టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ టాప్ వేరియంట్ కొనాలా? మీ నెలవారీ ఈఎంఐ లెక్కలు ఇవే

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లో ‘అకాంప్లీష్డ్+ ఎస్’ వేరియంట్ ఇప్పుడు హాట్ కేకులా మారుతోంది. ఈ టాప్ మోడల్ ధరలు, కొత్త ఫీచర్లు, 8.5% వడ్డీ రేటుతో నెలవారీ ఈఎంఐ ఎంత పడుతుందో పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

Published on: Jan 21, 2026, 15:08:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారతీయ రోడ్లపై మైక్రో ఎస్‌యూవీల హవా నడుస్తోంది. అందులోనూ టాటా మోటార్స్ నుంచి వచ్చిన 'టాటా పంచ్' (Tata Punch) తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన 2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మరింత స్టైలిష్‌గా, అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి ప్రవేశించింది. ముఖ్యంగా దీని టాప్ వేరియంట్ 'అకాంప్లీష్డ్+ ఎస్' (Accomplished+ S) ఫీచర్లు, ధర పరంగా కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ టాప్ వేరియంట్ కొనాలా? మీ నెలవారీ ఈఎంఐ లెక్కలు ఇవే
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ టాప్ వేరియంట్ కొనాలా? మీ నెలవారీ ఈఎంఐ లెక్కలు ఇవే

మీరు కూడా ఈ టాప్ ఎండ్ మోడల్‌ను ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ నెలవారీ బడ్జెట్ ఎలా ఉండబోతుందో, ఈఎంఐ (EMI) ఎంత పడుతుందో ఒకసారి చూద్దాం.

ఫీచర్లు అదుర్స్.. ఇంజిన్ అదిరింది

కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కేవలం పాత కారుకు మెరుగులు దిద్దడమే కాదు, ఇంజిన్ పరంగానూ పెద్ద మార్పులే చేసింది.

టర్బో పెట్రోల్ ఇంజిన్: మొదటిసారిగా ఇందులో శక్తివంతమైన 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో అందించారు.

CNG-AMT కాంబినేషన్: సిటీ ట్రాఫిక్‌లో తిరిగే వారికి సౌకర్యంగా ఉండేలా సీఎన్‌జీ వేరియంట్‌లోనూ ఏఎమ్‌టీ (AMT) గేర్ బాక్స్ సౌకర్యం కల్పించారు.

డిజైన్ మార్పులు: కారు లోపల, బయట కొత్త డిజైన్ హంగులతో ప్రీమియం లుక్‌ను తీసుకువచ్చారు.

ధర, వేరియంట్లు

'అకాంప్లీష్డ్+ ఎస్' వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద ₹8.99 లక్షల నుంచి ₹10.54 లక్షల మధ్య ఉంది. ఇందులో మీకు నచ్చిన విధంగా నార్మల్ పెట్రోల్, టర్బో పెట్రోల్ లేదా సీఎన్‌జీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

Tata Punch: Accomplished+ S వేరియంట్ ధరలు
పవర్ ట్రైన్1.2L NA petrol + 5 MT1.2L NA petrol + 5 AMT1.2L turbo-petrol + 6 MT1.2L NA petrol-CNG + 5 AMT
ధర (ex-showroom) ₹8.99 lakh ₹9.54 lakh ₹9.79 lakh ₹10.54 lakh

ఈఎంఐ (EMI) లెక్కలు ఇలా..

మీరు కారు ధరలో 100% ఫైనాన్స్ తీసుకున్నారని (ఎక్స్-షోరూమ్ ధరపై), బ్యాంక్ 8.5% వడ్డీ రేటును విధిస్తుందని అనుకుంటే.. మీ నెలవారీ ఈఎంఐ అంచనాలు కింది విధంగా ఉంటాయి:

Tata Punch: Accomplished+ S trim పై నెలవారీ ఈఎంఐ
వేరియంట్ఎక్స్ షోరూమ్ ధరలోన్ (100శాతం)వడ్డీలోన్ కాలవ్యవధినెలవారీ ఈఎంఐమొత్తం వడ్డీ
1.2-litre NA petrol + 5 MT ₹8.99 లక్షలు ₹8.99 లక్షలు8.5%3 ఏళ్లు ₹28,379 ₹122,652
5 ఏళ్లు ₹18,444 ₹207,662
1.2-litre NA petrol + 5 AMT ₹9.54 లక్షలు ₹9.54 లక్షలు8.5%3 ఏళ్లు ₹30,115 ₹130,156
5 ఏళ్లు ₹19,573 ₹220,366
1.2-litre turbo-petrol + 6 MT ₹9.79 లక్షలు ₹9.79 లక్షలు8.5%3 ఏళ్లు ₹30,905 ₹133,566
5 ఏళ్లు ₹20,086 ₹226,141
1.2-litre NA petrol-CNG + AMT ₹10.54 లక్షలు ₹10.54 లక్షలు8.5%3 ఏళ్లు ₹33,272 ₹143,799
5 ఏళ్లు ₹21,624 ₹243,465
* లోన్ మొత్తం, వడ్డీ రేటు, లోన్ కాలపరిమితిని బట్టి ఈఎంఐ మారుతుంటుందని గమనించాలి.
  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More