Nissan Gravite : రూ. 5.65 లక్షల నిస్సాన్ గ్రావైట్ 7 సీటర్ ఎంపీవీ వేరియంట్లు- వాటి ఫీచర్లు..
నిస్సాన్ నుంచి వస్తున్న సరికొత్త 'గ్రావైట్' ఐదు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. ఈ 7 సీటర్ ఎంపీవీ బేస్ మోడల్ విసియా నుంచి టాప్-ఎండ్ టెక్నా వరకు ప్రతి వేరియంట్‌లోని ఫీచర్లు, సేఫ్టీ వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
నిస్సాన్ ఇండియా తన 'గ్రావైట్' మోడల్‌ని విసియా, అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా లాంచ్ ఎడిషన్ అనే ఐదు రకాల వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. బేస్ వేరియంట్లు ప్రాథమిక సౌకర్యాలు, భద్రతపై దృష్టి పెట్టగా.. హయ్యర్ వేరియంట్లు లగ్జరీ ఫీచర్లు, స్టైలిష్ లుక్స్‌తో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 7 సీటర్ నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ వేరియంట్లు, వాటి ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ వేరియంట్లు- వాటి ఫీచర్లు..
1. విసియా (Visia)
ఇది గ్రావైట్ శ్రేణిలో ప్రారంభ వేరియంట్.
ఎక్స్‌టీరియర్: ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, క్రిస్టల్ ఎడ్జ్ టెయిల్ ల్యాంప్స్, సాటిన్ సిల్వర్ ఫినిషింగ్‌తో కూడిన పియానో బ్లాక్ 2డీ గ్రిల్, సీ-షేప్డ్ బంపర్ యాక్సెంట్లు, బ్లాక్ స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి. ఇందులో సెంటర్ క్యాప్స్‌తో కూడిన 14-ఇంచ్ స్టీల్ వీల్స్ ఇచ్చారు.
ఇంటీరియర్: హెక్సాగన్ ప్యాటర్న్‌తో కూడిన స్పోర్టీ సీట్లు, ఎల్ఈడీ క్యాబిన్ లైట్లు, ఈ 7 సీటర్ ఎంపీవీ రెండో- మూడో వరుస సీట్లకు అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు ఉన్నాయి. రెండో వరుస సీట్లు 60:40 స్ప్లిట్, స్లైడ్, రెక్లైన్ ఫంక్షన్‌తో వస్తాయి. మూడో వరుసలో 50:50 స్ప్లిట్ ఫోల్డింగ్, సీట్లను పూర్తిగా తొలగించే వెసులుబాటు ఉంది.
ఫీచర్లు: 8.89 సెం.మీ ఎల్ఈడీ డిజిటల్ క్లస్టర్, ఫ్రంట్ పవర్ విండోస్, టిల్ట్ అడ్జస్ట్‌మెంట్ గల ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, 12వీ పవర్ అవుట్‌లెట్ ఉన్నాయి.
భద్రత: 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, ఈఎస్పీ, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, టీపీఎంఎస్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, ఆటోమేటిక్ హజార్డ్ వార్నింగ్ సిస్టమ్ ఉన్నాయి.
2. అసెంటా
నిస్సాన్ గ్రావైట్ విసియాలోని ఫీచర్లతో పాటు ఇందులో మరికొన్ని అదనపు సౌకర్యాలు ఉన్నాయి.
అదనపు ఫీచర్లు: ఫుల్ వీల్ కవర్లతో కూడిన 14-ఇంచ్ స్టీల్ వీల్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, పియానో బ్లాక్ ఓఆర్వీఎంలు, డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.
సౌకర్యాలు: సెంటర్ కన్సోల్‌లో క్లోజ్డ్ స్టోరేజ్, రెండో- మూడో వరుస ప్రయాణికుల కోసం రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. రెండో వరుస వారికి స్వతంత్రంగా ఏసీ కంట్రోల్ చేసే వీలుంది.
టెక్నాలజీ: 8- ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్‌ప్లే, స్టీరింగ్‌పై మీడియా కంట్రోల్స్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటివి ఉన్నాయి.
3. ఎన్-కనెక్టా
ఎక్స్‌టీరియర్: ఈ నిస్సాన్ గ్రావైట్ ఫ్యామిలీ ఎంపీవీ వేరియంట్లో ఓఆర్వీఎంలపై ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 50 కేజీల బరువు మోయగల రూఫ్ రైల్స్, డోర్ క్లాడింగ్‌పై డీకాల్స్ వస్తాయి.
