TATA Punch EV : టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్​ ఫిక్స్​- ఇప్పుడు అడాస్​తో..

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఫిబ్రవరి 20, 2026న భారత మార్కెట్​లో అరంగేట్రం చేయనుంది. గత నెలలో (జనవరి 2026) విడుదలైన పెట్రోల్ వెర్షన్ పంచ్ ఫేస్‌లిఫ్ట్ తరహాలోనే, ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ కనెక్టెడ్ టెయిల్ లైట్స్, అడాస్​ వంటి అధునాతన మార్పులు ఉండబోతున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Feb 7, 2026, 08:15:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత నెలలో టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ని లాంచ్​ చేసిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​.. ఇప్పుడు ఈవీ వర్షెన్​ని కూడా అప్డేట్​ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ ఫిబ్రవరి 20న, టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ని లాంచ్​ చేయనుంది. ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ జనవరి 2024 నుంచి భారతదేశంలో అమ్మకానికి ఉంది. ఇక ఫేస్‌లిఫ్ట్​ మోడల్ పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇది గత నెలలో అప్డేట్​ అయిన ఐసీఈ వర్షెన్​ని పోలీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026 టాటా పంచ్​ ఈవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా పంచ్​ ఈవీ..
టాటా పంచ్​ ఈవీ..

2026 టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్: ఇవీ మార్పులు..

అప్డేటెడ్​ డిజైన్, కొత్త కనెక్టెడ్ టెయిల్-లైట్స్:

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​తో పోల్చితే ఈ ఈవీ వర్షెన్​లో కనెక్టెడ్ ఎల్​ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్​ఎల్స్​), ఫ్రంట్ ఛార్జింగ్ లిడ్, ఏరోడైనమిక్ డిజైన్ కలిగిన అలాయ్ వీల్స్ వంటి కీలక డిజైన్ వ్యత్యాసాలు కొనసాగవచ్చు. అయితే, ఫేస్‌లిఫ్టెడ్ పంచ్ ఈవీ ఇప్పుడు దాని ఐసీఈ కౌంటర్ పార్ట్ లాగా కనెక్టెడ్ ఎల్​ఈడీ టెయిల్-లైట్స్‌తో వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా, పెట్రోల్ పంచ్‌లో అడాస్​ సూట్ లేదు, కానీ దాని ఫ్రంట్ బంపర్‌లో రాడార్-ఆధారిత సెన్సార్ హౌసింగ్‌ను పోలిన భాగం ఉంది. అందువల్ల, పంచ్ ఈవీలో అడాస్​ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ప్యాకేజీ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

పెద్ద టచ్‌స్క్రీన్‌తో కూడిన ఇంటీరియర్:

లోపలి భాగంలో, పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ మారే అవకాశం లేదు. అయితే, టాటా మోటార్స్ దీనిలో పెద్దదైన 12.3-ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని (నెక్సాన్ ఈవీ నుంచి సేకరించినది) పెట్టొచ్చు. మిగిలిన ఫీచర్లు.. అంటే 10.25-ఇంచ్​ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (ఐఆర్​వీఎం), యాంబియంట్ లైట్స్ యథాతథంగా కొనసాగుతాయి.

2026 టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్: బ్యాటరీ..

టాటా మోటార్స్ పవర్‌ట్రెయిన్ వివరాలను ఇంకా ధృవీకరించనప్పటికీ, 2026 టాటా పంచ్​ ఈవీలో ప్రస్తుత బ్యాటరీ ప్యాక్, మోటార్ ఆప్షన్లే కొనసాగవచ్చు:

25కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్: ఇది 265 కి.మీల రేంజ్ ఇస్తుంది. ఇది 82 హెచ్​పీ/114 ఎన్​ఎం ఎలక్ట్రిక్ మోటార్‌తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

35కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్: ఇది 365 కి.మీల రేంజ్ ఇస్తుంది. ఇది 122హెచ్​పీ/ 190ఎన్​ఎం మోటార్‌తో జత చేయబడింది.

2026 టాటా పంచ్​ ఈవీ- ధర అంచనా..

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ధర ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్ (రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.44 లక్షల మధ్య ఉంది) కంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More