TG Inter Supplementary Exams 2026 : తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజుల గడువు పొడిగింపు

Telangana Inter Supplementary Exams 2026 : తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. ఈ మేరకు విద్యార్థులు వెంటనే ఫీజు చెల్లించాలి.

Published on: May 2, 2026, 16:24:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి గడువును మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. ఈ పొడిగింపు మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. ఆలస్య రుసుముగా రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు మే 13 నుండి మే 21 వరకు జరుగుతాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుండి మే 25 వరకు రెండు సెషన్లలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.

మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష మే 26న ఉదయం 10 గంటల నుండి, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగుతుంది. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష అదే రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష మే 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.

విద్యార్థులు వారు చదువుతున్న కాలేజీలోనే ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు పేర్కొంది. టీజీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

ఇటీవల విడుదలైన ఫలితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అలాంటి విద్యార్థులు.. రీ-వెరిఫికేషన్ లేదా రీ-కౌంటింగ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చని ఇంటర్ బోర్డు చెప్పింది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యార్థులు రీ-వెరిఫికేషన్‌లో మార్పు లేదని భావిస్తే.. మే నెలలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరై స్కోరును మెరుగుపరుచుకోవచ్చు.

ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక వార్షిక పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,123 మంది ఇంటర్ ఫస్టియర్, 5,07,949 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.

పరీక్షల షెడ్యూల్ వివరాలు

మే 13: సెకండ్ లాంగ్వేజ్ (పేపర్-I & II)

మే 14: ఇంగ్లీష్ (పేపర్-I అండ్ II)

మే 15: మ్యాథ్స్-1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ / మ్యాథ్స్-2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్

మే 16: మ్యాథ్స్-1B, జువాలజీ, హిస్టరీ / మ్యాథ్స్-2B, జువాలజీ, హిస్టరీ

మే 18: ఫిజిక్స్, ఎకనామిక్స్ (పేపర్-I & II)

మే 19: కెమిస్ట్రీ, కామర్స్ (పేపర్-I & II)

మే 20: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ (BiPC విద్యార్థులకు)

మే 21: మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ (పేపర్-I & II)

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More