VinFast VF MPV 7 : 517 కి.మీ రేంజ్‌తో విన్‌ఫాస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎంపీవీ లాంచ్- ధర ఎంతంటే..
VinFast VF MPV 7 launch : 517 కి.మీ రేంజ్‌తో కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎంపీవీ ఇండియాలో లాంచ్ అయ్యింది. దాని పేరు విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7. ఈ 7 సీటర్ ఈవీలో అద్భుతమైన ఫీచర్లు, కలర్ ఆప్షన్స్ వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
VinFast VF MPV 7 range : ఇండియాలో మచ్ అవైటెడ్ 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు 'వీఎఫ్ ఎంపీవీ 7'ని బుధవారం అధికారికంగా లాంచ్ చేసింది విన్‌ఫాస్ట్ సంస్థ. రూ. 24.49 లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూం ధరతో ఈ ఫ్యామిలీ ఈవీ భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. రూ. 21వేల టోకెన్ అమౌంట్‌తో ఈ ఈవీని మీరు బుక్ చేసుకోవచ్చు.

లాంచ్ నేపథ్యంలో ఈ విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7- డిజైన్..
వీఎఫ్ 6, వీఎఫ్ 7 బంపర్ హిట్ అనంతరం ఇండియాలో ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీని తన మూడో మోడల్‌గా తీసుకొచ్చింది వియత్నాంకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. దీని ఫ్రెంట్ డిజైన్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఫ్రెంట్ ఫాసియాలో ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మెర్జ్ అయ్యి 'వీ' ఆకారంలోకి వస్తాయి. ఇది సంస్థ లోగోని ప్రతిబింబిస్తోంది. ఇందులో వర్టికల్లీ ఓరియెంటెడ్ హెడ్‌ల్యాంప్ ఉంది. సైడ్ ప్రొఫైల్‌లో పుల్ స్టైల్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. ఈ విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 19 ఇంచ్ అలాయ్ వీల్స్‌తో వస్తోంది.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7- ఇంటీరియర్..
మినిమలిస్టిక్ డిజైన్‌తో ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ ఇంటీరియర్ హైలైట్‌గా నిలుస్తోంది. 7 సీట్ లేఆవుట్కి 10.1 ఇంచ్ భారీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ని సంస్థ ఇచ్చింది. సీట్లకు లెథరెట్ అప్‌హోలిస్ట్రీ కూడా ఉంది. 6-వే అడ్జెస్టెబుల్ డ్రైవర్ సీట్, సాఫ్ట్ టచ్ మెటీరియల్, 505-50 స్ల్పిట్ సీట్స్ వంటివి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ, అన్ని డోర్లకు స్పీకర్లు, టైప్-ఏ, టైప్-బీ యూఎస్బీ పోర్ట్స్, ముందు- బూట్లో12వీ పోర్ట్‌లు, పాసివ్ కీలెస్ ఎంట్రీ వంటివి ఇందులో ఉన్నాయి.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7- బ్యాటరీ, రేంజ్..
ఈ విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 ఎలక్ట్రిక్ కారులో 60.13 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని వినియోగించారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 517 కి.మీ రేంజ్ (ఏఆర్ఏఐ) ఇస్తుందని సంస్థ చెబుతోంది. 80 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్‌తో ఈ ఈవీని కేవలం 30 నిమిషాల్లో 10శాతం నుంచి 70శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇందులోని మోటార్ 150 కేడబ్ల్యూ పవర్‌ని, 280 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
కాగా ఈ మోడల్ టాప్ స్పీడ్ 140 కేఎంపీహెచ్కే పరిమితం చేయడం గమనార్హం.
ఇక ఈ విన్‌ఫాస్ట్ కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ జెట్ బ్లాక్, ఇన్ఫినిటీ బ్లాంక్, మూన్లైట్ ఓషన్, జెనిత్ గ్రే, సోలార్ రూబీ, ఇంట్రోస్పెక్టివ్ బ్రౌన్ వంటి కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
VinFast VF MPV 7 : విన్‌ఫాస్ట్ 7 సీటర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కారు- కొనొచ్చా? ప్లస్‌లు, మైనస్‌లు..
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7- సేఫ్టీ ఫీచర్లు..
ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కారులో సంస్థ సేఫ్టీకి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఏబీఎస్ విత్ ఈబీడీ, 4 ఎయిర్‌బ్యాగులు, హిల్ స్టార్ట్ అసిస్ట్, రోల్ ఓవర్ మిటిగేషన్, ఆల్ డిస్క్ బ్రేక్స్, ఇంటిగ్రేటెడ్ డైనమిక్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ఆటో ఫోల్డ్ బాడీ కలర్డ్ ఓఆర్వీఎం విత్ ఎల్ఈడీ టర్న్ సిగ్నల్, ఎమర్జెన్సీ సిగ్నల్ సిస్టెమ్ సహా ఇతర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7- నెట్వర్క్ డెవలప్మెంట్, ఫ్రీ ఈవీ ఛార్జింగ్..
కొత్త ఈవీ లాంచ్ నేపథ్యంలో విన్‌ఫాస్ట్ సంస్థ కీలక విషయాన్ని వెల్లడించింది. కొత్త, ప్రస్తుత కస్టమర్లకు ఫ్రీ ఈవీ ఛార్జింగ్ వెసులుబాటును ఇస్తున్నట్టు ప్రకటించింది. 2029 మార్చ్ 31 వరకు ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. అంతేకాదు, పాత ఐసీఈ మోడల్స్‌కి ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా ఇస్తోంది. కస్టమర్స్‌ని మరింత అట్రాక్ట్ చేసేందుకు ఎలక్ట్రిక్ కారుపై 3ఏళ్ల వారెంటీని కూడా ఇస్తోంది.
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థలకు గట్టీపోటీనిస్తూ ఈ విన్‌ఫాస్ట్ సంస్థ ఇండియాలో శరవేగంగా ఎదుగుతోంది. రెండు మోడల్స్‌తోనే బంపర్ హిట్ కొట్టింది. 2026 మార్చ్ నాటికి ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 50 టచ్‌పాయింట్స్ ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 75కు చేర్చాలని చూస్తోంది.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 ఇండియాలోని బీవైడీ ఈమ్యాక్స్ 7, కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ, టయోటా ఇన్నోవా హైక్రాస్, టయోటా ఇన్నోవా క్రిస్టా, మారుతీ సుజుకీ ఇన్విక్టో వంటి మోడల్స్‌కి గట్టిపోటీని ఇస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


