...
...
Next Story

CAT 2025 ఆన్సర్​ కీ విడుదల- అభ్యంతరాలను తెలియజేసేందుకు ఛాన్స్​..

ఐఐఎం క్యాట్ 2025 ఆన్సర్ కీ విడుదలైంది. అభ్యర్థులకు అభ్యంతరాలు ఎవైనా ఉంటే వాటిని తెలియజేసేందుకు అవకాశం ఉంది. ఆన్సర్​కి ఎలా చెక్​ చేయాలి? అభ్యంతరాలను తెలియజేసేందుకు చివరి తేదీ ఏది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 5, 2025, 06:00:18 IST
Advertisement

కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2025 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని (సమాధానాల కీ) విడుదల చేసింది కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం). ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక క్యాట్ 2025 వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆన్సర్ కీని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలైన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఆన్సర్ కీని పొందవచ్చు.

క్యాట్​ 2025 ఆన్సర్ కీ ఇలా చెక్​ చేసుకోండి..

క్యాట్​ 2025 ఆన్సర్​ కీ విడుదల
క్యాట్​ 2025 ఆన్సర్​ కీ విడుదల

విద్యార్థుల సౌలభ్యం కోసం, క్యాట్​ 2025 ఆన్సర్ కీని తనిఖీ చేయడానికి ఇక్కడ స్టెప్స్​ ఉన్నాయి:

స్టెప్​ 1- క్యాట్ 2025 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో, 'Candidate Response/Provisional Answer key' అనే లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.

స్టెప్​ 4- ఆన్సర్ కీని తనిఖీ చేయండి.

అభ్యర్థులు డిసెంబర్ 8, 2025 మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబర్ 10, 2025 రాత్రి 11:55 గంటల వరకు ఆన్సర్ కీపై తమ అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చు. సంస్థ ద్వారా సరైనవిగా భావించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, దానికి అనుగుణంగా కొత్త ఆన్సర్ కీని విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, డిసెంబర్ నెలాఖరులోపు క్యాట్ ఫైనల్ ఫలితాన్ని ఐఐఎం విడుదల చేయనుంది.

గేట్​ 2026 అడ్మిట్​ కార్డులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

క్యాట్ 2025 పరీక్ష వివరాలు..

క్యాట్ 2025 పరీక్ష దేశవ్యాప్తంగా 170 నగరాలలో 339 పరీక్షా కేంద్రాల్లో జరిగింది.

ఎంబీఏ ప్రవేశ పరీక్ష కోసం మొత్తం 2.95 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, దాదాపు 2.58 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.

పరీక్ష కన్వీనర్ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం హాజరు శాతం సుమారుగా 86% ఉంది.

క్యాట్​ 2025- ప్రశ్నపత్రం రూపకల్పన..

క్యాట్ 2025 ప్రశ్నపత్రంలో మొత్తం 68 ప్రశ్నలు ఉన్నాయి. వీటిలో..

వర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్ (వీఏఆర్​సీ) విభాగం నుంచి 24 ప్రశ్నలు.

డేటా ఇంటర్‌ప్రెటేషన్, లాజికల్ రీజనింగ్ (డీఐఎల్​ఆర్​) విభాగం నుంచి 22 ప్రశ్నలు.

క్వాంటిటేటివ్ ఎబిలిటీ (క్యూఏ) విభాగం నుంచి 22 ప్రశ్నలు ఉన్నాయి.

క్యాట్ పరీక్ష అనేది ఐఐఎంలలో (ఐఐఎంలు), ఇతర ప్రముఖ ఎంబీఏ సంస్థల్లో వివిధ పోస్ట్‌గ్రాడ్యుయేట్, ఫెలో/డాక్టోరల్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం నిర్వహించే ఒక కీలకమైన జాతీయ స్థాయి పరీక్ష. అభ్యర్థులు అడ్మిషన్ ఇచ్చే సంస్థల పూర్తి జాబితాను అధికారిక క్యాట్ వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe