...
...
Next Story

CAT 2025 : సెక్షన్ల వారీగా టిప్స్​- స్కోరింగ్​ స్ట్రాటజీలు.. ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి!

క్యాట్​ 2025 అభ్యర్థులకు అలర్ట్​! వోక్సెన్​ యూనివర్సిటీకి చెందిన కమ్యూనికేషన్స్​ అండ్​ ఫైనాన్స్​ మేనేజర్​ కీర్తన వర్మ.. అభ్యర్థులకు కీలక టిప్స్​ని, పరీక్షలో మార్కులు స్కోర్​ చేసేందుకు కావాల్సిన స్ట్రాటజీలను వెల్లడించారు. మీరు క్యాట్​ 2025 రాస్తుందే ఇవి కచ్చితంగా ఉపయోగపడతాయి. ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 19, 2025, 07:30:10 IST
Advertisement

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్ (ఐఐఎం-కే) ఆధ్వర్యంలో క్యాట్ 2025 పరీక్ష.. నవంబర్ 30, 2025న జరగనుంది. సుమారు 2.95 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారని అంచనా. దేశవ్యాప్తంగా దాదాపు 170 నగరాల్లో ఉన్న పరీక్షా కేంద్రాల్లో ఈ క్యాట్ పరీక్ష మూడు సెషన్లలో జరుగుతుంది.

క్యాట్​ 2025 ప్రిపరేషన్​ టిప్స్​.. (Deepak Gupta/ HT file)
క్యాట్​ 2025 ప్రిపరేషన్​ టిప్స్​.. (Deepak Gupta/ HT file)

కామన్ అడ్మిషన్ టెస్ట్ రాయడానికి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం, వోక్సెన్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ ఫైనాన్స్ మేనేజర్ అయిన నిపుణురాలు కీర్తన వర్మ.. సెక్షన్ల వారీగా అనుసరించాల్సిన ముఖ్యమైన టిప్స్​, స్కోరింగ్ వ్యూహాలను పంచుకున్నారు. ఇవి క్యాట్​ 2025 అభ్యర్థులకు కచ్చితంగా ఉపయోగపడతాయి.

1. సరైన ప్రిపరేషన్ మైండ్‌సెట్

క్యాట్ పరీక్షకు సిద్ధమవ్వడానికి సరైన మానసిక స్థితిని పొందేందుకు నాకు దాదాపు మూడు నెలలు పట్టింది. క్యాట్‌ను తప్పక పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాక, దాదాపు రెండు వారాల పాటు నేను పరీక్షా విధానాన్ని పరిశోధించాను, ఇంట్రడక్షన్ వీడియోలు చూశాను, నిపుణులు సిఫార్సు చేసిన కొన్ని పుస్తకాలను పరిశీలించాను.

నా వ్యూహం చాలా సింపుల్​:

ముందు కాన్సెప్టులు, తర్వాత వేగం.

ప్రశ్నలను వేగంగా పరిష్కరించడానికి ప్రయత్నించే ముందు, ప్రాథమిక అంశాలను పూర్తిగా అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాను.

క్యాట్ అంటే పెద్ద ఫార్ములాలు గుర్తుంచుకోవడం కాదు, తెలివైన షార్ట్‌కట్‌లు, బలమైన ప్రాథమిక అంశాలు కలిగి ఉండటమేనని నేను గ్రహించాను.

కాన్సెప్టులు స్పష్టంగా అర్థమయ్యాక, నా దృష్టిని 'వేగం' వైపు మళ్లించాను. అదే సమయంలో, నా బలాన్ని ఉపయోగించుకున్నాను. వీఏఆర్‌సీ డీఐఎల్‌ఆర్ సెక్షన్ల కోసం ఎక్కువ సమయం కేటాయించి, క్యూఏ కోసం తక్కువ, కానీ స్థిరమైన సమయాన్ని కేటాయించాను. ఈ నిర్మాణాత్మక విధానం నాకు నమ్మకాన్ని, క్రమశిక్షణను ఇచ్చింది.

వీఏఆర్‌సీ

వీఏఆర్‌సీ విషయానికి వస్తే, ఊరికే చదవడం కాకుండా, దృష్టితో, ఇంటెంట్​తో చదవడం చాలా ముఖ్యం. ఏ ప్యాసేజ్‌ను చదివినా, దాని ఉద్దేశం, నిర్మాణం, టోన్‌ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాను. ర్యాండమ్​ ఆర్టికల్స్‌ను పైపైన చదవకుండా జాగ్రత్త పడ్డాను.

క్యూఏ (క్వాంట్​)

ప్రారంభంలో, క్యూఏ నా బలహీనమైన సెక్షన్. చాలా మంది అభ్యర్థుల మాదిరిగానే, నేను కూడా నా బలహీనతపై అతిగా దృష్టి పెట్టే తప్పు చేశాను. అయితే, తర్వాత నేను నా బలాన్ని పెంచుకోవడం ద్వారా మొత్తం స్కోర్‌ను మెరుగుపరుచుకోవడం మరింత ప్రభావవంతమైన మార్గమని గ్రహించాను. అయినప్పటికీ, నేను క్యూఏను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేశాను. కొన్నిసార్లు సరదాగా కూడా! ఉదాహరణకు, రోడ్డుపై సంఖ్యలు లేదా నంబర్ ప్లేట్‌లపై సంఖ్యలు చూసినప్పుడల్లా, షార్ట్‌కట్‌లను ఉపయోగించి, చిన్న సమస్యలను మెంటల్​గా పరిష్కరించేదాన్ని. క్యూఏ నన్ను నిరాశపరిచినప్పుడల్లా, నేను వీఏఆర్‌సీకి మారి, మళ్లీ ఆత్మవిశ్వాసం పొంది, కొత్త ఆలోచనతో క్యూఏ వద్దకు తిరిగి వచ్చేదాన్ని. మీ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం, మనస్సును స్పష్టంగా ఉంచుకోవడం ముఖ్యం.

