మహీంద్రా XUV 7XO ఎస్​యూవీ- అన్ని వేరియంట్లలో కనిపించే టాప్​ ఫీచర్లు ఇవి..

మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీ ఎక్స్​యూవీ700ని సరికొత్త హంగులతో 'ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ' పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ. 13.66 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ కారులోని అన్ని వేరియంట్లలో అనేక ఫీచర్లు స్టాండర్డ్​గా లభిస్తున్నాయి. వాటిని ఇక్కడ చూసేయండి..

Published on: Jan 7, 2026, 09:00:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎస్‌యూవీ విభాగంలో తన హవాను కొనసాగిస్తూ, మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా 'ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ'ను భారత్‌లో లాంచ్​ చేసింది. బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీ అయిన ఎక్స్​యూవీ700కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​. ఈ ఫీచర్​ రిచ్​ ఎస్​యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.66 లక్షలు. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఎస్​యూవీలోని అన్ని వేరియంట్లలో లభించే టాప్​ ఫీచర్లను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ..
మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- అన్ని వేరియంట్లలోని టాప్​ ఫీచర్లు..

  1. చాట్​జీపీటీ (విత్​ అలెక్సా బిల్ట్​-ఇన్​)-

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ అన్ని వేరియంట్లలోనూ అలెక్స్​ బిల్ట్​- ఇన్​తో కూడిన చాట్​జీపీటీ ఫీచర్​ లభిస్తోంది. ఫలితంగా ఇన్​-కార్​ అసిస్టెన్స్​ మెరుగుపడింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు సరదాగా సంభాషించాలన్నా లేదా క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కావాలన్నా ఈ ఏఐ అసిస్టెంట్ మీకు తోడుగా ఉంటుంది.

2. కోస్ట్​ టు కోస్ట్​ స్క్రీన్​-

ఈ మహీంద్రా కొత్త ఎస్​యూవీలో 31.24సె.మీ ట్రిపుల్​ హెచ్​డీ స్క్రీన్లు స్టాండర్డ్​గా వస్తున్నాయి. ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళతాయి. ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయి సినిమాటిక్ ఎక్స్​పీరియెన్స్​ని ఇస్తాయి. వినోదంతో పాటు డ్రైవర్‌కు అవసరమైన సమాచారాన్ని ఇవి స్పష్టంగా అందిస్తాయి. ఈ ఫీచర్​తో ఈ కారులో మహీంద్రా సంస్థ కటింగ్​ ఎడ్జ్​ టెక్నాలజీ, కనెక్టివిటీ, ప్రీమియం క్యాబిన్​ ఫీల్​ని ఒక్కచోటకు తీసుకొచ్చింది.

3. అడ్రెనాక్స్​-

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ అన్ని వేరియంట్లలో ADRENOX+ కనెక్ట్​ స్టాండర్డ్​గా వస్తుంది. దీని ద్వారా కస్టమర్లు 93 కనెక్టెడ్​ ఫీచర్స్​ని పొందవచ్చు. ఫలితంగా ప్రతి వేరియంట్​ ఒక టెక్​-సావీ డ్రైవింగ్​ ఎక్స్​పీరియెన్స్​ని ఇస్తుంది.

4. క్రూయిజ్​ కంట్రోల్​-

ఈ కొత్త ఎస్​యూవీకి సంబంధించి అన్ని వేరియంట్లలో లభిస్తున్న మరొక ఫీచర్​ ఈ క్రూయిజ్​ కంట్రోల్​. బేస్​ వేరియంట్​లో కూడా ఇది ఉండటం విశేషం. లాంగ్​ జర్నీలో డ్రైవర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

5. 6 ఎయిర్​బ్యాగులు-

ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది మహీంద్రా సంస్థ. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్​బ్యాగులను స్టాండర్డ్​గా ఇచ్చింది. కర్టెన్​ ఎయిర్​బ్యాగుల ద్వారా 3వ వరుస సీట్లకు కూడా సేఫ్టీ ఉంటుంది.

6. వైర్‌లెస్ కనెక్టివిటీ-

కేబుల్స్ అవసరం లేకుండానే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వాడుకోవచ్చు. ఫలితంగా నేవిగేషన్​, మ్యూజిక్​, కాల్స్​, యాప్స్​కి యాక్సెస్​ని పొందవచ్చు.

7. బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్-

రాత్రి వేళల్లో రోడ్డుపై వెలుతురు స్పష్టంగా ఉండేందుకు ఈ ఫీచర్​ ఉపయోగపడుతుంది. అంతేకాదు, దీని వల్ల కారుకు ప్రీమియం లుక్‌ వస్తుంది.

8. పుష్ బటన్ స్టార్ట్/స్టాప్​-

సాంప్రదాయ తాళం చెవి అవసరం లేకుండా బటన్ నొక్కగానే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది.

"వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రీమియం అనుభవాన్ని ప్రతి వేరియంట్‌లోనూ అందించడమే మా లక్ష్యం," అని మహీంద్రా తన ఫీచర్ల ఎంపిక ద్వారా చాటిచెప్పింది. మధ్యతరగతి నుంచి ప్రీమియం ఎస్‌యూవీ కోరుకునే వారి వరకు ఈ ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఒక అద్భుతమైన ఎంపిక కానుంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ డెలివరీలు..

ఈ మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఇప్పటికే మొదలయ్యాయి టెస్ట్​ డ్రైవ్​ జనవరి 8న ప్రారంభమవుతుంది. టాప్​ ఎండ్​ వేరియంట్ల డెలివరీ జనవరి 14న స్టార్ట్​ అవుతుంది. ఏప్రిల్​లో బేస్​, మిడ్​ వేరియంట్లను సంస్థ డెలివరీ చేసే అవకాశం ఉంది.

ఎంజీ హెక్టార్, టాటా సఫారీ వంటి దిగ్గజ కార్లకు ఈ ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ గట్టి పోటీ ఇవ్వనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More