CBSE board exams : సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు 2026- అడ్మిట్ కార్డును ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) 10, 12 తరగతుల బోర్డు పరీక్షల హాల్ టికెట్లను వచ్చే వారం విడుదల చేయనుంది. ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: Jan 30, 2026, 13:10:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అలర్ట్​! ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను (హాల్ టికెట్లు) బోర్డు వచ్చే వారం విడుదల చేసే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డులు విడుదలైన వెంటనే, విద్యార్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుంచి వాటిని పొందవచ్చు.

సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12 పరీక్షల అప్డేట్​..
సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12 పరీక్షల అప్డేట్​..

గత ఏడాది (2025) ఫిబ్రవరి 3వ తేదీన బోర్డు అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పాత ధోరణులను పరిశీలిస్తే, ఈసారి 2026 బోర్డు పరీక్షల హాల్ టికెట్లు ఫిబ్రవరి 10వ తేదీలోపు వచ్చే అవకాశం ఉందని విద్యా వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ప్రైవేట్ అభ్యర్థులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఇప్పటికే (జనవరి 19న) బోర్డు విడుదల చేసింది.

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026- వచ్చే నెల 17 నుంచి ఎగ్జామ్స్​..

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్​ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంతో సీబీఎస్‌ఈ ఇప్పటికే పోర్టల్‌ను యాక్టివేట్ చేసింది. కానీ అధికారికంగా అడ్మిట్ కార్డులను ఇంకా జారీ చేయలేదు.

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026- అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

హాల్ టికెట్లు విడుదలైన తర్వాత విద్యార్థులు ఈ కింది స్టెప్స్​ని అనుసరించవచ్చు:

స్టెప్​ 1- ముందుగా అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in ను సందర్శించాలి.

స్టెప్​ 2- హోమ్‌పేజీలో "CBSE Board Exams Class 10 Admit Card" లేదా "Class 12 Admit Card" లింక్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్​ 3- మీ రోల్ నంబర్ లేదా అడిగిన ఇతర వివరాలను నమోదు చేయాలి.

స్టెప్​ 4- స్క్రీన్‌పై మీ అడ్మిట్ కార్డు కనిపిస్తుంది.

స్టెప్​ 5- దానిని డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026- అడ్మిట్ కార్డులో ఉండే వివరాలు..

విద్యార్థులు తమ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఈ కింది వివరాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలి:

విద్యార్థి పేరు, రోల్ నంబర్

స్కూల్ నంబర్, పరీక్షా కేంద్రం నంబర్

విద్యార్థి ఫోటో

సబ్జెక్టులు, వాటి కోడ్‌లు

పరీక్ష తేదీలు

అడ్మిట్ కార్డ్ ఐడీ

పుట్టిన తేదీ, పరీక్ష పేరు

పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు సీబీఎస్​ఈ బోర్డు పరీక్షల అడ్మిట్ కార్డును వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించడం మంచిది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More