మహీంద్రా XUV 7XO వర్సెస్ టాటా సఫారీ.. ఈ రెండు 3-రో ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
మహీంద్రా XUV 7XO వర్సెస్ టాటా సఫారీ.. ఈ రెండు 3-రో ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? దేని ధర తక్కువ? ఎందులో ఇంజిన్ ఆప్షన్స్ ఎక్కువ? వివరంగా ఇక్కడ తెలుసుకోండి..
మచ్ అవైటెడ్ మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఇండియాలో లాంచ్ అయ్యింది. బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700కి ఇది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. ఈ మోడల్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అవ్వగా, డెలివరీలను సంస్థ అతి త్వరలోనే మొదలుపెట్టనుంది.

ఈ 3-రో ఎస్‌యూవీలో 6 సీటర్, 7 సీటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కొత్త ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ.. మరో 3-రో ఎస్యూవీ టాటా సఫారీకి గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎస్‌యూవీల ధరలు, డైమెన్షన్స్, ఇంజిన్ ఆప్షన్స్‌ని పోల్చి ఏది కొంటే బెటర్? అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ వర్సెస్ టాటా సఫారీ- డైమెన్షన్స్..
| మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ వర్సెస్ టాటా సఫారీ- డైమెన్షన్స్.. | |||
|---|---|---|---|
| మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ | టాటా సఫారీ | వ్యత్యాసం | |
| పొడవు | 4,695 ఎంఎం | 4,668 ఎంఎం | 27 ఎంఎం |
| వెడల్పు | 1,890 ఎంఎం | 1,922 ఎంఎం | 32 ఎంఎం |
| ఎత్తు | 1,755 ఎంఎం | 1,795 ఎంఎం | 40 ఎంఎం |
| వీల్‌బేస్ | 2,750 ఎంఎం | 2,741 ఎంఎం | 9 ఎంఎం |
| వీల్ సైజు | 17-18 ఇంచ్ | 17-19 ఇంచ్ | - |
అంటే టాటా సఫారీతో పోల్చితే మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎస్యూవీ పొడవు 27ఎంఎం ఎక్కువ, 32ఎంఎం వెడల్పు తక్కువ. హైట్‌లో మాత్రం టాటా సఫారీ ముందుంది.
- సేఫ్టీలో ఏ మారుతీ సుజుకీ కారు బెస్ట్? ఏది కొనొచ్చు? క్రాష్ టెస్ట్ ఫలితాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ వర్సెస్ టాటా సఫారీ- ఇంజిన్..
| మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ వర్సెస్ టాటా సఫారీ- ఇంజిన్.. | ||
|---|---|---|
| మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ | టాటా సఫారీ | |
| ఇంజిన్ | 2.0-litre mStallion (పెట్రోల్) 2.2-litre mHawk (డీజిల్) | 1.5-litre Hyperion (పెట్రోల్) 2.0-litre Kryotec (డీజిల్) |
| పవర్ | 197 బీహెచ్పీ (పెట్రోల్) 182 బీహెచ్పీ (డీజిల్) | 168 బీహెచ్పీ (పెట్రోల్) 168 బీహెచ్పీ (డీజిల్) |
| టార్క్ | 380 ఎన్ఎం (పెట్రోల్) 450 ఎన్ఎం (డీజిల్) | 280 ఎన్ఎం (పెట్రోల్) 350 ఎన్ఎం (డీజిల్) |
| ట్రాన్స్మిషన్ | 6-స్పీడ్ ఎంటీ / 6-స్పీడ్ ఏటీ | 6-స్పీడ్ ఎంటీ / 6-స్పీడ్ ఏటీ |
| డ్రైవ్‌ట్రైన్ | ఎఫ్‌డబ్ల్యూడీ / ఏడబ్ల్యూడీ | ఎఫ్‌డబ్ల్యూడీ |
| ఛాసిస్ | మోనోక్యూ | మోనోక్యూ |
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ, టాటా సఫారీ రెండింటిలోనూ పెట్రోల్, డీజిల్ ఆప్షన్స్ లభిస్తున్నాయి. రెండింటిలోనూ 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. టాటా సఫారీ పెట్రోల్ వేరియంట్‌తో పోల్చితే ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ పెట్రోల్ వేరియంట్ పవర్‌ఫుల్‌గా ఉంది. డీజిల్ విషయంలో కూడా ఇంతే!
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ వర్సెస్ టాటా సఫారీ- ధరలు..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎక్స్‌షోరూం ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.92 లక్షల వరకు ఉంటుంది. వేరియంట్ల వారిగా ధరల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
టాటా సఫారీ ఎక్స్‌షోరూం ధర రూ. 14.6 లక్షల నుంచి రూ. 25.9 లక్షల వరకు ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


