న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి నిరసన తెలిపారనే ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ (సిజేపీ) ముఖ్య ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ ప్రతినిధి అశుతోష్ రంకాలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని బుధవారం ఉదయం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్ఈఎమ్) ఎదుట హాజరుపరచగా, ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, పార్టీకి చెందిన మరో నాయకుడు అజింక్యా షిండేను రూ.5,000 పూచీకత్తు, వ్యక్తిగత బాండ్‌పై ఆరు నెలల పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించననే షరతుతో కోర్టు విడుదల చేసింది.
పోలీసుల వాదనలు.. 'మళ్లీ నేరానికి పాల్పడే అవకాశం ఉంది'

స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులో ఢిల్లీ పోలీసులు తమ వాదనలు వినిపిస్తూ.. నిందితులు బయట ఉంటే మళ్లీ ఏదైనా నేరానికి లేదా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఆదివారం ఢిల్లీ క్యాంట్ పోలీస్ స్టేషన్లో శాంతిభద్రతల ఉల్లంఘనకు పాల్పడబోమని రాసిచ్చిన ష్యూరిటీ బాండ్‌ను నిందితులు ఉల్లంఘించారని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలను జంతర్ మంతర్ వద్దకు రావాలని పిలుపునిచ్చారని, విధులు నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో కన్నాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లలో భారత్ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘన, పోలీసులపై దాడి, కుట్ర, అక్రమ ప్రవేశం వంటి తీవ్రమైన సెక్షన్లతో పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
'పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారు'
సీజేపీ నేతల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది అభిష్త్ హేలా పోలీసుల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నిందితులు ఎవరినీ జంతర్ మంతర్ రావాలని పిలవలేదని, పోలీసులు కోర్టులో అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. "ప్రజలను రమ్మని నా క్లయింట్లు ఎలాంటి పిలుపునివ్వలేదు. వారు ముందస్తు బాండ్‌ను ఉల్లంఘించలేదు. ఈ వ్యవహారాన్ని విచారించే అధికారం ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్కే ఉంటుంది తప్ప ఎస్ఈఎమ్కు లేదు. కన్నాట్ ప్లేస్ కేసుకు సంబంధించిన ఫిర్యాదును ఇక్కడ దుర్వినియోగం చేశారు" అని న్యాయవాది స్పష్టం చేశారు.
జాతీయ జెండా ఎగురవేస్తే తప్పా?: అభిజీత్ దిప్కే
సీజేపీ నాయకుల జ్యుడీషియల్ కస్టడీపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తీవ్రంగా స్పందించారు. "జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే అశుతోష్, సౌరవ్లు చేసిన తప్పా? ప్రధాని నరేంద్ర మోదీకి ధైర్యముంటే ఇటువంటి పిరికిపంద చర్యల వెనుక దాక్కోకుండా అధికారికంగా అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించాలి" అని సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో సవాలు విసిరారు. జంతర్ మంతర్ లాంటి పోరాట కేంద్రాల నుంచి నిరసన స్వరాన్ని తొలగించడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
జంతర్ మంతర్ ప్రాంగణం రద్దు
{{/usCountry}}సీజేపీ నాయకుల జ్యుడీషియల్ కస్టడీపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తీవ్రంగా స్పందించారు. "జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే అశుతోష్, సౌరవ్లు చేసిన తప్పా? ప్రధాని నరేంద్ర మోదీకి ధైర్యముంటే ఇటువంటి పిరికిపంద చర్యల వెనుక దాక్కోకుండా అధికారికంగా అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించాలి" అని సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో సవాలు విసిరారు. జంతర్ మంతర్ లాంటి పోరాట కేంద్రాల నుంచి నిరసన స్వరాన్ని తొలగించడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
జంతర్ మంతర్ ప్రాంగణం రద్దు
{{/usCountry}}కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎమ్హెచ్ఏ) ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్‌ను నిరసనల ప్రాంగణాల జాబితా నుంచి ఇటీవల తొలగించారు. దీనికి ప్రత్యామ్నాయంగా రామ్‌లీలా మైదానం, బురాడీ మైదానం, ఈస్ట్ దిల్లీలోని సీబీడీ మైదానాలను కేటాయించారు. అయితే, మంగళవారం ఉదయం నిరసన సైట్‌గా రద్దయిన జంతర్ మంతర్ తాళాలు వేసిన గేట్లు దాటుకొని సీజేపీ నేతలు ప్రాంగణంలోకి ప్రవేశించారు. భారత్ మాతాకీ జై, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతంలో పరీక్షా అక్రమాల వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన నిరసనలకు ఈ సీజేపీనే నాయకత్వం వహించడం గమనార్హం.