ఇంటీరియర్: డ్యూయల్-టోన్ స్యూడ్, ఫ్యాబ్రిక్ సీట్లు, డ్యాష్‌బోర్డ్‌పై వుడెన్ ఫినిషింగ్, లెదరెట్ స్టీరింగ్ కవర్ ఉన్నాయి.
ఫీచర్లు: రియర్ పవర్ విండోస్, రియర్ వైపర్, వాషర్, డెఫాగర్, పీఎం 2.5 పోలెన్ ఫిల్టర్, గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ కెమెరా, కూల్డ్ సెంటర్ కన్సోల్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంలు ఉన్నాయి. ఆడియో సిస్టమ్ 4 స్పీకర్లకు అప్‌గ్రేడ్ అయ్యింది.
4. టెక్నా
బడ్జెట్ ఫ్రెండ్లీ 7 సీటర్ నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీలో ఇది అత్యంత ప్రీమియం వేరియంట్.
లుక్: సిగ్నేచర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, 15- ఇంచ్ డ్యూయల్-టోన్ ఫ్లెక్స్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ దీనికి ప్రత్యేక ఆకర్షణ.
ప్రీమియం ఫీచర్లు: 7-ఇంచ్ పూర్తి స్థాయి డిజిటల్ క్లస్టర్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్‌తో కూడిన ఐ-కీ, క్రూయిజ్ కంట్రోల్ (మాన్యువల్ వేరియంట్లలో), వైర్‌లెస్ ఛార్జర్, మూడో వరుస కోసం 12వీ అవుట్‌లెట్ ఉన్నాయి.
భద్రత: రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటో హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఆడియోలో అదనంగా రెండు ట్వీటర్లు వస్తాయి.
5. టెక్నా లాంచ్ ఎడిషన్
ఇది అసెంటా ట్రిమ్‌పై ఆధారపడి ఉంటుంది కానీ 'నిస్సాన్ జెన్యూన్ యాక్సెసరీస్'తో వస్తుంది.
యాక్సెసరీస్: వీల్ ఆర్చ్ ఏరో ఇన్సర్ట్‌లు, డ్రిఫ్ట్ ఫ్లో గ్రాఫిక్స్, డోర్ వైజర్లు, క్రోమ్ డీటెయిలింగ్ ఉంటాయి.
ప్రీమియం ఫీచర్లు: జేబీఎల్ ప్రీమియం స్పీకర్లు, డ్యూయల్ డాష్ కామ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ మూడ్ లైటింగ్, మొదటి వరుస సీట్లకు అదనపు నెక్ అండ్ లంబార్ కుషన్లు ఉంటాయి.
నిస్సాన్ గ్రావైట్- ట్రాన్స్‌మిషన్, కలర్స్..
గేర్ బాక్స్: ఎన్-కనెక్టా, టెక్నా వేరియంట్లలో 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్ ఉంది. విసియా, అసెంటా వేరియంట్లు కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తాయి.
కలర్స్: బ్లేడ్ సిల్వర్, స్టార్మ్ వైట్ అన్ని వేరియంట్లలో లభిస్తాయి. ఆనిక్స్ బ్లాక్, మెటాలిక్ గ్రే రంగులు అసెంటా నుంచి అందుబాటులో ఉంటాయి. ఫారెస్ట్ గ్రీన్ మాత్రం కేవలం ఎన్-కనెక్టా, ఆపై వేరియంట్లకు మాత్రమే పరిమితం.
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న- నిస్సాన్ గ్రావైట్ ధర ఎంత?
సమాధానం- మొదటి 1,001 మంది కస్టమర్ల కోసం దీనిని రూ. 5.65 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేశారు.
ప్రశ్న- నిస్సాన్ గ్రావైట్‌లో ఏఎంటీ (ఆటోమేటిక్) ఆప్షన్ ఏ వేరియంట్లలో లభిస్తుంది?
సమాధానం- నిస్సాన్ గ్రావైట్‌లో 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్ కేవలం హయ్యర్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు ఆటోమేటిక్ కారును ఎంచుకోవాలనుకుంటే ఎన్-కనెక్టా లేదా టాప్-ఎండ్ మోడల్ టెక్నా వేరియంట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రారంభ వేరియంట్లు అయిన విసియా, అసెంటా కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


