CBSE Class 12 exams : తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా- టాప్ మార్కులు సాధించేందుకు టిప్స్​..

సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షలకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే. చివరి నిమిషంలో టెన్షన్​ పడకుండా పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్​ని సాగిస్తే మంచి ఫలితాలను పొందొచ్చు. ఈ నేపథ్యంలో నిపుణులు చెబుతున్న కొన్ని కీలక టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 09, 2026 11:20 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ పరీక్షలకు సమయం ఆసన్నమైంది! ఈ నెల 17 నుంచి సీబీఎస్​ఈ 10, 12 తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం "12వ తరగతి బోర్డు పరీక్షలు" అనడంలో సందేహం లేదు. పైచదువుల కోసం మంచి కాలేజీని ఎంచుకోవాలన్నా, కెరీర్‌లో స్థిరపడాలన్నా ఈ మార్కులే పునాది.

సీబీఎస్​ఈ 12వ తరగతి ప్రిపరేషన్​ టిప్స్​..
సీబీఎస్​ఈ 12వ తరగతి ప్రిపరేషన్​ టిప్స్​..

పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో, లక్షలాది మంది విద్యార్థులు ప్రిపరేషన్‌లో నిమగ్నమై ఉంటారు. అయితే, ఈ చివరి రోజుల్లో కేవలం చదవడమే కాకుండా, సరైన వ్యూహంతో ముందుకు వెళితేనే అత్యుత్తమ ఫలితాలు సాధించగలం. మీ ప్రిపరేషన్‌ను మరింత పదును పెట్టేందుకు నిపుణులు సూచిస్తున్న కీలక టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి. ఇవి మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి.

సీబీఎస్​ఈ క్లాస్​ 12 పరీక్షలు- ఇవి ఫాలో అవ్వండి..

1. పక్కా ప్లానింగ్ ఉండాల్సిందే

ఏ పరీక్షకైనా విజయం అనేది ప్లానింగ్‌తోనే మొదలవుతుంది. జేఈఈ లేదా నీట్ వంటి పోటీ పరీక్షలైనా, బోర్డు పరీక్షలైనా ఒక క్రమశిక్షణతో కూడిన టైమ్ టేబుల్ అవసరం. మీకు అందుబాటులో ఉన్న మిగిలిన రోజులను పరిగణనలోకి తీసుకుని, ప్రతి సబ్జెక్టుకు తగిన సమయాన్ని కేటాయిస్తూ షెడ్యూల్ సిద్ధం చేసుకోండి.

2. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలే మీ వేదాలు

సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలకు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ అత్యంత కీలకం. ప్రాథమిక అంశాల నుంచి క్లిష్టమైన కాన్సెప్ట్‌ల వరకు అన్నీ ఇందులో స్పష్టంగా ఉంటాయి. డయాగ్రమ్స్, ఫ్లో చార్ట్స్ ద్వారా అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఇతర రిఫరెన్స్ పుస్తకాలు చదివినా, ముందుగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను పూర్తి చేయడం మర్చిపోవద్దు.

3. సందేహాలను అప్పటికప్పుడే తీర్చుకోండి

చదువుతున్నప్పుడు ఏదైనా టాపిక్‌పై సందేహం వస్తే దాన్ని రేపటికి వాయిదా వేయకండి. ఆ రోజే ఆ కాన్సెప్ట్‌ను క్లియర్ చేసుకోండి. ప్రతి చాప్టర్ చివరన ఉండే ప్రశ్నలు, ఉదాహరణలను ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా ఎంసీక్యూలు, షార్ట్ ఆన్సర్స్ రాసేటప్పుడు టైమర్ పెట్టుకోండి. ఇది మీ వేగాన్ని పెంచుతుంది.

4. మాక్ టెస్టులతో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి

గత కొన్నేళ్ల ప్రశ్నపత్రాలను, శాంపిల్ పేపర్లను సాల్వ్ చేయడం వల్ల పరీక్షలపై అవగాహన వస్తుంది. ప్రశ్నల స్థాయి ఎలా ఉంది? ఏ విభాగం నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి? అనేది తెలుస్తుంది. వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ వంటి సీబీఎస్​ఈ 12వ తరగతి సబ్జెక్టుల్లో ఫార్ములాలు, ఈక్వేషన్లు చాలా ముఖ్యం. వీటిని ఒక చార్ట్ రూపంలో రాసుకుని మీ గదిలో అంటించుకోండి. మిగిలిన ప్రిపరేషన్​ రోజుల్లో వాటిని చూస్తూ ఉంటే అవి మెదడులో బలంగా ముద్రపడిపోతాయి.

6. రివిజన్.. రివిజన్.. రివిజన్!

బోర్డు పరీక్షల్లో వంద శాతం మార్కులు సాధించాలంటే పట్టుదల ఎంత ముఖ్యమో, క్రమం తప్పకుండా రివిజన్ చేయడం కూడా అంతే ముఖ్యం. చదివిన అంశాలను గుర్తుంచుకోవడానికి రోజూ కొంత సమయాన్ని రివిజన్‌కు కేటాయించండి. మీ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అది చివరి నిమిషంలో ఎంతో ఉపయోగపడుతుంది.

7. ఎగ్జామ్ హాల్‌లో టైమ్ మేనేజ్‌మెంట్

పరీక్ష హాల్‌లో మొదటి 10 నిమిషాలు ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదవండి. మీకు బాగా తెలిసిన సమాధానాలను ముందే రాయండి. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా టెన్షన్ తగ్గుతుంది. చివరి 10 నిమిషాలు రాసిన జవాబులను సరిచూసుకోవడానికి కేటాయించండి.

8. జవాబులు రాసే విధానం

మీకు సబ్జెక్టుపై ఎంత జ్ఞానం ఉందనేది మీ జవాబు పత్రం చూసి ఎగ్జామినర్ నిర్ణయిస్తారు. అందుకే సమాధానాలను స్పష్టంగా, పాయింట్ల వారీగా రాయండి. ముఖ్యమైన పదాలను హైలైట్ చేయండి. పారాగ్రాఫ్‌ల మధ్య తగినంత గ్యాప్ వదలండి. సమాధానం సూటిగా, స్పష్టంగా ఉండేలా చూసుకోండి.

సరైన ప్రిపరేషన్, ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని సీబీఎస్​ఈ బోర్డు పరీక్షల్లో విజేతలుగా నిలబెడతాయి.