కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) వింటర్ బౌండ్ పాఠశాలలకు (తీవ్రమైన చలి కారణంగా శీతాకాలంలో మూసివేసే ప్రాంతాల్లోని స్కూళ్లు) 10, 12వ తరగతుల ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ఈ ప్రాక్టికల్, ప్రాజెక్ట్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలను 2026 నవంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సంబంధిత పరీక్షల తేదీల వివరాలను అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు తెలిపింది.
బోర్డు కీలక మార్గదర్శకాలు (SOPs)

వింటర్ బౌండ్ పాఠశాలల్లో ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్‌మెంట్లను పారదర్శకంగా, నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసేందుకు సీబీఎస్ఈ పలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs), మార్గదర్శకాలను జారీ చేసింది.
అభ్యర్థుల తుది జాబితా: పాఠశాలలు ఆన్‌లైన్ ద్వారా బోర్డుకు సమర్పించిన 'అభ్యర్థుల జాబితా' (LOC) లో పేరు ఉన్న విద్యార్థులను మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలకు అనుమతించాలి. ఎల్వోసీలో పేరు లేని ఏ విద్యార్థినీ పరీక్షకు అనుమతించకూడదని స్పష్టం చేసింది.
ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ల నియామకం: ఇతర పాఠశాలలకు చెందిన ఎగ్జామినర్లు, అబ్జర్వర్ల నియామక వివరాలు అందకపోతే పాఠశాల యాజమాన్యాలు వెంటనే సంబంధిత రీజినల్ ఆఫీసును సంప్రదించాలి.
ఆన్సర్ బుక్స్ డిస్పాచ్: 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి కాగానే సమాధాన పత్రాలను (Answer Books) సంబంధిత ప్రాంతీయ కార్యాలయాలకు సకాలంలో పంపించాల్సి ఉంటుంది.
మార్కుల నమోదుపై స్పష్టత.. గడువు పెంపు ఉండదు
ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైన రోజు నుంచే విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పరీక్షల ముగింపు తేదీ నాటికి మార్కుల నమోదు ప్రక్రియ అంతా పూర్తి కావాలని సీబీఎస్ఈ ఆదేశించింది. గడువు ముగిసిన తర్వాత మార్కుల నమోదుకు సంబంధించి ఎలాంటి పొడిగింపును బోర్డు పరిశీలించదు.
ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్మెంట్లలో విద్యార్థులకు కేటాయించే మార్కులకు వార్షిక థియరీ పరీక్ష మార్కులతో సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఈ మార్కుల వివరాలను విద్యార్థులకు గానీ, ఇతర ఏ వ్యక్తికి గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని బోర్డు స్పష్టం చేసింది.
ప్రధాన ప్రాక్టికల్ పరీక్షల ప్రకటన త్వరలోనే
{{/usCountry}}ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్మెంట్లలో విద్యార్థులకు కేటాయించే మార్కులకు వార్షిక థియరీ పరీక్ష మార్కులతో సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఈ మార్కుల వివరాలను విద్యార్థులకు గానీ, ఇతర ఏ వ్యక్తికి గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని బోర్డు స్పష్టం చేసింది.
ప్రధాన ప్రాక్టికల్ పరీక్షల ప్రకటన త్వరలోనే
{{/usCountry}}వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చలికాలంలో సెలవులు ఉండే వింటర్ బౌండ్ స్కూళ్లకు ముందుగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. మిగిలిన సాధారణ సీబీఎస్ఈ పాఠశాలలకు సంబంధించిన 10, 12వ తరగతుల ప్రధాన ప్రాక్టికల్ పరీక్షల తేదీలను వింటర్ బౌండ్ పాఠశాలల ప్రాక్టికల్స్ ముగిసిన వెంటనే విడుదల చేయనున్నారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని అధికారులు సూచించారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.