Hyundai car discounts : దసరా ధమాకా! క్రెటా నుంచి వెర్నా వరకు- హ్యుందాయ్ కార్లపై అదిరే డిస్కౌంట్లు..

నవరాత్రి పండుగ వేళ కొత్త కారు కొనాలనుకునే వారికి హ్యుందాయ్ ఇండియా బంపర్ ఆఫర్లు ప్రకటించింది. గ్రాండ్ ఐ10 నియోస్, క్రెటా, వెన్యూ నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు దసరా ఆఫర్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Oct 5, 2026, 16:21:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పండుగ సీజన్‌లో సొంత కారు కల నెరవేర్చుకోవాలనుకునే వాహన ప్రియులకు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా అదిరిపోయే తీపి కబురు అందించింది. దసరా, నవరాత్రి పండుగల సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 10, 2026 మధ్య జరిగే బుకింగ్‌లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. పండుగ సమయంలో కొత్త కారు డెలివరీ తీసుకోవాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

హ్యుందాయ్ క్రెటాపై ఆఫర్లు..
హ్యుందాయ్ క్రెటాపై ఆఫర్లు..

ఈ ఆఫర్లలో భాగంగా హ్యుందాయ్ తమ పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ (ఈవీ) మోడళ్లపై భారీ క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్​ఛేంజ్ సపోర్ట్, పాత కారు అప్‌గ్రేడ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనాలతో పాటు కార్పొరేట్, గవర్నమెంట్, రూరల్ స్కీమ్‌లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.

హ్యుందాయ్ క్రెటా, క్రెటా ఎలక్ట్రిక్ ఆఫర్లు..

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో ఒకటైన హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ వేరియంట్లలో ఎంట్రీ లెవెల్ 'ఈ' వేరియంట్‌పై రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, ఇతర మ్యాన్యువల్ వేరియంట్లపై రూ. 45,000, ఐవీటీ ఆటోమేటిక్ వర్షన్లపై రూ. 40,000 వరకు నగదు తగ్గింపు లభిస్తోంది. దీనికి తోడు రూ. 30,000 ఎక్స్​ఛేంజ్ సపోర్ట్ లభిస్తుంది. ఐ10, ఐ20, స్విఫ్ట్, డిజైర్, బలెనో, బ్రెజ్జా, వెన్యూ, నెక్సాన్, పంచ్, ఎక్స్‌టర్ కార్ల నుంచి క్రెటాకు మారే వారికి రూ. 15,000 వరకు అప్‌గ్రేడ్ బోనస్ అందిస్తున్నారు.

స్పోర్టీ లుక్ ఇచ్చే క్రెటా ఎన్ లైన్ మోడల్‌పై రూ. 45,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 30,000 ఎక్స్​ఛేంజ్ సపోర్ట్, రూ. 25,000 అప్‌గ్రేడ్ బోనస్ అందుకోవచ్చు. ఇక సరికొత్త క్రెటా ఎలక్ట్రిక్ విషయానికొస్తే, దీనిపై రూ. 30,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్​ఛేంజ్ సపోర్ట్, మరేదైనా కారు లేదా జెడ్‌ఎస్‌ ఈవీ నుంచి మారే వారికి రూ. 15,000 అప్‌గ్రేడ్ బోనస్ లభిస్తుంది.

హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ కార్లపై తగ్గింపులు..

చిన్న కార్ల విభాగంలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పెట్రోల్ వర్షన్‌పై రూ. 35,000, సీఎన్జీ వర్షన్‌పై (ఎరా వేరియంట్ మినహా) రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత సాంట్రో, ఆల్టో, ఐ10, ఐయాన్, వ్యాగన్ ఆర్, సెలెరియో, ఎస్-ప్రెస్సో కార్ల నుంచి అప్‌గ్రేడ్ అయ్యేవారికి రూ. 15,000 అప్‌గ్రేడ్ బోనస్, రూ. 15,000 ఎక్స్​ఛేంజ్ బోనస్ ఇస్తున్నారు. అలాగే కార్పొరేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 3,000 లేదా గ్రామీణ ప్రాంత కస్టమర్లకు రూ. 5,000 ప్రత్యేక ప్రయోజనం వర్తిస్తుంది.

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ ఐ20 (ఎరా వేరియంట్ మినహా) పై రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్చేంజ్ సపోర్ట్, రూ. 15,000 అప్‌గ్రేడ్ బోనస్ లభిస్తాయి. సెడాన్ మోడల్ ఆరా పెట్రోల్‌పై రూ. 15,000, సీఎన్జీపై రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ. 5,000 స్క్రాపేజ్ సపోర్ట్, రూ. 5,000 రూరల్ బెనిఫిట్ లభిస్తుంది.

ఎక్స్‌టర్, వెన్యూ, వెర్నా, అల్కాజార్..

మైక్రో ఎస్‌యూవీ హ్యుందాయ్ ఎక్స్‌టర్ (హెచ్​ఎక్స్2 వేరియంట్ మినహా) పై రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ సపోర్ట్, రూ. 10,000 అప్‌గ్రేడ్ బోనస్ పొందే వెసులుబాటు ఉంది. వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ మోడళ్లపై రూ. 5,000 స్క్రాపేజ్ ప్రయోజనం లభిస్తుంది.

ప్రీమియం సెడాన్ హ్యుందాయ్ వెర్నాపై రూ. 40,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ. 25,000 స్క్రాపేజ్ లేదా రూ. 20,000 ఎక్స్​ఛేంజ్ ఆఫర్‌ను ఎంచుకోవచ్చు. దీనికి అదనంగా రూ. 10,000 అప్‌గ్రేడ్ బోనస్, రూ. 10,000 కార్పొరేట్/గవర్నమెంట్ డిస్కౌంట్ లభిస్తాయి. 7-సీటర్ ఎస్‌యూవీ అల్కాజార్ పెట్రోల్ వర్షన్‌పై రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్​ఛేంజ్ సపోర్ట్, అప్‌గ్రేడ్ ఆఫర్లు ఉన్నాయి. కొన్ని మోడళ్లపై ఎక్స్​ఛేంజ్ బోనస్‌తో పాటు అదనంగా రూ. 5,000 స్క్రాపేజ్ బెనిఫిట్ కూడా ఇస్తున్నారు.

నవరాత్రి పండుగ వేళ సొంత కారు డెలివరీ తీసుకోవాలనుకునే వారికి ఈ పథకాలు మంచి వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే మీరు ఎంచుకునే వేరియంట్, రంగు, డీలర్‌షిప్ ప్రాంతాన్ని బట్టి ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More