109 కి.మీ రేంజ్​తో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎన్​-ఫస్ట్​ ధర ఎంతంటే..

ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ న్యూమెరోస్ మోటార్స్ తన రెండొవ ఎలక్ట్రిక్ టూ-వీలర్‌ను 'ఎన్​-ఫస్ట్​' పేరుతో తాజాగా విడుదల చేసింది. మొదటి 1,000 కొనుగోలుదారుల కోసం దీని ప్రారంభ ధర రూ. 64,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ మోడల్​ ఫీచర్స్​ సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 07, 2025 12:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు న్యూమెరోస్ మోటార్స్ తన పోర్ట్​ఫోలియోని విస్తరిస్తూ, రెండొవ ఎలక్ట్రిక్ టూ-వీలర్‌ను తాజాగా లాంచ్​ చేసింది. దాని పేరు n-Firs. ఈ ఈవని మొదటి 1,000 మంది కొనుగోలుదారుల కోసం రూ. 64,999 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 84,999 ప్రారంభ ధరతో ప్రవేశపెట్టారు. ఈ కొత్త మోడల్ కోసం ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్​-ఫస్ట్​ మోడల్‌ను ఇటాలియన్ డిజైన్ హౌస్ అయిన వీల్‌ల్యాబ్​ సహకారంతో రూపొందించారు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ రేంజ్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎన్​ ఫస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇదిగో..
ఎన్​ ఫస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇదిగో..

ఎన్​-ఫస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​- డిజైన్, స్టైలింగ్..

ఎన్​-ఫస్ట్​ ఎలక్ట్రిక్ స్కూటర్ గుండ్రటి హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. చిన్న ఏప్రాన్‌తో ప్రత్యేకమైన డిజైన్​ దీని సొంతం. ఈ స్కూటర్ ముందు భాగంలో పదునైన గీతలు, హెడ్ యూనిట్ చుట్టూ ఉండే నిర్మాణం వల్ల ఇది స్పోర్టీ అప్పీల్​ని ఇస్తుంది. వెనుక వైపు చూస్తే, ఇది సరళమైన డిజైన్, స్టార్టింగ్ లైన్స్, రెండు-పీస్ సీట్లను కలిగి ఉంది.

ఈ డిజైన్‌కు అనుగుణంగా, కంపెనీ ఈ స్కూటర్‌కు 16-ఇంచ్​ వీల్స్‌ను అందించింది. ఈ సెగ్మెంట్‌లో ఈ పరిమాణపు వీల్స్ చాలా అరుదు. ఇది ట్రాఫిక్ రెడ్, ప్యూర్ వైట్ అనే రెండు రంగుల ఎంపికలలో లభిస్తుంది.

ఎన్​-ఫస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​- వేరియంట్లు, రేంజ్ వివరాలు..

ఎన్​-ఫస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ మొత్తం ఐదు వేరియంట్లు, మూడు ట్రిమ్ లెవల్స్‌లో అందుబాటులో ఉంది. అవి ఎన్​-ఫస్ట్​ మ్యాక్స్​, ఎన్​-ఫస్ట్​ ఐ మ్యాక్స్​, ఎన్​-ఫస్ట్​ ఐ మ్యాక్స్​ ప్లస్​.

టాప్​ ఎండ్​ వేరియంట్ అయిన 3కేడబ్ల్యూహెచ్​ ఐ-మ్యాక్స్​+ గరిష్టంగా 109 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్​ని అందిస్తుంది.

2.5కేడబ్ల్యూహెచ్​ వేరియంట్లు (మ్యాక్​స్​, ఐ-మ్యాక్స్​) లిక్విడ్ ఇమ్మర్షన్-కూల్డ్ లిథియం-అయాన్ బ్యాటరీలతో వస్తాయి. ఇవి 91 కిలోమీటర్ల వరకు ఐడీసీ రేంజ్‌ను అందిస్తాయి.

ఎన్​-ఫస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​- పనితీరు, ఛార్జింగ్..

ఎన్​-ఫస్ట్​ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రధానంగా 1.8 కేడబ్ల్యూ పీఎంఎస్​ఎం మిడ్-డ్రైవ్ మోటార్​తో చైన్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. ఇది సమర్థవంతమైన పవర్​ వినియోగాన్ని, మృదువైన యాక్సిలరేషన్‌ను అందిస్తుంది.

ఈ ఈ-స్కూటర్​ గరిష్ట వేగం ప్రస్తుతం 70 కిలోమీటర్లు/గంగా ఉంది.

  • 2.5 కేడబ్ల్యూహెచ్​ మోడల్ 0-100% ఛార్జింగ్ కావడానికి దాదాపు 5-6 గంటలు పడుతుంది.
  • 3.0 కేడబ్ల్యూహెచ్​ వెర్షన్‌కు ఛార్జింగ్ కావడానికి 7-8 గంటలు పడుతుంది.

మెరుగైన పనితీరు కోసం ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఎన్​-ఫస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​- సస్పెన్షన్, కొలతలు..

సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎన్​-ఫస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు హైడ్రాలిక్ డ్యాంపర్‌లతో అడ్జెస్టెబుల్​ డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. రెండు చక్రాల వద్ద డ్రమ్ బ్రేక్‌లతో బ్రేకింగ్ బాధ్యతలను నిర్వహిస్తారు.

ఈ స్కూటర్ కొలతలు ఇలా ఉన్నాయి:

పొడవు: 1979 ఎంఎం

వెడల్పు: 686 ఎంఎం

ఎత్తు: 1125 ఎంఎం

వీల్‌బేస్: 1341 ఎంఎం

గ్రౌండ్ క్లియరెన్స్: 159 ఎంఎం