ఇంకొన్ని రోజుల్లో JEE Mains 2026- ‘స్మార్ట్​’ ప్రిపరేషన్​ కోసం ఈ టిప్స్​ ఫాలో అవ్వండి..

జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. ఈ తక్కువ సమయంలో సిలబస్ మొత్తం తిరగేయడం కంటే, తెలివైన వ్యూహంతో ముందుకు వెళ్లడం ముఖ్యం. నిపుణులు సూచిస్తున్న ఈ లాస్ట్​ మినిట్​ టిప్స్​ మీ స్కోరును మెరుగుపరుస్తాయి.

Published on: Jan 9, 2026, 09:10:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థల్లో సీటు సంపాదించడమే లక్ష్యంగా లక్షలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం జేఈఈ పరీక్ష రాస్తుంటారు. అయితే, ఈ పరీక్షలో విజయం సాధించాలంటే కేవలం గంటల తరబడి చదవడం కంటే, సమయాన్ని ఎంత తెలివిగా వాడుకున్నారనేదే ముఖ్యం! జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్స్ 2026 సెషన్​ 1 ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై వోక్సెన్ యూనివర్సిటీ అసిస్టెంట్ డీన్, ప్రొఫెసర్ వెంకట సత్య మాధవ మెడిచర్ల కొన్ని విలువైన సూచనలు చేశారు.

జేఈఈ మెయిన్స్​ 2026 ప్రిపరేషన్​ టిప్స్​.. (Hindustan Times/Karun Sharma/For representation only)
జేఈఈ మెయిన్స్​ 2026 ప్రిపరేషన్​ టిప్స్​.. (Hindustan Times/Karun Sharma/For representation only)

జేఈఈ మెయిన్స్​ 2026 ప్రిపరేషన్​ టిప్స్​..

చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోండి-

ఇంజనీరింగ్‌లో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడం ఎంత ముఖ్యమో, మీ ప్రిపరేషన్ కూడా అలాగే ఉండాలి. మీకున్న సమయాన్ని రోజువారీ లేదా వీక్లీ టార్గెట్స్​గా విభజించుకోండి. "ఈరోజు రెండు చాప్టర్లు రివిజన్ చేయాలి" లేదా "ఇన్ని సమస్యలను పరిష్కరించాలి" అని మైక్రో గోల్స్ పెట్టుకోవడం వల్ల చదువుపై పట్టు దొరుకుతుంది.

వేగంతో పాటు ఖచ్చితత్వం ముఖ్యం..

జేఈఈ మెయిన్స్​ 2026లో వేగంగా సమాధానాలు గుర్తించడం ఎంత ముఖ్యమో, అవి కరెక్ట్ కావడం కూడా అంతే ముఖ్యం. "వేగం పెంచాలనే ఆరాటంలో తప్పులు చేయకండి" అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు బాగా తెలిసిన ప్రశ్నలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నల దగ్గర ఆగిపోకుండా ముందుకు వెళ్లడం ఉత్తమం.

కొత్త పాఠాలు వద్దు.. పాతవే రివైజ్​ చేయండి..

జేఈఈ మెయిన్స్​ 2026 పరీక్షకు కొన్ని రోజుల ముందు కొత్త చాప్టర్లను మొదలుపెట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పటివరకు మీరు నేర్చుకున్న అంశాలనే మరింత బలంగా రివిజన్ చేయండి. లోతైన అవగాహనతో చదవడం వల్ల ఫలితం మెరుగ్గా ఉంటుంది.

తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి..

మాక్ టెస్టులు రాసేటప్పుడు మీరు చేస్తున్న తప్పులను గమనించండి. అవి అవగాహన లోపమా? లేక అజాగ్రత్త వల్ల జరిగినవా? అని విశ్లేషించుకోండి. మీ బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం వల్ల పరీక్ష రోజున అవే తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు.

కాన్సెప్ట్‌లపై పట్టు సాధించండి..

జేఈఈ అంటే.. బట్టీ పట్టి పాస్​ అయిపోయే పరీక్ష కాదు. అది మీ తెలివితేటలకు పరీక్ష. ఫిజిక్స్‌లో డెరివేషన్లు, కెమిస్ట్రీలో లాజిక్స్ వంటి బేసిక్​ కాన్సెప్ట్స్​ క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. పునాది బలంగా ఉంటే ఎలాంటి క్లిష్టమైన ప్రశ్ననైనా సులభంగా ఎదుర్కోవచ్చు.

సమయపాలన.. ఒక కళ

పరీక్ష హాల్‌లో టైమ్ మేనేజ్మెంట్ చాలా కీలకం. "మొదటి విడతలో మీకు బాగా తెలిసిన ప్రశ్నలన్నీ పూర్తి చేయండి. ఆ తర్వాత మిగిలిన సమయాన్ని కష్టమైన ప్రశ్నలకు కేటాయించండి," అని ప్రొఫెసర్ సూచిస్తున్నారు. ఒకే ప్రశ్న దగ్గర ఎక్కువ సమయం వృధా చేయకండి అని చెబుతున్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యం..

ఎన్ని చదివినా పరీక్ష రోజున మీ మెదడు చురుగ్గా పని చేయాలంటే ఆరోగ్యం సహకరించాలి. మంచి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర పోవడం చాలా అవసరం. చదువు మధ్యలో చిన్న విరామాలు తీసుకోండి. మొబైల్ లేదా టీవీ స్క్రీన్ చూసే సమయాన్ని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.

— ప్రొఫెసర్​ వెంకట సత్య మాధవ్​ మేడిచర్ల, అసిస్టెంట్​ డీన్​ అండ్​ ప్రొఫెసర్​ ఆఫ్​ ప్రాక్టీస్​, స్కూల్​ ఆఫ్​ టెక్నాలజీ వోక్సెన్​ యూనివర్సిటీ హైదరాబాద్​.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More