డీఐఎల్‌ఆర్

డీఐఎల్‌ఆర్ విషయంలో, నా ప్రాధాన్యత వేగం గురించి చింతించకుండా, మొదట సెట్‌లను పరిష్కరించడంపైనే ఉండేది. సెట్‌లను ఛేదించగలను అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం నాకు చాలా ముఖ్యం. సెట్‌లను పరిష్కరించడం అలవాటయ్యాక, వేగం- ఖచ్చితత్వం దానంతటవే పెరిగాయి. ఈ విషయంలో మాక్ టెస్ట్‌లు కీలక పాత్ర పోషించాయి.

3. టైమ్​ మేనేజ్​మెంట్​

క్యాట్​ పరీక్ష సమయంలో, ముఖ్యంగా డీఐఎల్‌ఆర్ వంటి ఊహించలేని సెక్షన్లలో, ప్రశాంతంగా ఉండటం, తొందరపాటు ప్రయత్నాలను నివారించడంపై దృష్టి పెట్టాను. క్యాట్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి, నేను ఎప్పుడూ ఊహించి (గెస్​వర్క్​) సమాధానాలను గుర్తించలేదు. నేను ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించే ముందు దాన్ని పూర్తిగా చదివాను. అలాగే సరైన ఆప్షన్‌ను ఎంచుకోవడానికి ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించాను. అన్నిటికంటే ముఖ్యంగా, ఒక ప్రశ్నకు చిక్కుకుపోయినట్లయితే, దానిపై సమయాన్ని వృథా చేయకుండా, వెంటనే తదుపరి ప్రశ్నకు వెళ్లేదాన్ని. ఇది నా మొత్తం స్కోర్‌ను తగ్గించకుండా కాపాడింది. ఆ మైండ్‌సెట్ నాకు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడింది.

క్యాట్‌లో, ముఖ్యంగా డీఐఎల్‌ఆర్‌లో, సమయ నిర్వహణ కీలకం. నా విధానం:

  • ఏదైనా ప్రయత్నించే ముందు ప్రశ్నను సరిగ్గా చదవడం.
  • ఆప్షన్‌లను తనిఖీ చేసి, తప్పు సమాధానాలను తొలగించడం ద్వారా ప్రారంభించడం.
  • సరైన సమయంలో తదుపరి ప్రశ్నకు వెళ్లడం వల్ల మార్కులను కోల్పోకుండా, నా స్కోర్‌ను పెంచుకోవడానికి సహాయపడింది.

4. సాధారణ తప్పులు – వాటిని ఎలా నివారించాలి

అభ్యర్థులు చేసే అతిపెద్ద తప్పులలో ఒకటి అహం జోక్యం చేసుకోనివ్వడం! అంటే.. "నేను దీన్ని ఒక సంవత్సరం చదివాను, నేను ఎందుకు దీన్ని పరిష్కరించలేకపోతున్నాను?" అని అనుకోవడం. క్యాట్ పరీక్ష అహాన్ని కాదు; తెలివైన నిర్ణయాలను తీసుకునే నైపుణ్యాన్ని గౌరవిస్తుంది.

నివారించాల్సిన ముఖ్యమైన తప్పులు:

ఒక ప్రశ్నను మీరు తప్పక పరిష్కరించగలరని భావించినంత మాత్రాన, దానిపై సమయాన్ని వృథా చేయవద్దు.

డీఐఎల్‌ఆర్‌లో, ఆప్షన్‌లు ఒకేలా కనిపిస్తే, గుడ్డిగా ఒకదాన్ని గుర్తించవద్దు. ఒక నిమిషం అదనంగా ఖర్చు చేయడం లేదా ఆ ప్రశ్నను వదిలివేయడం మంచిది.

మంచి మాక్ టెస్ట్ స్కోర్ పరీక్ష రోజున కూడా అదే వస్తుందని హామీ ఇవ్వదు. కాబట్టి ‘గట్​ ఫీలింగ్​’ సమాధానాలను నివారించండి.

5. క్యాట్ ఆశావహులకు తుది సలహా

చాలా మంది అభ్యర్థులు తాము ఐఐఎంలో సీటు పొందలేమని నిరాశ చెందుతుంటారు. నా వరకు, క్యాట్ అంటే ఐఐఎంల గురించి మాత్రమే కాదు. "చాలా కష్టం" లేదా "సమయం వృథా" అని ఇతరులు చెప్పిన ఒక లక్ష్యాన్ని నేను సాధించగలనని నాకు నేను నిరూపించుకోవడం!

  • మీ ప్రయాణాన్ని నిర్వచించేవి:
  • నిలకడ
  • ఓర్పు
  • ప్రాక్టీస్
  • మీరు వదులుకోరనే నమ్మకం

ప్రశాంతంగా, దృష్టితో ఉండండి, మీరు పెట్టిన కృషిని నమ్మండి. మీ ప్రయత్నం నిజాయితీగా ఉంటే, విషయాలు చివరికి సక్రమంగా జరుగుతాయి.

– కీర్తన వర్మ, కమ్యూనికేషన్స్​ అండ్​ ఫైనాన్స్​ మేనేజర్​, వోక్సెన్​ యూనివర్సిటీ

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks