పండుగ సీజన్​లో విపరీతంగా ఖర్చు చేసేశారా? మీ ఫైనాన్షియల్స్​ని ఇలా సెట్​ చేసుకోండి..

ఈ పండుగ సీజన్​లో కాస్త ఎక్కువ ఖర్చు చేశారా? మీ ‘బడ్జెట్​’ అదుపు తప్పిందా? బ్యాంక్​ బ్యాలెన్స్​ చూడాలంటే భయమేస్తోందా? కంగారు పడకండి! మీ ఆర్థిక పరిస్థితులను మళ్లీ సెట్​ చేసుకోవడానికి కచ్చితంగా ఉపయోగపడే ఈ టిప్స్​ని తెలుసుకోండి, అప్లై చేయండి.. 

Published on: Oct 26, 2025, 11:31:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మన దేశంలో నవరాత్రితో మొదలయ్యే పండుగ సీజన్..​ దీపావళితో ముగుస్తుంది. పండుగ అంటే కుటుంబాలు కలిసిమెలిసి ఉండటమే కాదు, కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయడం కూడా! స్వీట్ల నుంచి భారీ ఎలక్ట్రానిక్​ పరికరాలు, కార్ల వరకు.. ఒక్కోసారి ఈ పండుగ సీజన్​లో భారీగానే ఖర్చు అవుతుంటుంది. మరి మీరు కూడా ఈ పండుగ సీజన్​లో కాస్త ఎక్కువ ఖర్చు చేశారా? మీ ‘బడ్జెట్​’ అదుపు తప్పిందా? దీపావళి తర్వాత మీ బ్యాంక్​ బ్యాలెన్స్​ చూసేందుకు భయంగా ఉందా? అయితే ఇది మీకోసమే! మీ ఆర్థిక పరిస్థితులను మళ్లీ సెట్​ చేసుకోవడానికి కచ్చితంగా ఉపయోగపడే కొన్ని టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

విపరీతంగా ఖర్చు చేసింది చాలు!
విపరీతంగా ఖర్చు చేసింది చాలు!

ఈ టిప్స్​ పాటించి మీ ఫైనాన్షియల్స్​ని సెట్​ చేసుకోండి..

ఎంత ఖర్చు అయ్యిందో లెక్కలు చూసుకోండి-

అన్నింటికన్నా ముందు, అసలు ఎంత ఖర్చు అయ్యుందో తెలుసుకోవడం చాలా అవసరం. మీ రీసెంట్​ స్పెండింగ్​ డేటాను తీసుకోండి. అవసరమైనవి ఎన్ని కొన్నారు? అనవసరమైనవి ఎన్ని కొన్నారు? వంటి విషయాలను చెక్​ చేసుకోండి. ఎక్కువే ఖర్చు అయ్యుండొచ్చు, కానీ ఇలా చెక్​ చేసుకుంటే, భవిష్యత్తులో తప్పులను రిపీట్​ చేయకుండా ఉంటారు.

మీ పండుగ షాపింగ్​ని అవసరాలు, అనవసరాలుగా విభజించండి. స్వీట్లు, బట్టలు అవసరాల కిందకు వస్తాయి. కానీ ఆఫర్​లో వస్తోంది, డిస్కౌంట్​లో లభిస్తోందని.. అవసరం లేకపోయినా మీరు కొన్న వాచ్​లు, గ్యాడ్జెట్స్​ అనేవి 'అనవసరం' కిందకి వెళతాయి.

అనవసరమైన ఖర్చులను కట్​ చేయండి-

ఇప్పటికే ఎక్కువ ఖర్చులు అయ్యాయి కాబట్టి, మొహమాటం లేకుండా మీ ఎక్స్​పెన్సెస్​ని తగ్గించుకోవాలి! అనవసరమైన వాటిని గుర్తించి వాటిని వెంటనే కట్​ చేయాలి. అది.. బయట తినడం అవ్వొచ్చు, లేదా ఇంటికి ఆర్డర్​ పెట్టుకోవడం అవ్వొచ్చు. చిన్న చిన్న విషయాలను కట్​ చేస్తే, మీకు పెద్ద మొత్తంలో డబ్బులు ఆదా అవుతున్నట్టు కనిపిస్తుంది. అలా మిగిలిన డబ్బులను అప్పులు తీర్చడానికి ఉపయోగించుకోవచ్చు. లేదా లాంగ్​ టర్మ్​ గోల్స్​కి వాడుకోవచ్చు.

