంలో ఉండే ఛార్జింగ్ పోర్ట్ అలాగే కొనసాగుతున్నాయి. అయితే బంపర్ కింది భాగంలో వర్టికల్ స్లాట్‌లతో కూడిన గ్రిల్, సిల్వర్ ఫినిషింగ్‌తో కూడిన ఫాక్స్ స్కిడ్ ప్లేట్ కొత్తగా చేర్చడం జరిగింది.
సైడ్ అండ్ రియర్: 2026 టాటా పంచ్ ఈవీ పక్క వైపు నుంచి ప్రస్తుత మోడల్‌నే పోలి ఉన్నప్పటికీ, కొత్తగా రూపొందించిన ఏరో-డైనమిక్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్ డిజైన్, అప్డేటెడ్ బంపర్‌ను మనం చూడవచ్చు.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్- ఇంటీరియర్, ఫీచర్లు..
క్యాబిన్: టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లోపల కొత్త అప్‌హోలిస్ట్రీ, రీడిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్ ఉండవచ్చు. 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి యథాతథంగా ఉండనున్నాయి.
లగ్జరీ ఫీచర్లు: ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, వెెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎం, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ కారు లోడ్ అయి ఉంటుంది. ఇటీవలే లాంచ్ అయిన 2026 టాటా పంచ్ ఐసీఈ వర్షెన్‌లో కన్నా ఇందులోనే ఇంకా ఎక్కువ ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.
బ్యాటరీ, పవర్‌ట్రెయిన్ (అంచనా): రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో టాటా మోటార్స్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను (సుమారు 45కేడబ్ల్యూహెచ్) పరిచయం చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఈ ఎలక్ట్రిక్ కారు ఒకే ఛార్జ్‌పై ఏకంగా 489 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 25కేడబ్ల్యూహెచ్, 35కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లు కూడా కొనసాగవచ్చు.
లాంచ్ నాటికి టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌కి సంబంధించిన ఫీచర్స్, ధర, రేంజ్ వివరాలు అందుబాటులోకి వస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


