VinFast VF MPV 7 : విన్​ఫాస్ట్​ వీఎఫ్​ ఎంపీవీ 7 కొనాలా? ఎలక్ట్రిక్​ ఎంపీవీ ఫీచర్లు ఇవే..

VF MPV 7 : విన్​ఫాస్ట్ వీఎఫ్​ ఎంపీవీ 7 కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. 517 కి.మీ రేంజ్​తో వస్తున్న ఈ ఎలక్ట్రిక్​ ఎంపీవీలోని ఫీచర్ల వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి. ఇందులో మిస్​ అయిన ఫీచర్లను కూడా కవర్​ చేశాము. చూసేయండి..

Published on: Apr 17, 2026, 12:19:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన పట్టును పెంచుకునేందుకు వియత్నాంకు చెందిన ఆటో దిగ్గజం విన్​ఫాస్ట్ మరో కీలక అడుగు వేసింది. తన మూడొవ ఎలక్ట్రిక్ కారుగా వీఎఫ్​ ఎంపీవీ 7ని భారత మార్కెట్​లో ఇటీవలే అధికారికంగా విడుదల చేసింది. ఇది ఒక పక్కా 7 సీటర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కారు. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న వీఎఫ్ 6, వీఎఫ్ 7 మోడళ్ల సరసన ఇప్పుడు ఈ సరికొత్త ఎంపీవీ చేరింది. ఒకవేళ మీరు ఈ వీఎఫ్​ ఎంపీవీ 7ని కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇందులోని కీలక ఫీచర్ల లిస్ట్​ని ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

విన్​ఫాస్ట్​ వీఎఫ్​ ఎంపీవీ 7 ఇదిగో..
విన్​ఫాస్ట్​ వీఎఫ్​ ఎంపీవీ 7 ఇదిగో..

విన్​ఫాస్ట్​ వీఎఫ్​ ఎంపీవీ 7- డిజైన్, లుక్: సింప్లీ సూపర్!

విన్​ఫాస్ట్​ వీఎఫ్​ ఎంపీవీ 7 డిజైన్ విషయానికి వస్తే ఇది అత్యంత మినిమలిస్ట్ (సరళమైన) శైలిని అనుసరించింది. బయటి వైపు సొగసైన ఎల్ఈడీ హెడ్ లైట్లు, 19 ఇంచ్ ఆల్-బ్లాక్ అలాయ్ వీల్స్‌తో ఇది చాలా మోడ్రన్‌గా కనిపిస్తుంది. లోపలి క్యాబిన్ కూడా హుందాగా, అధునాతన ఫీచర్లతో నిండి ఉంది.

కీలక ఫీచర్లు ఇవే:

ఎక్స్‌టీరియర్-

ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్లు.

షార్క్ ఫిన్ యాంటెన్నా, బ్లాక్ బాడీ క్లాడింగ్.

ఆటో-ఫోల్డింగ్ ఓఆర్‌వీఎంలు.

వెనుక వైపు వైపర్, వాషర్, డిఫాగర్.

ఇంటీరియర్- కంఫర్ట్-

10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్: ఇది ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రెండింటిలా పనిచేస్తుంది.

లెదరెట్ సీట్లు, అన్ని సీట్లకు అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు.

ఆటో ఏసీ (వెనుక వెెంట్లతో పాటు మూడవ వరుసలో ప్రత్యేక కంట్రోల్స్).

కనెక్టెడ్ కార్ టెక్నాలజీ: వైర్డ్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్.

4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్.

60:40 నిష్పత్తిలో రెండో వరుస, 50:50 నిష్పత్తిలో మూడో వరుస సీట్లను మడచుకునే వెసులుబాటు.

డ్రైవింగ్, సేఫ్టీ-

ఎలక్ట్రిక్​ ఎంపీవీ భద్రత విషయంలో విన్​ఫాస్ట్ రాజీ పడలేదు.

4 ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు.

ఏబీఎస్ విత్ ఈబీడీ.

టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్.

రేర్ పార్కింగ్ కెమెరా, సెన్సార్లు.

మూడు డ్రైవింగ్ మోడ్స్ (ఈకో/ సిటీ /స్పోర్ట్), క్రూయిజ్ కంట్రోల్.

విన్​ఫాస్ట్​ వీఎఫ్​ ఎంపీవీ 7- ఈ ఈవీలో లేని ఫీచర్లు ఏంటి?

దాదాపు రూ. 24.5 లక్షల ప్రారంభ ధర ఉన్నప్పటికీ, ఈ విన్​ఫాస్ట్​ వీఎఫ్​ ఎంపీవీ 7లో కొన్ని కీలక ఫీచర్లు ఇందులో లేకపోవడం కస్టమర్లను కాస్త నిరాశపరచవచ్చు:

సన్‌రూఫ్: నేటి కాలంలో ట్రెండ్‌లో ఉన్న సన్‌రూఫ్ ఇందులో లేదు.

అడాస్: అత్యాధునిక డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు లేకపోవడం ఒక పెద్ద మైనస్.

వెంటెడ్ సీట్లు: వేసవి కాలంలో ఎంతో ఉపయోగపడే వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్ కూడా లేవు.

వీ2ఎల్ అండ్ వీ2వీ ఛార్జింగ్: కారు నుంచి ఇతర పరికరాలకు లేదా ఇతర కార్లకు ఛార్జింగ్ ఇచ్చే టెక్నాలజీ ఇందులో లేదు.

విన్​ఫాస్ట్​ వీఎఫ్​ ఎంపీవీ 7- ఎవరితో పోటీ?

విన్​ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 మార్కెట్​లో ఉన్న బీవైడీ ఈ-మ్యాక్స్7, రాబోయే కియా కారెన్స్ ఎలక్ట్రిక్, మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రాక్టికల్ ఫ్యామిలీ కార్ కావాలనుకునే వారికి, 517 కి.మీ రేంజ్ అనేది ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. విన్ ఫాస్ట్ VF MPV 7 ధర ఎంత?

దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 24.49 లక్షలుగా నిర్ణయించారు.

2. ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది?

కంపెనీ క్లెయిమ్ ప్రకారం, ఇది సింగిల్ ఛార్జ్‌పై 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

3. ఇందులో ఏవైనా వేరియంట్లు ఉన్నాయా?

ప్రస్తుతానికి ప్రైవేట్ బయ్యర్ల కోసం కేవలం ఒకే ఒక ఫుల్లీ లోడెడ్ వేరియంట్ అందుబాటులో ఉంది. టాక్సీ/ఫ్లీట్ సెగ్మెంట్ కోసం 'లిమో గ్రీన్' వేరియంట్‌ను త్వరలో లాంచ్ చేయనున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More