Canara Bank Recruitment : కెనరా బ్యాంక్‌లో 3,500 అప్రెంటిస్ ఉద్యోగాలు - అక్టోబర్ 1 నుంచి దరఖాస్తులు

Canara Bank Apprentice Recruitment 2026 : కెనరా బ్యాంక్ 3,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 1 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Sep 28, 2026, 21:06:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Canara Bank Apprentice Recruitment 2026 : బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగ యువతకు కెనరా బ్యాంక్ గొప్ప అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లో 3,500 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జాతీయ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) అధికారిక పోర్టల్ nats.education.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

కెనరా బ్యాంక్‌లో 3,500 అప్రెంటిస్ ఉద్యోగాలు (Pradeep Gaur/ Mint)
కెనరా బ్యాంక్‌లో 3,500 అప్రెంటిస్ ఉద్యోగాలు (Pradeep Gaur/ Mint)

దరఖాస్తు తేదీలు….

ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 1, 2026న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు అక్టోబర్ 17, 2026 నాటికి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్‌ను జనవరి 01, 2023 కంటే ముందు కాకుండా, సెప్టెంబర్ 01, 2026 తర్వాతి తేదీ కాకుండా పూర్తి చేసి ఉండాలి.అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. సెప్టెంబర్ 02, 1998 కంటే ముందు, సెప్టెంబర్ 01, 2006 కంటే తర్వాత జన్మించిన వారు ఈ పోస్టులకు అనర్హులు.

ఎంపిక విధానం….

ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా నేరుగా మార్కుల ఆధారంగా ఎంపిక చేపడతారు. అభ్యర్థులు 12వ తరగతి (10+2) లేదా డిప్లొమా పరీక్షల్లో సాధించిన మార్కుల శాతం ఆధారంగా రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు.

  • జనరల్ అభ్యర్థులకు 12వ తరగతి లేదా డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ, PwBD అభ్యర్థులకు కనీసం 55 శాతం మార్కులు ఉండటం తప్పనిసరి.
  • ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే, వయస్సులో పెద్దవారికి మెరిట్ జాబితాలో మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
  • మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన సమయానికి స్థానిక భాషా పరిజ్ఞానాన్ని కూడా పరిశీలిస్తారు.

జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, PwBD వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించవచ్చు.

దరఖాస్తు చేసుకునే విధానం

  • ముందుగా nats.education.gov.in అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి ప్రాథమిక వివరాలతో నమోదు చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను సమగ్రంగా నింపాలి.
  • నిర్ణీత దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
  • దరఖాస్తు సబ్‌మిట్ చేశాక వచ్చే కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ కాపీని భద్రపరుచుకోవాలి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More