...
...
Next Story

Poco M8x 5G : పోకో కొత్త స్మార్ట్​ఫోన్.. ఎం8ఎక్స్​ ఇండియా లాంచ్ త్వరలోనే!

Poco M8x 5G India Launch : పోకో ఎం-సిరీస్‌ను మరింత విస్తరిస్తూ భారత్‌లో త్వరలోనే ‘పోకో ఎం8ఎక్స్ 5జీ’ ఫోన్ విడుదల కానుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక మైక్రోసైట్ లైవ్ అయింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Aug 16, 2026, 06:46:45 IST
Advertisement

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకెళుతున్న ప్రముఖ బ్రాండ్ పోకో.. భారతీయ వినియోగదారులకు మరో అదిరిపోయే సర్​ప్రైజ్ ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో శక్తివంతమైన ఫీచర్లతో ‘పోకో ఎం8 పవర్’ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన ఆ కంపెనీ.. ఇప్పుడు అదే ఎం-సిరీస్ నుంచి మరో కొత్త హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘పోకో ఎం8ఎక్స్ 5జీ’ స్మార్ట్​ఫోన్ త్వరలోనే భారత్‌లో విడుదల కానుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

పోకో ఎం8ఎక్స్​ 5జీ- ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక మైక్రోసైట్ లైవ్..

పోకో ఎం8 పవర్ స్మార్ట్​ఫోన్..
పోకో ఎం8 పవర్ స్మార్ట్​ఫోన్..

పోకో కొత్త స్మార్ట్​ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేదికగా విక్రయించనున్నట్లు స్పష్టమైంది. విడుదలకు సంబంధించి ఇప్పటికే దేశంలో ఒక డెడికేటెడ్ మైక్రోసైట్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఈ ఫోన్ డిజైన్, ఇతర లభ్యతకు సంబంధించిన వివరాలు బయటకొచ్చాయి.

టీజర్ల ప్రకారం.. పోకో ఎం8ఎక్స్ 5జీ ఫోన్ ఆకర్షణీయమైన ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో రానుంది. ఫోన్ వెనుక భాగంలో ఎడమ వైపున పైభాగంలో అందమైన గోల్డెన్ ఫినిషింగ్‌తో కూడిన స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది.

పోకో ఎం8ఎక్స్​ 5జీ- ఆకర్షణీయమైన డిజైన్, లుక్స్..

ఈ పోకో ఎం8ఎక్స్​ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఆకట్టుకునే గ్రీన్ కలర్ వేరియంట్‌లో దర్శనమిచ్చింది. ఫోన్ ఫ్రేమ్ అలాగే కెమెరా మాడ్యూల్ గోల్డెన్ షేడ్‌లో ఇవ్వడం దీనికి మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. వెనుక భాగంలో టెక్స్‌చర్‌తో కూడిన ఫ్లాట్ ప్యానెల్ ఉండగా, దాని కింది భాగంలో మధ్యలో పోకో బ్రాండింగ్ హైలైట్ అయ్యింది. ఇక ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ అమర్చారు.

అయితే, ఈ పోకో కొత్త స్మార్ట్​ఫోన్ అధికారిక లాంచ్ తేదీ, పూర్తి స్థాయి స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలను రానున్న రోజుల్లో వెల్లడించనున్నారు.

ఇటీవల విడుదలైన పోకో ఎం8 పవర్ విశేషాలు..

డిస్‌ప్లే: 6.83 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్.

ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్.

కెమెరా: వెనుకభాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా.

బ్యాటరీ: సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్ కోసం ఏకంగా 8,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఇది 45డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks