బంగాళాఖాతంలోర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్రరూపం దాల్చుతుండటంతో తమిళనాడు వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(అక్టోబర్ 21) రాష్ట్రంలోని నాలుగు ప్రధాన జిల్లాల్లో పాఠశాలలకు ముందస్తుగా సెలవు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చెన్నైతో పాటు దాని పొరుగు జిల్లాలైన తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురంలలోని పాఠశాలలన్నింటికీ ఈ నిర్ణయం వర్తిస్తుంది.

రాబోయే 24 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించడంతో…. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ ఆదేశాలు జారీ చేశారు.
నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్రమై అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం బులిటెన్ విడుదల చేసింది. ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, విలుప్పురం, చెంగల్పట్టు, చెన్నై, తిరువళ్లూర్, రామనాథపురం, తిరువారూర్, తంజావూరు, నాగపట్నం, మయిలాడుత్తురై తదితర ప్రాంతాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేశారు.
అంతేకాకుండా కన్యాకుమారి, తూత్తుకూడి, దిండిగల్, రాణిపేట, తిరుచిరాపల్లి, తిరునెల్వేలి, ఇతర దక్షిణ జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' ప్రకటించారు. అక్టోబర్ 26 వరకు తమిళనాడు వ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాలపైనా ప్రభావం….
ఈ వాతావరణ మార్పుల ప్రభావం కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది.కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎమ్‌డీ స్పష్టం చేసింది. అంతర్గత కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో అక్టోబర్ 22 నుండి 26 వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
గత కొద్దిరోజులుగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శివగంగ జిల్లాలోని అమరావతి పుదూర్‌లో అత్యధికంగా 9.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రామనాథపురం జిల్లా తిరువాడనైలో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.రాజధాని చెన్నైలో శనివారం రాత్రి సరిహద్దు ప్రాంతాల్లో 30 సెంటీమీటర్లకు పైగా రికార్డు స్థాయి వర్షం పడటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం నుంచి వర్ష తీవ్రత కొంత తగ్గినా…. తాజా అల్పపీడన ప్రమాదం పొంచి ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది.
{{/usCountry}}గత కొద్దిరోజులుగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శివగంగ జిల్లాలోని అమరావతి పుదూర్‌లో అత్యధికంగా 9.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రామనాథపురం జిల్లా తిరువాడనైలో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.రాజధాని చెన్నైలో శనివారం రాత్రి సరిహద్దు ప్రాంతాల్లో 30 సెంటీమీటర్లకు పైగా రికార్డు స్థాయి వర్షం పడటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం నుంచి వర్ష తీవ్రత కొంత తగ్గినా…. తాజా అల్పపీడన ప్రమాదం పొంచి ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది.
{{/usCountry}}