కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి పోరాటానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 5న రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి నూతన ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు సోమవారం తెలిపింది. జూలై 20న నిర్వహించిన 'సన్సద్ చలో' ర్యాలీలో పోలీసుల లాఠీఛార్జ్ బాధితులు, నీట్ (NEET) పరీక్ష రద్దు తీవ్రతతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబ సభ్యులు ఈ మార్చ్‌కు ముందుండి నాయకత్వం వహిస్తారని వెల్లడించింది.

రాత్రి 2 గంటలకు సమావేశమైన CJP జాతీయ వర్కింగ్ కమిటీ, జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన అభయ పత్రం అమలు తీరుపై సుదీర్ఘంగా సమీక్షించింది. విద్యార్థులు, ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల (FIRs) రద్దు, బాధిత కుటుంబాలకు పరిహారం విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేంద్రం కాలయాపన చేస్తోంది: CJP ఆగ్రహం
"గత నెల రోజులుగా పవిత్రంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం సాంకేతిక కారణాల వెనుక దాక్కుంటూ కాలయాపన చేస్తోంది. సుప్రీంకోర్టు ముందు కూడా స్పష్టమైన భరోసా ఇవ్వడానికి వెనుకాడటం దారుణం" అని CJP తన ప్రకటనలో ధ్వజమెత్తింది.
ఆగస్టు 18న సుప్రీంకోర్టు విచారణ సమయంలో, దేశవ్యాప్తంగా నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల జాబితాను సమర్పిస్తే వాటన్నింటినీ ఒకేసారి రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వడానికి నిరాకరించిందని సిజెపి ఆరోపించింది.
"మా ఓర్పును బలహీనతగా భావించవద్దు. మా మంచి తనాన్ని ప్రభుత్వం ద్రోహం చేయడానికి అవకాశంగా మలుచుకోకూడదు" అని CJP స్పష్టం చేసింది.
‘విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు’
జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన మాటను నమ్మి దేశవ్యాప్త ఆందోళనలను విరమించుకున్నామని, కానీ ప్రభుత్వం ఇప్పుడు ‘విశ్వాసఘాతుకానికి’ ఒడిగట్టిందని CJP నాయకులు విమర్శించారు. అందుకే మళ్లీ రోడ్డెక్కక తప్పడం లేదని తేల్చిచెప్పారు.
"ఒక మొత్తం తరం నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, వారిని నిరసన వేదికల నుంచి ఇళ్లకు పంపిన తర్వాత ప్రభుత్వం తన మాట తప్పడం సరికాదు. ఈ ద్రోహాన్ని మేము ఎంతమాత్రం సహించబోం" అని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 5న ఇండియా గేట్‌కు తరలిరండి
{{/usCountry}}"ఒక మొత్తం తరం నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, వారిని నిరసన వేదికల నుంచి ఇళ్లకు పంపిన తర్వాత ప్రభుత్వం తన మాట తప్పడం సరికాదు. ఈ ద్రోహాన్ని మేము ఎంతమాత్రం సహించబోం" అని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 5న ఇండియా గేట్‌కు తరలిరండి
{{/usCountry}}దేశంలోని విద్యార్థులు, యువత, యువజన సంఘాలు సెప్టెంబర్ 5న ఇండియా గేట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని తమతో కలసి శాంతియుతంగా నడవాలని CJP పిలుపునిచ్చింది.
"యువతకు ఇచ్చిన మాటలకు విలువ ఉంటే, ప్రభుత్వం వెంటనే ఆ హామీలను అక్షరాలా నెరవేర్చాలి" అని సీజేపీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్, లీగల్ అఫైర్స్ లీడ్ రత్న సింగ్ డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది? (నేపథ్యం)
నీట్-యుజి (NEET-UG) పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 37 రోజుల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం తర్వాత, జూలై 25న నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆందోళనకారులపై పెట్టిన కేసుల రద్దుతో పాటు, ప్రాణాలు కోల్పోయిన నీట్ బాధితుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆ వాగ్దానాలు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడంతో మళ్లీ ఆందోళన జ్వాలలు రగిలాయి.