సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల శాంపిల్ ప్రశ్నపత్రాలను (SQP), మార్కింగ్ స్కీమ్‌లను (MS) అందుబాటులోకి తీసుకొచ్చింది. 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, బోధకులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in ద్వారా వీటిని పరిశీలించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలపై ప్రధాన దృష్టి

ప్రశ్నాపత్రం రూపకల్పన, విశ్లేషణ విధానంపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకే వీటిని విడుదల చేసినట్లు సీబీఎస్ఈ తెలిపింది. తరగతి గది బోధనలో సైతం ఈ శాంపిల్ పేపర్లను ఉపయోగించుకోవాలని సూచించింది. పుస్తకాల్లోని సిద్ధాంతపరమైన అంశాలను నిజ జీవితంలో ఎలా అన్వయించాలో (Real-life application of concepts) నేర్పించడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు వెల్లడించింది.
పరీక్షా విధానంలో మార్పులు లేవు
అకడమిక్ సెషన్ 2026-27కు సంబంధించి ప్రశ్నాపత్రం నమూనాలోగానీ, మూల్యాంకన విధానంలోగానీ ఎలాంటి మార్పులు చేయలేదు. 2025-26 విద్యా సంవత్సరంలో అమలు చేసిన ఉత్తీర్ణత నిబంధనలే (Passing criteria) ఈసారి కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. అయితే, బోర్డు పరీక్షల టైమ్‌టేబుల్ (డేట్‌షీట్)ను సీబీఎస్ఈ ఇంకా విడుదల చేయలేదు. తాజా అప్‌డేట్ల కోసం విద్యార్థులు అధికారిక పోర్టల్‌ను నిరంతరం పరిశీలిస్తుండాలని కోరింది.
శాంపిల్ పేపర్లు డౌన్‌లోడ్ చేసుకునే విధానం
- ముందుగా సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో కనిపించే 'CBSE Class 10, 12 Sample Papers 2026' లింక్‌పై క్లిక్ చేయండి.
- కొత్త పేజీ ఓపెన్ అయిన తర్వాత పదో తరగతి లేదా 12వ తరగతి ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీ సబ్జెక్టుకు సంబంధించిన శాంపిల్ పేపర్, మార్కింగ్ స్కీమ్ లింక్‌పై క్లిక్ చేస్తే పీడీఎఫ్ అందుబాటులోకి వస్తుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం ఆ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసి ఉంచుకుంటే ప్రిపరేషన్‌కు సులువవుతుంది.