Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ సంచలనం! 320 కి.మీ రేంజ్‌తో ఈ-స్కూటర్, ధర ఎంతంటే..
Ola S1 X plus : ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ భారత మార్కెట్లోకి అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో కూడిన 'ఎస్1 ఎక్స్+' కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. పూర్తిగా భారత్‌లోనే తయారైన '4680 భారత్ సెల్' సాంకేతికతతో ఈ స్కూటర్ నడవడం విశేషం. వివరాల్లోకి వెళితే..
Ola electric scooter : బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓలా ఎలక్ట్రిక్, ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. తన సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ ఆధారిత ఎస్1 ఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొత్త 5.2 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ఇంట్రొడక్టరీ ప్రైజ్‌ని రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. అయితే, ఈ ఆఫర్ ఏప్రిల్ 15, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ధర పెరిగే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఈ ఓలా ఎస్1 ఎక్స్+ కొత్త వేరియంట్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
4680 భారత్ సెల్: ఎందుకంత ప్రత్యేకం?
సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీ సెల్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ, ఓలా తన 'ఇన్-హౌస్' టెక్నాలజీతో ఈ సెల్స్‌ను తయారు చేసింది. దీనివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గడమే కాకుండా, ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్లు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. వెర్టికల్ ఇంటిగ్రేషన్ ద్వారా అత్యాధునిక సాంకేతికతను భారీ స్థాయిలో ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని ఓలా స్పష్టం చేసింది.
ఎస్1 ఎక్స్+ కొత్త వేరియంట్- పర్ఫార్మెన్స్, ఫీచర్లు..
ఓలా ఎస్1 ఎక్స్+ 5.2 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ కేవలం రేంజ్ విషయంలోనే కాకుండా, వేగంలోనూ అదరగొడుతోంది.
రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
వేగం: ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు.
మోటార్: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 11 కేడబ్ల్యూ మిడ్-డ్రైవ్ మోటార్‌ను అమర్చారు, ఇది ఇంటిగ్రేటెడ్ ఎంసీయూతో వస్తుంది.
బ్రేకింగ్: భద్రత కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్‌తో పాటు ‘బ్రేక్-బై-వైర్’ టెక్నాలజీని ఇందులో అందించారు.
"ఎస్1 ఎక్స్+ 5.2 కేడబ్ల్యూహెచ్ ద్వారా మా 4680 భారత్ సెల్‌ను భారీ స్థాయిలో మార్కెట్లోకి తీసుకువస్తున్నాము. అత్యాధునిక ఉత్పత్తుల కోసం మేము రూపొందించిన టెక్నాలజీని ఇప్పుడు సామాన్యుల స్కూటర్లలో కూడా వాడుతున్నాం. ఇది ప్రతి భారతీయుడికి ఈవీలను చేరువ చేయడంలో కీలక అడుగు," అని ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధి పేర్కొన్నారు.
ఓలా ప్రస్తుత పోర్ట్‌ఫోలియో..
ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం జెన్ 3 సిరీస్‌లో భాగంగా పలు రకాల మోడళ్లను విక్రయిస్తోంది.
ప్రీమియం మోడల్స్: ఎస్1 ప్రో+ (5.2 కేడబ్ల్యూహెచ్, 4 కేడబ్ల్యూహెచ్), ఎస్1 ప్రో (4 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్).
మాస్ మార్కెట్ మోడల్స్: ఎస్1 ఎక్స్+ (4 కేడబ్ల్యూహెచ్), S1 ఎక్స్ వేరియంట్లు (2 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్, 4 కేడబ్ల్యూహెచ్).
ఎలక్ట్రిక్ బైక్: రోడ్‌స్టర్ సిరీస్‌లో 4.5 కేడబ్ల్యూహెచ్ నుంచి 9.1 కేడబ్ల్యూహెచ్ వరకు, అలాగే రోడ్‌స్టర్ ఎక్స్‌లో 2.5 కేడబ్ల్యూహెచ్ నుంచి 4.5 కేడబ్ల్యూహెచ్ వరకు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఓలా ఎస్1 ఎక్స్+ 5.2 కేడబ్ల్యూహెచ్ రేంజ్ ఎంత?
ఈ కొత్త వేరియంట్ ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
2. 4680 భారత్ సెల్ అంటే ఏమిటి?
ఇది ఓలా ఎలక్ట్రిక్ సొంతంగా భారత్‌లో అభివృద్ధి చేసిన బ్యాటరీ సెల్ సాంకేతికత. ఇది తక్కువ ధరలో ఎక్కువ శక్తిని, మెరుగైన రేంజ్‌ను అందిస్తుంది.
3. ఈ స్కూటర్ గరిష్ట వేగం ఎంత?
ఓలా ఎస్1 ఎక్స్+ 5.2 కేడబ్ల్యూహెచ్ స్కూటర్ గంటకు 125 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు.
4. ఆఫర్ ధర ఎంతకాలం ఉంటుంది?
రూ. 1,29,999 ప్రారంభ ధర ఏప్రిల్ 15, 2026 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ధరలు మారతాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


