Tata Tiago EV Facelift : అదిరిపోయేలా బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు- టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ హైలైట్స్ ఇవే..
2026 Tata Tiago EV : టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ మోడల్‌కి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ 2026 టాటా టియాగో ఈవీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ని లాంచ్ చేసిన వెనువెంటనే, టాటా మోటార్స్ మరో అప్‌డేట్‌తో సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల భారత రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటున్న టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ 202 కు సంబంధించిన స్పై చిత్రాలు బయటకు వచ్చాయి. ఈ కొత్త టియాగో ఈవీ అనేక డిజైన్ మార్పులు, బ్యాటరీ అప్‌గ్రేడ్లతో వచ్చే అవకాశం ఉంది. ఈ కారులో రాబోతున్న 5 ప్రధాన మార్పులు ఇవే:

2026 టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్- లాంచ్ ఎప్పుడు?
ఈ టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ టైమ్‌లైన్‌ని టాటా మోటార్స్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, కొత్త టియాగో ఈవీ ఇంకొన్ని నెలల్లో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరికొత్త స్టైలింగ్, బ్యాటరీ అప్‌గ్రేడ్స్‌తో పాటు టాటా టియాగో ఈవీ భారత మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా కొనసాగే అవకాశం ఉంది.
టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ అప్డేట్స్..
1. అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్ డిజైన్..
టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో రాబోతున్న అతిపెద్ద మార్పులలో ఒకటి దాని లైటింగ్ సెటప్. స్పై చిత్రాల ప్రకారం, హెడ్‌ల్యాంప్ ఇంటర్నల్స్ అప్‌డేట్ అయ్యాయి. కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్ డిజైన్‌ను జోడించారు. ఇప్పటివరకు బంపర్‌పై ఉన్న ఎల్ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు (డీఆర్ఎల్) ఇప్పుడు ప్రధాన హెడ్‌ల్యాంప్ యూనిట్‌లోకి మారాయి. ఇది కారుకు ‘ఐబ్రో’ స్టైల్ లైటింగ్ సిగ్నేచర్‌ను ఇస్తుంది.
2. కొత్త ఫ్రంట్ బంపర్, ఎయిర్ డ్యామ్..
2026 టాటా టియాగో ఈవీలో ఫ్రంట్ బంపర్‌ను రీడిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. కింది భాగంలో ఉండే ఎయిర్ డ్యామ్ కొద్దిగా భిన్నంగా కనిపిస్తోంది, కొత్త ప్యాటర్న్‌ను కలిగి ఉండవచ్చు. ఈ చిన్న అప్‌డేట్లు కారుకు ప్రస్తుత మోడల్ కంటే మరింత ఆధునికమైన, స్పోర్టీ లుక్ ఇస్తాయి.
3. కొత్త అలాయ్ వీల్స్..
టెస్టింగ్ మోడల్‌లో సరికొత్త అలాయ్ వీల్స్ సెట్‌ను గమనించవచ్చు. ఖచ్చితమైన డిజైన్ ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, టాటా మోటార్స్ తన ఈవీని మరింత తాజాగా చూపించడానికి కొత్త వీల్ స్టైల్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
4. రివైజ్డ్ టెయిల్ ల్యాంప్స్, లైట్ బార్..
కారు వెనుక భాగంలో కూడా మార్పులు ఉండనున్నాయి. నివేదికల ప్రకారం, టాటా మోటార్స్ టెయిల్‌గేట్‌పై కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్‌ను జోడించే అవకాశం ఉంది. ఇది కారుకు మరింత ఆధునికమైన వెనుక డిజైన్‌ను అందిస్తుంది.
5. బ్యాటరీ అప్‌గ్రేడ్ అవకాశం..
డిజైన్ మార్పులతో పాటు టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో సాంకేతిక మార్పులు కూడా ఉండవచ్చు. అప్‌డేటెడ్ పంచ్ ఈవీలో చూసినట్లుగానే, టాటా ఇందులోకి పెద్ద బ్యాటరీ ప్యాక్‌లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం, టీయాగో ఈవీ 19.2 కేడబ్ల్యూహెచ్, 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 293 కిమీల క్లెయిమ్డ్ రేంజ్‌ను అందిస్తుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. ప్రస్తుత టియాగో ఈవీతో పోలిస్తే 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో రేంజ్ పెరుగుతుందా?
పెరిగే అవకాశం ఉంది! ప్రస్తుతం ఈ కారు గరిష్టంగా 293 కిమీల రేంజ్‌ను అందిస్తోంది. అయితే, కొత్త వెర్షన్‌లో టాటా మోటార్స్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను లేదా మరింత సమర్థవంతమైన ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టవచ్చని అంచనా. దీనివల్ల సింగిల్ ఛార్జ్‌పై రేంజ్ 315 కిమీ నుంచి 330 కిమీ వరకు పెరిగే అవకాశం ఉంది.
2. కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఇంటీరియర్, ఫీచర్లలో ఎలాంటి మార్పులు ఉండవచ్చు?
డిజైన్ మార్పులతో పాటు లోపల కూడా కొన్ని కీలక అప్‌డేట్స్ ఆశించవచ్చు:
పెద్ద టచ్‌స్క్రీన్: ప్రస్తుతం ఉన్న 7-ఇంచ్ స్క్రీన్ స్థానంలో 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది.
డిజిటల్ క్లస్టర్: పంచ్ ఈవీ తరహాలో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఆశించవచ్చు.
అదనపు ఫీచర్లు: వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లను టాటా జోడించే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












