ఐసీఎస్‌ఈ క్లాస్ 10, ఐఎస్ఈ 12వ తరగతి పరీక్షల అడ్మిట్ కార్డులు త్వరలోనే- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి 2026 వార్షిక పరీక్షల అడ్మిట్ కార్డులను సీఐఎస్‌సీఈ త్వరలోనే విడుదల చేయనుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cisceboard.org ద్వారా వీటిని పొందవచ్చు. పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానున్నాయి.
కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ), తమ ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్‌ఈ - 10వ తరగతి, ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ (ఐఎస్‌సీ - 12వ తరగతి) 2026 వార్షిక పరీక్షల అడ్మిట్ కార్డులను త్వరలోనే విడుదల చేయనుంది . బోర్డు అడ్మిట్ కార్డులను విడుదల చేసిన వెంటనే, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cisceboard.org ద్వారా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ విద్యాసంవత్సరం గణాంకాలను పరిశీలిస్తే.. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 30, 2026 వరకు జరగనున్న ఐసీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలకు దాదాపు 2.6 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అలాగే, ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 6, 2026 మధ్య నిర్వహించే ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలకు 1.5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ 2026 అడ్మిట్ కార్డులు- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
స్టెప్ 1- ముందుగా అధికారిక వెబ్‌సైట్ cisceboard.org ను సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో కనిపించే "ICSE Class 10 Admit Card" లేదా "ISC Class 12 Admit Card" అనే లింక్‌లపై క్లిక్ చేయండి.
స్టెప్ 3- అక్కడ అడిగిన లాగిన్ వివరాలను సరిగ్గా నమోదు చేయండి.
స్టెప్ 4- వెంటనే మీ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
స్టెప్ 5- భవిష్యత్తు అవసరాల కోసం దానిని డౌన్‌లోడ్ చేసుకుని, కాపీని భద్రపరుచుకోండి.
పరీక్షల షెడ్యూల్ వివరాలు:
ఐసీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న ఇంగ్లీష్ లాంగ్వేజ్ - పేపర్ 1తో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 19, 2026న ఇంగ్లీష్ లిటరేచర్ - పేపర్ 2 పరీక్ష ఉంటుంది. చివరగా మార్చి 30న ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ పరీక్షతో 10వ తరగతి పరీక్షలు ముగుస్తాయి.
ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 12న సైకాలజీ సబ్జెక్టుతో మొదలవుతాయి. ఫిబ్రవరి 13న ఇంగ్లీష్ పేపర్ 1 - ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 6న జాగ్రఫీ పరీక్షతో 12వ తరగతి షెడ్యూల్ పూర్తవుతుంది.
ఐసీఎస్‌ఈ పరీక్షా సరళి: ఐసీఎస్‌ఈ పరీక్షా విధానం విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో సమగ్రమైన విద్యను అందించేలా రూపొందించారు. సబ్జెక్టుల వైవిధ్యం కంటే ప్రాథమిక విద్యను పటిష్టం చేయడంపై ఇది దృష్టి పెడుతుంది. విద్యార్థులు ఇంగ్లీష్ (తప్పనిసరి) సహా మొత్తం ఆరు సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు సోషల్లీ యూజ్‌ఫుల్ ప్రొడక్టివ్ వర్క్, కమ్యూనిటీ సర్వీస్‌లో విద్యార్థుల పనితీరును కూడా బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


