Electric scooters : దేశ ఈవీ మార్కెట్‌లో పెను మార్పులు! టాప్-5లో లేని ఓలా ఎలక్ట్రిక్ పేరు..
Electric two wheeler sales February 2026 : ఓలా ఎలక్ట్రిక్ సంస్థకి మరో షాక్! 2 వీలర్ ఈవీ సెగ్మెంట్లో ఒకప్పుడు నెంబర్ 1 స్థానంలో దూసుకెళ్లిన ఈ సంస్థ ఇప్పుడు టాప్-5లో కూడా చోటు సంపాదించుకోలేకపోయింది. ఈ మేరకు ఫిబ్రవరి 2026 సేల్స్ లిస్ట్‌లో టాప్-5 నుంచి ఔట్ అయ్యింది.
2026 ఫిబ్రవరిలో భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో 76,720 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 46 శాతం వృద్ధితో 1,11,680 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంతేకాదు, ఈ సేల్స్ గణాంకాల్లో తయారీదారుల ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టీవీఎస్ మోటార్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, ఒకప్పుడు నంబర్ 1 స్థానంలో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడసలు టాప్-5 జాబితాలోనే లేకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-5 ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీల వివరాలు ఇక్కడ చూసేయండి..
1. టీవీఎస్ మోటార్..
టీవీఎస్ మోటార్ 31,600 యూనిట్ల విక్రయాలతో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2025 ఫిబ్రవరిలో అమ్ముడైన 18,955 యూనిట్లతో పోలిస్తే ఇది 67 శాతం వృద్ధి.
ప్రధాన కారణం: కంపెనీకి చెందిన ఐక్యూబ్, కొత్తగా వచ్చిన ఆర్బిటర్ మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఉండటమే. ప్రస్తుతం ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 94,999 కాగా, ఆర్బిటర్ ధర రూ. 99,900 గా ఉంది.
2. బజాజ్ ఆటో..
బజాజ్ ఆటో ఈ నెలలో 25,323 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గత ఏడాది (21,751 యూనిట్లు) తో పోలిస్తే ఇది 17 శాతం వార్షిక వృద్ధి.
ప్రధాన కారణం: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణి విస్తరణే దీనికి కారణం. ఇటీవల కంపెనీ చేతక్ సీ2501 పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీని సైతం మార్కెట్లోకి తెచ్చింది.
3. ఏథర్ ఎనర్జీ..
2026 ఫిబ్రవరిలో 20,581 యూనిట్లను విక్రయించి ఏథర్ ఎనర్జీ మూడో స్థానాన్ని దక్కించుకుంది. 2025 ఫిబ్రవరిలోని 11,978 యూనిట్లతో పోలిస్తే ఇది 72 శాతం భారీ వృద్ధి.
ప్రధాన కారణం: కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని రిజ్టా, స్పోర్టీ లుక్ కలిగిన 450 సిరీస్ స్కూటర్లు యువతను ఆకట్టుకోవడమే.
మరీ ముఖ్యంగా ఏథర్ రిజ్టా అనేది దేశంలోనే బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఉంది.
4. హీరో మోటోకార్ప్..
భారతదేశపు అతిపెద్ద టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కి చెందిన ఎలక్ట్రిక్ విభాగం 'విడా' అనూహ్యమైన వృద్ధిని సాధించింది! ఫిబ్రవరి 2025లో కేవలం 2,969 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 364 శాతం వృద్ధితో 12,512 యూనిట్లను విక్రయించింది.
5. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ..
ఈ జాబితాలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ టాప్-5 లోకి దూసుకురావడం. యాంపియర్ బ్రాండ్‌తో ఈ-స్కూటర్లను విక్రయించే ఈ సంస్థ, ఓలా ఎలక్ట్రిక్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానాన్ని ఆక్రమించింది.
గణాంకాలు: 4,725 యూనిట్ల డెలివరీలతో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఓలా కంటే 757 యూనిట్ల ఆధిక్యంలో నిలిచింది.
ఆరో స్థానానికి ఓలా ఎలక్ట్రిక్..
ఒకప్పుడు 2 వీలర్ ఈవీ మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ 2026 ఫిబ్రవరిలో కేవలం 3,968 యూనిట్ల విక్రయాలనే చేసింది. ఫలితంగా ఈ లిస్ట్‌లో ఆరో స్థానానికి పడిపోయింది. జనవరి 2026లో 7,516 యూనిట్లు అమ్ముడవగా, కేవలం ఒక్క నెలలోనే సేల్స్ భారీగా పడిపోవడం గమనార్హం.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ విక్రయాలు ఇంత వేగంగా పడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి?
ఓలా విక్రయాలు తగ్గడానికి కేవలం ఒక కారణం లేదు, పలు అంశాలు దీనిపై ప్రభావం చూపాయి:
సర్వీస్ సవాళ్లు: ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ స్వయంగా అంగీకరించినట్లుగా, కంపెనీ 'సర్వీస్ నెట్‌వర్క్' విస్తరణలో వెనుకబడింది. వాహనాలు రిపేరుకు వస్తే వారాల తరబడి సర్వీస్ సెంటర్లలోనే ఉండిపోవడం వల్ల కస్టమర్లలో నమ్మకం తగ్గింది.
పెరిగిన పోటీ: టీవీఎస్, బజాజ్ వంటి అనుభవజ్ఞులైన కంపెనీలు తమ ఈవీ మోడళ్లను గ్రామస్థాయికి కూడా తీసుకెళ్లాయి. వాటికి ఉన్న విస్తృతమైన సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్ ఓలాకు గట్టి పోటీనిచ్చింది.
క్వాలిటీ సమస్యలు: సాఫ్ట్‌వేర్ గ్లిచెస్, హార్డ్‌వేర్ (సస్పెన్షన్ వంటివి) విరిగిపోవడం వంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల కొత్తగా కారు/స్కూటర్ కొనాలనుకునే వారు ఓలా వైపు వెళ్లడానికి వెనుకాడుతున్నారు.
2. ఓలా ఎలక్ట్రిక్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని (నంబర్ 1 స్థానాన్ని) దక్కించుకోగలదా? కంపెనీ తీసుకుంటున్న చర్యలేంటి?
ఖచ్చితంగా సాధ్యమే, కానీ అందుకు కొంత సమయం పడుతుంది. దీని కోసం ఓలా ప్రస్తుతం ‘హైపర్ సర్వీస్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది:
సర్వీస్ నెట్‌వర్క్ బలోపేతం: రాబోయే కాలంలో సర్వీస్ సెంటర్ల సంఖ్యను పెంచడం, టెక్నీషియన్లకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త మోడళ్లు: కేవలం స్కూటర్లే కాకుండా, 'రోడ్‌స్టర్' సిరీస్ వంటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను కూడా మార్కెట్లోకి తెస్తోంది. ఇవి యువతను ఆకట్టుకుంటే సేల్స్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.
ధరల తగ్గింపు- ఆఫర్లు: మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు కంపెనీ భారీ డిస్కౌంట్ల, బ్యాటరీ వారంటీ ప్లాన్లను కూడా ప్రకటిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


