RRB NTPC admit card : ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకున్నారా?
RRB NTPC admit card 2026 : ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిట్ కార్డులను అధికారికంగా విడుదల చేసింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ). మే 7 నుంచి పరీక్ష రాయబోయే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులో చెక్ చేసుకోవాల్సిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
RRB NTPC admit card download : రైల్వేలో ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న లక్షలాది మంది అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ (CEN 07/2025) కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 1)కి సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పరీక్ష మే 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ rrb.digialm.com నుండి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ అడ్మిట్ కార్డ్ 2026 డౌన్‌లోడ్ చేయడం ఎలా?
మీ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది దశలను అనుసరించండి:
స్టెప్ 1- ముందుగా అధికారిక వెబ్‌సైట్ లేదా rrb.digialm.com సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో ఉన్న "NTPC Undergraduate Admit Card link (CEN 07/2025)" పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- మీ సంబంధిత ఆర్ఆర్బీ రీజియన్‌ను ఎంచుకోండి.
స్టెప్ 4- మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 5- వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్ 6- దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్ష రోజు కోసం ఒక ప్రింటౌట్ తీసి పెట్టుకోండి.
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ అడ్మిట్ కార్డులో సరిచూసుకోవాల్సిన వివరాలు..
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అందులోని సమాచారం సరైనదేనా కాదా అని అభ్యర్థులు జాగ్రత్తగా పరిశీలించాలి. ఏ చిన్న తప్పు ఉన్నా పరీక్ష రోజున ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ కింది వివరాలను తనిఖీ చేయండి:
- అభ్యర్థి పేరు, రోల్ నంబర్
- రిజిస్ట్రేషన్ నంబర్
- పరీక్ష తేదీ, సమయం
- పరీక్ష కేంద్రం పేరు, చిరునామా
- రిపోర్టింగ్ టైమ్
- కేటగిరీ
- ఫోటో, సంతకం
ఒకవేళ అడ్మిట్ కార్డులో ఏవైనా పొరపాట్లు ఉంటే, వెంటనే సంబంధిత ఆర్ఆర్బీ రీజియన్ అధికారులను సంప్రదించాలి.
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ 2026 పరీక్ష రోజున పాటించాల్సిన నిబంధనలు
పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు అభ్యర్థులు ఈ కింది డాక్యుమెంట్లను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి:
అడ్మిట్ కార్డ్ ప్రింటౌట్: హాల్ టికెట్ లేనిదే లోపలికి అనుమతించరు.
ఫోటో ఐడీ ప్రూఫ్: ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా గుర్తింపు కార్డు (ఒరిజినల్).
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో: దరఖాస్తులో వాడినట్లుగా ఉండే ఫోటోను వెంట ఉంచుకోవాలి.
చివరి నిమిషంలో ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి, రిపోర్టింగ్ సమయానికి కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం.
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ పరీక్ష షెడ్యూల్..
పరీక్ష ప్రారంభ తేదీ- మే 7, 2026
పరీక్ష ముగింపు తేదీ- జూన్ 21, 2026
మొత్తం పరీక్షా కేంద్రాలు- 200 పైగా
రోజువారీ షిఫ్టులు- 3 (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం)
మొత్తం అభ్యర్థులు- 63 లక్షల మంది పైగా
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


