CBSE class 12 result : సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

CBSE results 2026 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బుధవారం 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు తమ స్కోర్‌కార్డులను సీబీఎస్‌ఈ అధికారిక పోర్టల్స్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

Published on: May 13, 2026, 13:37:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

CBSE 12th result 2026 websites : దేశవ్యాప్తంగా, విదేశాల్లో ఉన్న సీబీఎస్‌ఈ (సెంట్రల్​ బోర్డ్ ఆఫ్​ సెకెండరీ ఎడ్యుకేషన్) అనుబంధ పాఠశాలల విద్యార్థుల ఉత్కంఠ, ఒత్తిడికి ఎట్టకేలకు తెరపడింది! ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 మధ్య జరిగిన సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి.

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల..
సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల..

ఈ రిజల్ట్స్​ కోసం విద్యార్థులు ఆదివారం నుంచి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

విద్యార్థులు తమ సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలను వెబ్‌సైట్‌లతో పాటు డిజిలాకర్, ఉమంగ్ వంటి యాప్‌ల ద్వారా కూడా పొందవచ్చు.

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు- తగ్గిన పాస్​ పర్సెంటేజ్​!

ఈ దఫా సీబీఎస్​ 12వ తరగతి ఫలితాల్లో పాస్​ పర్సెంటేజ్​ తగ్గింది! మొత్తం 17,80,365 మంది పరీక్షకు రిజిస్టర్​ చేసుకోగా.. వారిలో 17,68,968 మంది ఎగ్జామ్స్ రాశారు. వారిలో 15,07,109 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే అది 85.20శాతం. గతేడాది ఇది 88.39గా ఉంది. అంటే పాస్​ పర్సెంటేజ్​ 3.19శాతం పడిపోయినట్టు!

2026లో అబ్బాయిల కన్నా అమ్మాయిలు 6.73శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే.. త్రివేండ్రంలో అత్యధిక పాస్​ పర్సెంటేజ్​ (95.62శాతం) నమోదైంది. ప్రయాగ్​రాజ్​లో అత్యల్పంగా 72.43శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు- ఎక్కడ చూసుకోవాలి?

విద్యార్థులు తమ ఫలితాల కోసం ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు:

results.cbse.nic.in

cbse.gov.in

cbseresults.nic.in

digilocker.gov.in

results.gov.in

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు- వెబ్‌సైట్​లో ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1- ముందుగా cbse.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, 'Results' ట్యాబ్‌ను క్లిక్ చేయండి.

స్టెప్​ 2- అక్కడ అందుబాటులో ఉన్న Class XII Result 2026 లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- మీ రోల్ నంబర్, ఇతర లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.

స్టెప్​ 4- వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టెప్​ 5- భవిష్యత్తు అవసరాల కోసం మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోండి.

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు- డిజిలాకర్​లో ఇలా..

స్టెప్​ 1- డిజిలాకర్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి వెళ్లండి.

స్టెప్​ 2- మీ రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ అవ్వండి.

స్టెప్​ 3- హోమ్ పేజీలో కనిపించే సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల లింక్‌ను ఎంచుకోండి.

స్టెప్​ 4- అడిగిన వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

స్టెప్​ 5- డిజిటల్ మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసి భద్రపరుచుకోండి.

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు- ఉమంగ్ యాప్ ద్వారా ఇలా..

స్టెప్​ 1- ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి UMANG యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

స్టెప్​ 2- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో సైన్-ఇన్ అవ్వండి.

స్టెప్​ 3- సెర్చ్ ఆప్షన్‌లో "సీబీఎస్​ఈ" అని టైప్ చేసి, సీబీఎస్‌ఈ సర్వీసెస్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్​ 4- సీబీఎస్​ఈ "Class 12 Result 2026" లింక్‌ను ఎంచుకుని, మీ రోల్ నంబర్ ఎంటర్ చేయండి.

స్టెప్​ 5- ఫలితాలను చూసుకున్న తర్వాత మార్క్‌షీట్‌ను సేవ్ చేసుకోండి.

ఈ ఏడాది పరీక్షలన్నీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో జరిగాయి. ఆన్‌లైన్ వెబ్‌సైట్లతో పాటు, విద్యార్థులకు ఎస్​ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలను పొందే సౌకర్యాన్ని బోర్డు కల్పించింది.

‘బెస్ట్ 5’ విధానం అంటే ఏంటి?

ఫలితాల లెక్కింపులో విద్యార్థులకు ఊరటనిచ్చే 'బెస్ట్ 5' విధానాన్ని సీబీఎస్‌ఈ అనుసరిస్తోంది. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం విద్యార్థులు గరిష్టంగా ఆరు సబ్జెక్టులకు పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.

అయితే, తుది ఫలితం లేదా శాతాన్ని లెక్కించేటప్పుడు విద్యార్థికి అత్యధిక మార్కులు వచ్చిన టాప్ 5 సబ్జెక్టులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

ఒకవేళ ఆప్షనల్ లేదా అదనపు ఆరో సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినా, అది విద్యార్థి ప్రధాన ఫలితంపై లేదా ఉత్తీర్ణత శాతాన్ని తగ్గించదు. కేవలం అత్యధిక స్కోరు సాధించిన ఐదు సబ్జెక్టుల మార్కులే కౌంట్ అవుతాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More