Honda 0 Alpha : ఎన్న డిజైన్ తలైవా.. అదిరిపోయిన హోండా కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ! టీజర్ విడుదల..
Honda 0 Alpha launch date in India : హోండా సంస్థ నుంచి ఇండియాలోకి కొత్త ఈవీ రాబోతోంది. దాని పేరు హోండా 0 ఆల్ఫా. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సంస్థ టీజ్ చేసింది. ఆ వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
హోండా సంస్థ ఇండియాలో లాంచ్ చేసేందుకు ఒక కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్లాన్ చేస్తోంది. దాని పేరు హోండా 0 ఆల్ఫా. తాజగా ఈ ఈవీని సంస్థ అధికారికంగా టీజ్ చేసింది. అక్టోబర్ 2025లో జరిగిన 'జపాన్ మొబిలిటీ షో'లో తొలిసారిగా ప్రదర్శించిన ఈ మోడల్, హోండా సరికొత్త '0 సిరీస్' ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఒక ఎంట్రీ లెవల్ వాహనంగా నిలవనుంది. ఈ '0 ఆల్ఫా' ప్రొడక్షన్ వెర్షన్ 2027లో భారతదేశంలో అడుగుపెడుతుందని కంపెనీ ధృవీకరించింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఎస్‌యూవీని పూర్తిస్థాయిలో దిగుమతి చేసుకున్న యూనిట్ (సీబీయూ) లాగా కాకుండా, భారతదేశంలోనే స్థానికంగా తయారు చేయనున్నారు!

హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్యూవీ: ఎక్స్టీరియర్ అండ్ డిజైన్..
గతంలో ప్రదర్శించిన పెద్ద '0 ఎస్యూవీ' నుంచి ఈ హోండా 0 ఆల్ఫా డిజైన్ అంశాలను తీసుకున్నప్పటికీ, ఇది మరింత కాంపాక్ట్ రూపంలో ఉంటుంది. దీని ముందు భాగం నిలువుగా ఉండి, నిలువుగా అమర్చిన లైట్లను కలిగి ఉంటుంది. ఈ లైట్లను కలుపుతూ బోనెట్ అంతటా ఒక సన్నని ఎల్ఈడీ స్ట్రిప్ ఉంటుంది. ముందు, వెనుక విండ్‌స్క్రీన్‌లు రెండూ నిటారుగా ఉంటాయి. సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, వెనుక వైపు టేపరింగ్ విండో లైన్, మందపాటి సీ-పిల్లర్, వెనుక భాగంలో ఒక సూక్ష్మమైన స్పాయిలర్ దీని ప్రత్యేకతలు.
మరికొన్ని బాహ్య ఆకర్షణల్లో వెలుగులీనే హోండా బ్యాడ్జ్, ముందు భాగంలో అమర్చిన ఛార్జింగ్ పోర్ట్, కారు వైపులా ఉండే రక్షణ బాడీ క్లాడింగ్ ఉన్నాయి. ఈ ఎస్యూవీ 19- ఇంచ్ ఏరోడైనమిక్, ఐదు-స్పోక్ అలాయ్ వీల్స్‌ను కలిగి ఉండి, పొడుచుకు వచ్చిన వీల్ ఆర్చ్‌లలో అమర్చి ఉంటుంది. వెనుక భాగంలో వెడల్పాటి 'యూ' ఆకారపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనికి తోడు బంపర్‌లో అమర్చిన ఫాక్స్ బాష్ ప్లేట్, అందులో విలీనం చేసిన చిన్న లైట్ యూనిట్లు దీనికి మరింత అందాన్ని ఇస్తాయి.
హోండా 0 ఆల్ఫా: ఇంటీరియర్..
హోండా తన మినిమలిస్ట్ "థిన్" ప్యాకేజింగ్ ఫిలాసఫీని ప్రతిబింబించేలా ఈ హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్యూవీ క్యాబిన్‌ను రూపొందించింది. పూర్తి స్థాయి వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, ఈ ప్రొడక్షన్ మోడల్‌లో ఫ్లాట్ ఫ్లోర్, అధునాతన కనెక్టివిటీ ఆప్షన్లు, పూర్తి స్థాయి భద్రత, సౌకర్యవంతమైన సాంకేతికతలు ఉంటాయని భావిస్తున్నారు. విశాలమైన, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వాతావరణాన్ని సృష్టించడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి సారించింది.
హోండా 0 ఆల్ఫా: ఇంజిన్..
హోండా ఇప్పటివరకు 0 ఆల్ఫా ఖచ్చితమైన పర్ఫార్మెన్స్ గణాంకాలను వెల్లడించలేదు. అయితే, నివేదికల ప్రకారం ఈ ఈవీ 65 కేడబ్ల్యూహెచ్ 75 కేడబ్ల్యూహెచ్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది. దీని శక్తి సింగిల్-మోటార్, ఫ్రంట్-వీల్-డ్రైవ్ సెటప్ ద్వారా అందుతుంది. దీని పవర్ అవుట్‌పుట్, టార్క్ గురించి మరిన్ని వివరాలు లాంచ్‌కు దగ్గరగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
హోండా 0 ఆల్ఫా: ధర (అంచనా)..
భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు ఈ హోండా 0 ఆల్ఫా నేరుగా మారుతీ సుజుకీ ఈ విటారాతో తలపడనుంది. ఇతర పోటీదారులలో మహీంద్రా బీఈ 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ ఉన్నాయి.
దీని ధర రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు, ఇది అభివృద్ధి చెందుతున్న ఈవీ సెగ్మెంట్‌లో ప్రీమియం మరియు పోటీతత్వ ఎంపికగా నిలవనుంది.
తరచూ అడిగే ప్రశ్నలు-
ప్రశ్న 1: హోండా 0 ఆల్ఫా ఇతర ఎలక్ట్రిక్ ఎస్‌యువీల కంటే ఎలా భిన్నంగా ఉండబోతోంది?
సమాధానం: హోండా 0 ఆల్ఫా ప్రధానంగా కంపెనీ కొత్త “(సన్నని, తేలికైన, తెలివైన” ఫిలాసఫీపై ఆధారపడి రూపొందుతోంది. ఇది మినిమలిస్ట్ డిజైన్, అల్ట్రా-థిన్ బ్యాటరీ ప్యాకేజింగ్‌ను కలిగి ఉంటుంది, దీనివల్ల కారు లోపల అత్యంత విశాలమైన క్యాబిన్ లభిస్తుంది. అంతేకాకుండా, ఇది ‘మేడ్ ఇన్ ఇండియా’ అవ్వడం వల్ల, విదేశీ దిగుమతుల కంటే అఫార్డిబుల్ ధరలో అత్యాధునిక జపనీస్ టెక్నాలజీని అందిస్తుంది.
ప్రశ్న 2: ఈ ఎస్యూవీ ఒకసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణించగలదు?
సమాధానం: హోండా ఇంకా అధికారిక రేంజ్ వివరాలను వెల్లడించలేదు. అయితే నివేదికల ప్రకారం దీనిని ఒకసారి పూర్తి ఛార్జింగ్‌పై సుమారు 450 కి.మీ నుంచి 550 కి.మీ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


