CBSE 12 Result 2026: ఏ క్షణంలోనైనా సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
CBSE Class 12 result 2026: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. డిజీలాకర్‌లో 'Results Soon' నోటీసు కనిపించడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. సోమవారం నుంచి ఏక్షణంలోనైనా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
CBSE Class 12 result 2026: సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఫలితాల ప్రక్రియ తుది దశకు చేరుకుందనడానికి నిదర్శనంగా ‘డిజీలాకర్’ పోర్టల్‌లో తాజాగా ఒక అప్‌డేట్ కనిపిస్తోంది. మే 10న డిజీలాకర్‌లో “Results Soon” (ఫలితాలు త్వరలో) అనే నోటీసు ప్రత్యక్షమైంది. దీని అర్థం, విద్యార్థుల మార్కుల ఫైళ్లను డిజిటల్ రూపంలో అప్‌లోడ్ చేయడం పూర్తయిందని, ఏ క్షణమైనా ఫలితాలు బయటకు రావచ్చని తెలుస్తోంది.

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడు రావచ్చు?
గత కొన్నేళ్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే.. డిజీలాకర్‌లో ఇలాంటి నోటిఫికేషన్లు లేదా స్టూడెంట్ లాగిన్ ఫీచర్లు యాక్టివేట్ అయిన కొన్ని రోజుల్లోనే బోర్డు ఫలితాలను ప్రకటిస్తుంది. దీని ప్రకారం.. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు మే 11 నుంచి 20 నాటికి వెల్లడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, బోర్డు నుంచి అధికారికంగా తేదీ, సమయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు- డిజీలాకర్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి..
విద్యార్థులు తమ డిజిటల్ మార్క్ షీట్లను పొందడానికి ఈ కింది స్టెప్స్‌ని అనుసరించాల్సి ఉంటుంది.
ముందుగా results.digilocker.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి లేదా డిజీలాకర్ మొబైల్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
మీ మొబైల్ నంబర్ లేదా ఆధార్ కార్డుతో అనుసంధానమైన వివరాలతో సైన్-ఇన్ అవ్వాలి.
మెనూలో ‘Education’ కేటగిరీని ఎంచుకుని ‘CBSE’ అని సెర్చ్ చేయాలి.
అక్కడ కనిపించే “CBSE Class 12 Result 2026” లేదా “Class XII Marksheet” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీ రోల్ నంబర్, స్కూల్ కోడ్, అడ్మిట్ కార్డ్ ఐడీ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి.
సబ్మిట్ బటన్‌ను నొక్కగానే మీ డిజిటల్ మార్క్ షీట్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
ఈ డాక్యుమెంట్‌ను ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
డిజీలాకర్‌తో పాటు cbse.gov.in, results.cbse.nic.in వంటి బోర్డు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా కూడా విద్యార్థులు తమ మార్కులను చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య జరిగిన ఈ పరీక్షలకు సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్ విభాగాల నుంచి లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఏయిమ్స్-సీబీఎస్‌ఈ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్ మేట్’
ఓవైపు ఫలితాల హడావిడి ఉంటే, మరోవైపు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై సీబీఎస్‌ఈ ప్రత్యేక దృష్టి సారించింది. దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)తో కలిసి ‘ప్రాజెక్ట్ మేట్’ రెండో దశను ఇటీవలే అధికారికంగా ప్రారంభించింది.
ఏయిమ్స్ సైకియాట్రీ విభాగం రూపొందించిన ‘మైండ్ యాక్టివేషన్ త్రూ ఎడ్యుకేషన్’ (ఎంఏటీఈ) అనేది విద్యార్థుల మానసిక, సామాజిక ఎదుగుదలకు తోడ్పడే కార్యక్రమం. దిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో జరిగిన కౌన్సిలర్ల సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని 60కి పైగా పాఠశాలల ప్రిన్సిపాళ్లు, మానసిక నిపుణులు భాగస్వాములయ్యారు.
ఇందులో ‘మేట్-5 సర్కిల్’ అనే పీర్-సపోర్ట్ సిస్టమ్ ద్వారా విద్యార్థులు ఒకరికొకరు తోడ్పడేలా చేస్తారు.
తల్లిదండ్రుల కోసం ప్రత్యేక వర్క్‌షాపులు, తరగతి గదుల్లో వెల్‌నెస్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు.
సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్ రాహుల్ సింగ్ పర్యవేక్షణలో పైలట్ ప్రాజెక్ట్‌గా మొదలైన ఈ కార్యక్రమం, ఇప్పుడు మరిన్ని పాఠశాలలకు విస్తరిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


