...
...
Next Story

CJP Nationwide Protest: విద్యార్థులపై దాడికి నిరసనగా రేపు సీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు

నీట్-యుజి (NEET-UG 2026) పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలకు నిరసనగా జూలై 24 శుక్రవారం రోజున దేశవ్యాప్త ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో శాంతియుతంగా నిరసనలు తెలపాలని శ్రేణులను కోరింది.

Published on: Jul 23, 2026, 20:49:32 IST
Advertisement

న్యూఢిల్లీ: నీట్-యుజి పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు చేపట్టిన నిరసనలపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 24, శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. "ప్రతి జిల్లా.. ఒకే రోజు.. ఒకే డిమాండ్" అనే నినాదంతో ఈ ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

CJP Nationwide Protest: విద్యార్థులపై దాడికి నిరసనగా రేపు సీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు (AFP)
CJP Nationwide Protest: విద్యార్థులపై దాడికి నిరసనగా రేపు సీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు (AFP)

విద్యార్థి సంఘాలు, పౌర సమాజ వేదికలతో కలిసి ప్రతీ జిల్లా కేంద్రంలోనూ శాంతియుతంగా ప్రదర్శనలు చేపట్టాలని సీజేపీ నాయకత్వం కోరింది. నిరసన ప్రదర్శనలకు సంబంధించి ప్రామాణిక నిబంధనలను (SOP), ప్రచార సామగ్రిని, వినతిపత్రం నమూనాను పార్టీ ఇప్పటికే పంచుకుంది. స్థానిక అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకుని నిరసనలు నిర్వహించాలని, ప్రదర్శనల సమయంలో విద్యార్థుల డిమాండ్లను బిగ్గరగా చదివి వినిపించిన అనంతరం సంబంధిత జిల్లా అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని స్థానిక నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

చర్చల వేదికపై తేలని పీటముడి

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ శ్రేణులు, విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న ఆందోళనలు కొనసాగుతుండగానే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చర్చల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా వంటి ముందస్తు షరతులు లేకుండానే పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం సంకేతాలు ఇచ్చింది.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం రోజున స్పందిస్తూ సీజేపీ నేతలతో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. "సీజేపీ ప్రతినిధులతో మాట్లాడేందుకు మేము పూర్తి సుముఖంగా ఉన్నాం. వారు నా అధికారిక నివాసానికి గానీ, లేదా కార్యాలయానికి గానీ వచ్చి చర్చలు జరపవచ్చు" అని జేపీ నడ్డా పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: దేశంలో పోటీ పరీక్షల నిర్వహణలో వెలుగుచూసిన అక్రమాలు, విద్యాశాఖ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. ఈ మేరకు 'సీజేపీ' (CJP) ఆధ్వర్యంలో సాగుతున్న దేశవ్యాప్త ఆందోళనలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురువారం రోజున సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

ఈ మేరకు ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ ఒక వీడియో సందేశాన్ని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విడుదల చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎలాంటి పార్టీ జెండాలు లేదా బానర్లు లేకుండా సాధారణ పౌరులుగా ఈ విద్యార్థి ఆందోళనల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe