మహీంద్రా XUV 7XO వేరియంట్లు- వాటి ధరల వివరాలు..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ పేరుతో ఎక్స్‌యూవీ700 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ అయింది. రూ. 13.66 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఎస్‌యూవీలో ఆరు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలతో పాటు బుకింగ్, డెలివరీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. తన పాపులర్ మోడల్ ఎక్స్‌యూవీ700ను భారీగా రీ-డిజైన్ చేసి, మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ పేరుతో కంపెనీ లాంచ్ చేసింది. ఈ సరికొత్త ఫ్యామిలీ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 13.66 లక్షలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 24.92 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ- డిజైన్‌లో ఊహించని మార్పులు..
వాస్తవానికి, ఈ ఎస్యూవీ ఫ్రంట్ లుక్ మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్‌ని పోలి ఉంటుందని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు భావించాయి. కానీ, మహీంద్రా అందరినీ ఆశ్చర్యపరుస్తూ దీనిని తన సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’ స్టైల్‌లో రూపొందించింది. అంటే, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓలో మనం చూసిన షార్ప్ డిజైన్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఈ పెద్ద ఎస్‌యూవీలోను కనిపిస్తాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ- వేరియంట్లు, ఇంజిన్ సామర్థ్యం..
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓను మొత్తం ఆరు వేరియంట్లలో (ఏఎక్స్, ఏఎక్స్3, ఏఎక్స్5, ఏఎక్స్7, ఏఎక్స్7 టీ, ఏఎక్స్7 ఎల్) మహీంద్రా తీసుకువచ్చింది.
పెట్రోల్ వేరియంట్: 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ (ధర: రూ. 13.66 లక్షల - రూ. 23.64 లక్షలు).
డీజిల్ వేరియంట్: 2.2-లీటర్ ఇంజిన్ (ధర: రూ. 14.94 లక్షల - రూ. 24.92 లక్షలు).
ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. సీటింగ్ లేఅవుట్ ఆధారంగా కూడా ధరల్లో మార్పులు ఉంటాయి.
- మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఫీచర్ల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
| మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ- వేరియంట్లు, వాటి ధరలు.. | ||||||
|---|---|---|---|---|---|---|
| ఏఎక్స్ | ఏఎక్స్3 | ఏఎక్స్5 | ఏఎక్స్7 | ఏఎక్స్7 టీ | ఏఎక్స్ 7 ఎల్ | |
| 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఎంటీ | రూ. 13.66 లక్షలు | రూ. 16.02 లక్షలు | రూ. 17.52 లక్షలు | రూ. 18.48 లక్షలు | - | - |
| 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఏటీ | - | రూ. 17.47 లక్షలు | రూ. 18.97 లక్షలు | రూ. 19.93 లక్షలు | రూ. 21.97 లక్షలు (7-సీటర్) రూ. 22.16 లక్షలు | రూ. 23.45 లక్షలు (7-సీటర్) రూ. 23.64 లక్షలు (6-సీటర్) |
| 2.2-లీటర్ డీజిల్ ఎంటీ | రూ. 14.96 లక్షలు | రూ. 16.49 లక్షలు | రూ. 17.99 లక్షలు | రూ. 18.95 లక్షలు | రూ. 20.99 లక్షలు (7-సీటర్) రూ. 21.39 లక్షలు (6-సీటర్) | ₹22.47 lakh |
| 2.2-లీటర్ డీజిల్ ఏటీ | - | రూ. 17.94 లక్షలు | రూ. 19.44 లక్షలు | రూ. 20.4 లక్షలు | రూ. 22.44 లక్షలు (7-సీటర్) ₹22.84 lakh (6-seater) | రూ. 24.11 లక్షలు (6-సీటర్) |
| 2.2-లీటర్ డీజిల్ ఏటీ ఏడబ్ల్యూడీ | - | - | - | రూ. 21.4 లక్షలు | రూ. 23.44 లక్షలు | రూ. 24.92 లక్షలు |
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ బుకింగ్, డెలివరీ అప్‌డేట్..
మీరు ఈ కారును కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి:
బుకింగ్స్: గత ఏడాది డిసెంబర్ మధ్య నుంచే ఈ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
డెలివరీ ఎప్పుడు?: ఇప్పటికే ప్రీ-బుక్ చేసుకున్న వారికి జనవరి 14వ తేదీ (సంక్రాంతి) నుంచి డెలివరీలు మొదలవుతాయి.
అయితే, కంపెనీ తొలుత కేవలం హై-ఎండ్ వేరియంట్లను (ఏఎక్స్7, ఏఎక్స్7 టీ, ఏఎక్స్7 ఎల్) మాత్రమే డెలివరీ చేయనుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ బేస్, మిడ్ వేరియంట్లు (ఏఎక్స్, ఏఎక్స్3, ఏఎక్స్5) కొన్న వారు మాత్రం ఏప్రిల్ 2026 వరకు వేచి చూడక తప్పదు.
మహీంద్రా కార్లకు ఉండే విపరీతమైన డిమాండ్ దృష్ట్యా, ప్రారంభంలో ఈ మోడల్‌కు వెయిటింగ్ పీరియడ్ భారీగా ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


