VinFast VF MPV 7 : విన్​ఫాస్ట్​ 7 సీటర్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కారు- కొనొచ్చా? ప్లస్​లు, మైనస్​లు..

VinFast VF MPV 7 India launch : విన్​ఫాస్ట్​ వీఎఫ్​ ఎంపీవీ 7 ఈరోజు లాంచ్​కానుంది. మరి ఈ ఎలక్ట్రిక్​ కారు ఎలా ఉంది? ఈ ఎలక్ట్రిక్​ ఎంపీవీ ప్లస్​లు, మైనస్​లను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Apr 15, 2026, 09:10:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

VinFast VF MPV 7 price : వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్.. భారత మార్కెట్​లో నేడు తన మూడవ ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టనుంది. 'విన్‌ఫాస్ట్ వీఎఫ్​ ఎంపీవీ 7' అనే పేరుతో వస్తున్న ఈ సెవెన్-సీటర్ ఎలక్ట్రిక్ కారు, ఇప్పటికే మార్కెట్​లో ఉన్న కియా క్యారెన్స్ ఈవీ, బీవైడీ ఈ-మ్యాక్స్ 7 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

విన్​ఫాస్ట్​ వీఎఫ్​ 7..
విన్​ఫాస్ట్​ వీఎఫ్​ 7..

విన్‌ఫాస్ట్ ఇప్పటికే ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కారు కోసం రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ ప్రారంభించింది. విన్ ఫాస్ట్ నుంచి ఇప్పటికే అందుబాటులో ఉన్న వీఎఫ్6, వీఎఫ్7 మోడళ్ల సరసన ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎంపీవీ చేరనుంది. మరి మీరు ఈ ఈవీని కొనాలా? వద్దా? వీఎఫ్​ ఎంపీవీ 7 ప్లస్​లు, మైనస్​ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

విన్​ఫాస్ట్​ వీఎఫ్​ ఎంపీవీ 7- ప్లస్​లు..

1. సింపుల్ అండ్ ప్రీమియం డిజైన్:

ఎలక్ట్రిక్ కారు డిజైన్ చాలా హుందాగా ఉంటుంది. అనవసరమైన షార్ప్ లైన్లు లేకుండా, 'మినిమలిస్ట్' లుక్‌తో ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఎలక్ట్రిక్ కారు కాబట్టి ముందు భాగం క్లోజ్డ్ ప్యానెల్స్‌తో చాలా క్లీన్‌గా కనిపిస్తుంది.

2. విశాలమైన క్యాబిన్:

ఏడు సీట్ల లేఅవుట్ (2+3+2) తో వచ్చే ఈ విన్​ఫాస్ట్​ వీఎఫ్​ ఎంపీవీ 7లో స్పేస్ విషయంలో రాజీ పడలేదు. ముఖ్యంగా మూడొవ వరుస సీట్లలో కూడా లెగ్ రూమ్, హెడ్ రూమ్ ఎక్కువగానే ఉండటం విశేషం. లాంగ్ జర్నీలు చేసే కుటుంబాలకు ఇది పెద్ద ప్లస్ పాయింట్.

3. పవర్‌ఫుల్ పవర్‌ట్రెయిన్:

బ్యాటరీ: 60.13 కేడబ్ల్యూహెచ్ భారీ బ్యాటరీ ప్యాక్.

రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

పర్ఫార్మెన్స్: 201 బీహెచ్​పీ పవర్, 280 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 10 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.

ఛార్జింగ్: కేవలం 30 నిమిషాల్లో 10% నుంచి 70% వరకు ఛార్జింగ్ ఎక్కుతుంది.

విన్​ఫాస్ట్​ వీఎఫ్​ ఎంపీవీ 7- మైనస్​లు..

1. క్యాబిన్ లోపల శబ్దం :

విన్​ఫాస్ట్​ వీఎఫ్​ ఎంపీవీ 7 డ్రైవింగ్ సమయంలో విండ్ బ్లాస్ట్ (గాలి శబ్దం) క్యాబిన్ లోపలికి ఎక్కువగా వినిపిస్తోంది. ప్రీమియం కారుగా చెప్పుకుంటున్నప్పుడు, ఇన్సులేషన్ విషయంలో విన్‌ఫాస్ట్ ఇంకా శ్రద్ధ వహించాల్సి ఉంది.

2. ఫిజికల్ బటన్స్ లేకపోవడం:

కారులోని ఫీచర్లన్నీ టచ్ స్క్రీన్ ద్వారానే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏసీ మార్చాలన్నా లేదా ఇతర సెట్టింగ్స్ కోసం స్క్రీన్ చూడటం డ్రైవర్ దృష్టిని మరల్చవచ్చు. ఫిజికల్ బటన్స్ ఉంటే బాగుండేదనేది వినియోగదారుల అభిప్రాయం.

3. కీలక ఫీచర్ల గైర్హాజరు:

నేటి తరం కస్టమర్లు కోరుకునే సన్‌రూఫ్, అడాస్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో లేవు. రూ. 15-20 లక్షల బడ్జెట్‌లో కారు కొనేవారు ఈ ఫీచర్లను కచ్చితంగా ఆశిస్తారు.

లాంచ్​ ఈవెంట్​లో ఈ విన్​ఫాస్ట్​ వీఎఫ్​ ఎంపీవీ 7కి సంబంధించిన ధరలను, రేంజ్​ వివరాలను సంస్థ వెల్లడిస్తుంది.

ఇక విన్​ఫాస్ట్​ వీఎఫ్​7 ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూని తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. విన్‌ఫాస్ట్ VF MPV 7 బుకింగ్ ధర ఎంత?

దేశవ్యాప్తంగా రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

2. ఈ కారు రేంజ్ ఎంత?

కంపెనీ క్లెయిమ్ ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది.

3. ఇది ఎవరికి గట్టి పోటీ ఇస్తుంది?

భారత మార్కెట్లో ఇది కియా క్యారెన్స్ ఈవీ, బీవైడీ ఈ-మ్యాక్స్ 7, మహీంద్రా XEV 9e మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

4. దీని టాప్ స్పీడ్ ఎంత?

టెస్టింగ్ సమయంలో ఈ కారు గరిష్టంగా గంటకు 162 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More