200ఎంపీ రేర్ కెమెరా, 7000ఎంఏహెచ్ బ్యాటరీ- Realme GT 8 Pro ధర ఎంతంటే..
200ఎంపీతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా, 7000ఎంఏహెచ్ బడా బ్యాటరీతో రియల్‌మీ జీటీ 8 ప్రో 5జీ భారత్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర, లభ్యత సహా ఇతర ఫీచర్స్‌కి చెందిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
జీటీ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని ఇండియాలోకి తీసుకొచ్చింది రియల్‌మీ సంస్థ. దాని పేరు రియల్‌మీ జీటీ 8 ప్రో. ఇదొక 5జీ గ్యాడ్జెట్. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన స్విచ్చబుల్ కెమెరా మాడ్యూల్ డిజైన్, ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీర, రికో జీఆర్ ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి క్రేజీ ఫీచర్స్‌తో లాంచ్ అయ్యింది.

సరికొత్త రియల్‌మీ జీటీ 8 ప్రో 5జీ మార్కెట్‌లో వన్‌ప్లస్ 15, ఒప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్, ఐఫోన్ 17తో పాటు అదే ధర పరిధిలోని ఇతర ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీనిచ్చే కొత్త ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త రియల్‌మీ జీటీ 8 ప్రో 5జీ మొబైల్ అందించే ఫీచర్లను వివరంగా తెలుసుకోండి..
రియల్‌మీ జీటీ 8 ప్రో 5జీ: ధర, లభ్యత..
రియల్‌మీ జీటీ 8 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ డైరీ వైట్, అర్బన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 72,999.
16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 78,999.
అదనంగా, ఆస్టన్ మార్టిన్ ఎఫ్1 టీమ్‌తో కలిసి రూపొందించిన రియల్‌మీ జీటీ 8 ప్రో డ్రీమ్ ఎడిషన్ మోడల్ కూడా అందుబాటులో ఉంది.
ఈ డ్రీమ్ ఎడిషన్ (16GB+512GB) ధర రూ. 79,999గా నిర్ణయించారు.
ఈ రియల్‌మీ జీటీ 8 ప్రో 5జీ మొబైల్ నవంబర్ 25వ తేదీ నుంచి రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
రియల్‌మీ జీటీ 8 ప్రో 5జీ: స్పెసిఫికేషన్లు, ముఖ్య ఫీచర్లు
డిస్‌ప్లే, ప్రాసెసర్, కూలింగ్:
రియల్‌మీ జీటీ 8 ప్రో 5జీ మొబైల్ 6.78-ఇంచ్ QHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.ఈ డిస్‌ప్లే 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 2కే రిజల్యూషన్, గరిష్టంగా 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనికి రియల్‌మీ ఆర్1 గ్రాఫిక్స్ చిప్, హైపర్ విజన్ ఏఐ చిప్ కనెక్ట్ చేసి ఉంటాయి.
మల్టీటాస్కింగ్ సులభతరం చేయడానికి, హీటింగ్ని నియంత్రించడానికి, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7000 చదరపు మిల్లీమీటర్ల విస్తీర్ణం గల వేపర్ చాంబర్ (వీసీ) కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది.
కెమెరాలు, బ్యాటరీ:
ఈ రియల్‌మీ జీటీ 8 ప్రో రేర్ కెమెరా సెటఫ్..
- 50ఎంపీ ప్రధాన కెమెరా (రికో జీఆర్ మోడ్‌తో)
- 200MP టెలిఫోటో లెన్స్ (3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో)
- 50MP అల్ట్రా-వైడ్ కెమెరా
సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉంది.
అంతేకాకుండా, ఈ స్మార్ట్‌ఫోన్ బలమైన 7,000ఎంఏహెచ్ బ్యాటరీ మద్దతుతో వస్తుంది. ఇది 120డబ్ల్యూ వైర్డ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


