Best Electric car : మొదటిసారి ఈవీ కొంటున్నారా? మీ బడ్జెట్​లో టాప్​ 5 ఎలక్ట్రిక్​ కార్లు ఇవి..

Best First Electric Car : ప్రస్తుతం భారత మార్కెట్​లో ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. అడ్వాన్స్‌డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, మెరుగైన రేంజ్, వేగంగా ఛార్జ్ అయ్యే సదుపాయాలు ఉండటంతో చాలామంది కొత్త కొనుగోలుదారులు ఈవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ అవసరాలకు తగ్గట్టుగా ఏ కారు సరిపోతుందో ఇక్కడ చూడండి..

Published on: Apr 14, 2026, 16:00:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Best Electric car in India : పెరుగుతున్న పెట్రోల్ ధరలు, కాలుష్యం నేపథ్యంలో భారతీయులు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల (ఈవీ) వైపు మొగ్గు చూపుతున్నారు. మెరుగైన ఛార్జింగ్ సదుపాయాలు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు వంటి కారణాలతో మొదటిసారి కారు కొనేవారు కూడా ఈవీలను ఎంచుకుంటున్నారు. మీరు కూడా తొలిసారి ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మార్కెట్​లో ప్రస్తుతం ఉన్న టాప్ 5 ఆప్షన్ల గురించి ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

టాటా టియాగో ఈవీ..
టాటా టియాగో ఈవీ..

ఎంజీ కామెట్ ఈవీ..

సిటీ ట్రాఫిక్‌లో తిరగడానికి చిన్నపాటి కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. దీని కాంపాక్ట్ సైజ్ పార్కింగ్‌కు కూడా చాలా ఈజీగా ఉంటుంది.

ధర: రూ. 6.31 లక్షల నుంచి రూ. 9.97 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). బీఏఏఎస్ ప్రోగ్రామ్ కింద దీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షలకే లభిస్తుంది.

రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కి.మీల రేంజ్ ఇస్తుంది.

ప్రత్యేకత: లోపల క్యాబిన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. నిత్యం ఆఫీస్ ప్రయాణాలు చేసే వారికి ఇది చాలా పొదుపుగా ఉంటుంది.

టాటా టియాగో ఈవీ..

టాటా మోటార్స్ నుంచి అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇది. మధ్యతరగతి కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ లెవల్ ఈవీ.

ధర: రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.14 లక్షల వరకు.

రేంజ్: ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. గరిష్టంగా 315 కి.మీల రేంజ్ అందిస్తుంది.

ప్రత్యేకత: టియాగో అనేది ఒక నమ్మకమైన బ్రాండ్. దీనికి ఛార్జింగ్ నెట్‌వర్క్ సపోర్ట్ కూడా చాలా బాగుంది.

టాటా పంచ్ ఈవీ..

ఎస్‌యూవీ మోడల్ అంటే ఇష్టపడే వారికి 'పంచ్ ఈవీ' ఒక అదిరిపోయే ఆప్షన్! ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ కారు కూడా.

ధర: రూ. 9.69 లక్షల నుంచి రూ. 12.59 లక్షల వరకు. బీఏఏఎస్ కింద ప్రారంభ ధర రూ. 6.49 లక్షలే.

రేంజ్: సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 468 కి.మీల రేంజ్ ఇస్తుంది.

ప్రత్యేకత: కిలోమీటరుకు కేవలం రూ. 2.6 మేర బ్యాటరీ అద్దె చెల్లించే వెసులుబాటు (బీఏఏఎస్ ద్వారా) ఉండటం దీని ప్రత్యేకత.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీ..

మహీంద్రా నుంచి వచ్చిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇది. ఎక్స్​యూవీ400 స్థానంలో 2026 ప్రారంభంలో దీనిని లాంచ్ చేశారు.

ధర: రూ. 13.89 లక్షల నుంచి రూ. 15.46 లక్షల వరకు.

రేంజ్: 39.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది సుమారు 285 కి.మీల రియల్ వరల్డ్ రేంజ్ ఇస్తుంది.

ప్రత్యేకత: టెక్నాలజీ పరంగా ఇది చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. సిటీలోనూ, హైవేల్లోనూ ప్రయాణించడానికి అనువైన కారు.

ఎంజీ విండ్సర్ ఈవీ..

లాంచ్ అయిన అతి తక్కువ సమయంలోనే దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా 'విండ్సర్' రికార్డు సృష్టించింది.

రేంజ్: 52.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్‌తో 360 కి.మీల రేంజ్ ఇస్తుంది.

పెర్ఫార్మెన్స్: 134 బీహెచ్​పీ పవర్, 200 ఎన్​ఎం టార్క్‌తో అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

ప్రత్యేకత: ఫ్యూచరిస్టిక్ డిజైన్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. మొదటిసారి కొనేవారికి ఎలక్ట్రిక్ కారు మంచిదేనా?

అవును. నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ కాబట్టి, దీర్ఘకాలంలో ఇది చాలా ఆదా చేస్తుంది. ప్రస్తుతం ఛార్జింగ్ సెంటర్లు కూడా విరివిగా అందుబాటులో ఉన్నాయి.

2. బీఏఏఎస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి?

బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్ (బీఏఏఎస్) అంటే కారు కొనేటప్పుడు బ్యాటరీ ధరను చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం కారు ధర కట్టి, బ్యాటరీకి కిలోమీటర్ల ప్రాతిపదికన అద్దె చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల కారు ప్రారంభ ధర చాలా తగ్గుతుంది.

3. ఎలక్ట్రిక్ కారును ఇంట్లో ఛార్జ్ చేసుకోవచ్చా?

అవును. ప్రతి ఈవీతో కంపెనీ వారు హోమ్ ఛార్జర్‌ను అందిస్తారు. రాత్రిపూట ప్లగ్ పెడితే ఉదయానికల్లా కారు ఫుల్ ఛార్జ్ అవుతుంది.

4. ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ లైఫ్ ఎన్ని ఏళ్లు ఉంటుంది?

సాధారణంగా ఈవీ బ్యాటరీలకు కంపెనీలు 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని ఇస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More