ఎమర్జెన్సీ ఫండ్​ని మళ్లీ నిర్మించుకోండి-

నిజం చెప్పాలంటే, పండుగ షాపింగ్​ లేదా మరే ఇతర కారణానికైనా.. మీరు మీ ఎమర్జెన్సీ ఫండ్​ని ఉపయోగించి ఉంటే, అది చాలా తప్పు! అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. ఎమర్జెన్సీ ఫండ్​ని అస్సలు టచ్​ చేయకూడదు. మరీ ముఖ్యంగా, అనవసరమైన వాటి కోసం అస్సలు ఉపయోగించుకోకూడదు. ఒకవేళ ఈ పండుగ సీజన్​లో మీరు ఈ తప్పు చేసి ఉంటే, ముందు మీ ఫోకస్​ అంతా ఎమర్జెన్సీ ఫండ్​ని రీ-బిల్డ్​ చేసుకోవడంపైనే ఉండాలి.

ఎప్పుడు, ఎలాంటి ఆపద ముంచుకొస్తుందో తెలియని నేటి గందరగోళ ప్రపంచంలో ఎమర్జెన్సీ ఫండ్​ అనేది ఒక ఆపన్నహస్తంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మరొకసారి దాని నుంచి నిధులు తీయకుండా చూసుకోండి.

అప్పులు తీర్చేయండి-

మీ అప్పులను లిస్ట్​గా రాసుకోండి. షార్ట్​ టర్మ్​ లోన్స్​, ఈఎంఐలు, క్రెడిట్​ కార్డు పేమెంట్స్​ వంటివి చూసుకోండి. ఎక్కువ వడ్డీ ఉన్నవి, మీ మీద అధిక భారంగా ఉన్న అప్పులను తీర్చేందుకు ప్రయత్నించండి. డబ్బులు లేవంటూ లోన్స్​, క్రెడిట్​ కార్డులో మినిమమ్​ రీపేమెంట్​ ఆప్షన్​ని పరిగణిస్తుంటే మాత్రం మీరు చాలా ప్రమాదంలో పడతారు! ఇప్పటికి పరిస్థితి బాగానే ఉందనిపించినా, భవిష్యత్తులో పెద్ద బండ రాయి మీదపడినట్టు అప్పులు పెరిగి, మీ మీద పడతాయి.

ఆదాయం పెంచుకోండి-

నెటి లైఫ్​స్టైల్​కి ఒక ఉద్యోగం సరిపోడవం లేదు! రెండో ఆదాయం కోసం కూడా మీరు ప్రయత్నించాలి. ఫ్రీలాన్స్​, పార్ట్​-టైమ్​ జాబ్​, ట్యూషన్స్​ ఇలా అనేక ఆప్షన్స్​ ఉన్నాయి. వీటి ద్వారా మీ ఫైనాన్షియల్స్​ మెరుగుపడతాయి.

ఫైనాన్షియల్​ గోల్స్​ ఫిక్స్​ చేసుకోండి-

పండుగ సీజన్​లో ఖర్చులు వల్ల మీ ఆర్థిక లక్ష్యాల్లో ఇబ్బందులు తలెత్తి ఉండొచ్చు. బాధపడకుండా, వాటిని మళ్లీ ట్రాక్​లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత సానుకూలంగా ఉండేందుకు చూసుకోండి.

చివరిగా ఒక్క విషయం.. పండుగ సీజన్​లో చేసిన ‘మితిమీరిన ఖర్చులు’ చూసి ఇప్పుడు బాధ, భయపడితే ప్రయోజనం లేదు! బదులుగా, మీరు మీ ఫైనాన్షియల్స్​ని ఇప్పుడు సెట్​ చేసుకుంటే, అనుకున్నది సాధించగలుగుతారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More