ప్రముఖ కళ్లజోళ్ల తయారీ సంస్థ లెన్స్‌కార్ట్.. ఐపీఓగా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. అక్టోబర్ 31న లెన్స్‌కార్ట్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఓపెన్కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
లెన్స్‌కార్ట్ ఐపీఓ వివరాలు..

ఫండ్ రైజింగ్- పీయుష్ భన్సల్కి చెందిన లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్.. ఈ ఐపీఓ ద్వారా 7,278.02 కోట్లను సమకూర్చేందుకు ప్రయత్నిస్తోంది. కంపెనీ వాల్యుయేషన్ రూ. 70,000కోట్లుగా ఉంది. అంతేకాదు.. ప్రముఖ ఇన్వెస్టర్, డీమార్ట్ ఫౌండర్ రాధాకృష్ణ ధమానీ.. ఈ కంపెనీలో తాజాగా రూ. 90కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
ప్రైజ్ బ్యాండ్- లెన్స్‌కార్ట్ ఐపీఓ ప్రైజ్ బ్యాండ్ రేంజ్‌ని షేరుకు రూ. 382- రూ. 402గా నిర్ణయించారు. ఐపీఓలో అలాట్మెంట్ అవకాశాలు పెరగాలంటే అప్పర్ బ్యాండ్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ)- investorgain ప్రకారం లెన్స్‌కార్ట్ ఐపీఓ జీఎంపీ ప్రస్తుతం రూ. 75గా ఉంది. అంటే ఈ కంపెనీ షేర్లు రూ. 477 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే అది దాదాపు 19శాతం ప్రీమియం.
సబ్స్క్రిప్షన్ తేదీలు- లెన్స్‌కార్ట్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 వరకు ఓపెన్‌లో ఉంటుంది.
అలాట్మెంట్ తేదీ- ఈ కంపెనీ ఐపీఓ అలాట్ అయిన వారికి.. షేర్లు నవంబర్ 6న డీమ్యాట్ అకౌంట్లో కనిపించే అవకాశం ఉంది.
లిస్టింగ్ తేదీ- స్టాక్ మార్కెట్లో లెన్స్‌కార్ట్ ఐపీఓ నవంబర్ 10న లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో షేర్లు ట్రేడ్ అవుతాయి.
ఇతర వివరాలు- ఈ ఐపీఓలో 5.35 కోట్ల షేర్లు ఫ్రెష్ ఇష్యూ కింద రానున్నాయి. వీటి విలువ రూ. 2,140 కోట్లు. ఆఫర్ ఫల్ సేల్ కింద మరో 12.76 కోట్ల షేర్లు (రూ. 5,128.02 కోట్లు) ఉంటాయి. ఐపీఓ ద్వారా సమకూర్చిన నిధులను కంపెనీ కొత్త స్టోర్ల నిర్మాణానికి, టెక్నాలజీ అభివృద్ధికి, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉపయోగిస్తుంది. వీటితో పాటు బ్రాండ్ మార్కెటింగ్, బిజినెస్ ప్రొమోషన్లకు కూడా నిధులను కేటాయిస్తుంది.
లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ వ్యాపారం గురించి..
2008లో లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్‌ని స్థాపించారు. పీషుయ్ భన్సల్కి ఇందులో 10.7శాతం వాటా ఉంది. ఇదొక టెక్నాలజీ డ్రివెన్ ఐ-వేర్ కంపెనీ! గ్లాస్లు, సన్‌గ్లాస్‌లు, కాంటాక్ట్ లెన్స్‌లు, యాక్సెసరీలకు సంబంధించి డిజైన్, మేన్యుఫ్యాక్చరింగ్, బ్రాండింగ్, రీటైలింగ్కి ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది. అన్ని వయస్సుల వారికి ప్రాడక్ట్‌లను అందుబాటులో ఉంచడం లెన్స్‌కార్ట్ ప్రత్యేకత.
{{/usCountry}}2008లో లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్‌ని స్థాపించారు. పీషుయ్ భన్సల్కి ఇందులో 10.7శాతం వాటా ఉంది. ఇదొక టెక్నాలజీ డ్రివెన్ ఐ-వేర్ కంపెనీ! గ్లాస్లు, సన్‌గ్లాస్‌లు, కాంటాక్ట్ లెన్స్‌లు, యాక్సెసరీలకు సంబంధించి డిజైన్, మేన్యుఫ్యాక్చరింగ్, బ్రాండింగ్, రీటైలింగ్కి ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది. అన్ని వయస్సుల వారికి ప్రాడక్ట్‌లను అందుబాటులో ఉంచడం లెన్స్‌కార్ట్ ప్రత్యేకత.
{{/usCountry}}ఇక 2025 మార్చ్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో లెన్స్‌కార్ట్ పీఏటీ (ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్) రూ. 297.34కోట్లుగా నమోదైంది. ఎఫ్వై24త పోల్చితే ఇది 10.15కోట్ల నష్టం! కాగా అదే సమయంలో ఆదాయం 24శాతం పెరిగి రూ. 7,009.28కోట్లకు చేరింది.