పండుగ సీజన్ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆటోమొబైల్ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లతో వల విసురుతున్నాయి. ఇందులో భాగంగా జపాన్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా అక్టోబర్ 2026 నెలకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. తమ పాపులర్ ఎస్‌యూవీ 'ఎలివేట్'తో పాటు మార్కెట్లో క్రేజ్ ఉన్న 'సిటీ', 'అమేజ్' మోడళ్లపై కంపెనీ భారీ తగ్గింపులను ఇస్తోంది.

ఈ పండుగ వేళల్లో మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. అక్టోబర్ 2026లో హోండా ఇస్తున్న డిస్కౌంట్ల వివరాలను ఇక్కడ చూసేయండి..
హోండా ఎలివేట్‌పై రూ.2.34 లక్షల తగ్గింపు!
హోండా పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత భారీ ఆఫర్‌ను 'ఎలివేట్' ఎస్‌యూవీకి కేటాయించారు. ఈ కారుపై ఏకంగా రూ. 2,34,600 వరకు ప్రయోజనాలను అందుకోవచ్చు. ఎలివేట్ ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్‌లో రూ. 11.81 లక్షలుగా ఉంది. కారు ప్రాథమిక ధరతో పోల్చి చూస్తే ఈ స్థాయి డిస్కౌంట్ రావడం కస్టమర్లకు పెద్ద ఊరట నిచ్చే అంశం. ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది మ్యాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇక్కడ వాహన ప్రియులు ఒక విషయాన్ని గమనించాలి. హోండా తన ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను రేపే (అక్టోబర్ 6, 2026న) మార్కెట్లోకి తీసుకొస్తోంది. సరికొత్త డిజైన్, అదనపు ఫీచర్లతో ఈ ఫేస్‌లిఫ్ట్ రానుంది. కాబట్టి, ప్రస్తుత మోడల్ ఓకే అనుకుంటే గనుక డీలర్ల వద్ద ఉన్న స్టాక్‌పై కంపెనీ ఇచ్చిన రూ. 2.34 లక్షల ఆఫర్‌తో పాటు అదనంగా ఊహించని రేటుకు బేరం ఆడే అవకాశం కస్టమర్లకు లభిస్తుంది.
హోండా సిటీపై రూ.1.71 లక్షల వరకు ప్రయోజనం!
భారత మార్కెట్లో దశాబ్దాలుగా తిరుగులేని ఆదరణ సంపాదించుకున్న 'హోండా సిటీ' సెడాన్‌పై కూడా కంపెనీ రూ. 1,70,900 వరకు ఆఫర్లను అందిస్తోంది. ప్రీమియం లుక్స్, ప్రశాంతమైన రైడింగ్ అనుభవాన్ని ఇచ్చే ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. వేరియంట్‌ను బట్టి మ్యాన్యువల్ లేదా సీవీటీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
కొత్త, పాత అమేజ్ కార్లపై కూడా ఆఫర్ల పండుగ!
{{/usCountry}}భారత మార్కెట్లో దశాబ్దాలుగా తిరుగులేని ఆదరణ సంపాదించుకున్న 'హోండా సిటీ' సెడాన్‌పై కూడా కంపెనీ రూ. 1,70,900 వరకు ఆఫర్లను అందిస్తోంది. ప్రీమియం లుక్స్, ప్రశాంతమైన రైడింగ్ అనుభవాన్ని ఇచ్చే ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. వేరియంట్‌ను బట్టి మ్యాన్యువల్ లేదా సీవీటీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
కొత్త, పాత అమేజ్ కార్లపై కూడా ఆఫర్ల పండుగ!
{{/usCountry}}సరికొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టిన థర్డ్ జనరేషన్ అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌పై హోండా రూ. 66,800 వరకు ప్రయోజనాలు ఇస్తోంది. ఈ కొత్త అమేజ్ ప్రారంభ ధర రూ. 7.65 లక్షలుగా ఉంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఇందులో అధునాతన అడాస్ సేఫ్టీ ఫీచర్లు, విస్తృతమైన ఫీచర్ల జాబితాను అమర్చారు.
మరోవైపు సెకండ్ జనరేషన్ అమేజ్ మోడల్‌ను కూడా హోండా ఇప్పటికీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో విక్రయిస్తోంది. దీనిపై రూ. 57,600 వరకు తగ్గింపు పొందవచ్చు. పాత అమేజ్ ప్రారంభ ధర రూ. 6.98 లక్షలుగా ఉండటంతో, తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన సెడాన్ కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
పండుగ సీజన్‌లో సొంత కారు కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఈ అక్టోబర్ ఆఫర్లు మంచి వెసులుబాటును కల్పిస్తున్నాయి. అయితే మీరు ఎంచుకునే వేరియంట్, రంగు, డీలర్‌షిప్ ప్రాంతాన్ని బట్టి ఈ ఆఫర్ వర్తించే విధానంలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి.