గుజరాత్‌లోని వడోదర జిల్లా కర్జన్ సమీపంలో ఉన్న జాతీయ రహదారి 48 వద్ద ఒక తీవ్రమైన ప్రమాదం చోటుచేసుకుంది. సీఎన్జీ స్టేషన్‌లో కారులో గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమవ్వడమే కాకుండా, సమీపంలో ఉన్న బంక్ మౌలిక వసతులు, ఇతర వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అసలేం జరిగింది?

జిందాల్ కంపెనీకి ఎదురుగా ఉన్న సీఎన్జీ బంకు వద్ద ఈ ఘటన జరిగింది. స్థానిక సమాచారం ప్రకారం.. కారులో సీఎన్జీ నింపుతున్న సమయంలో సిలిండర్ ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడికి గురై పేలిపోయింది. ఈ పేలుడు తీవ్రతకు కారు వెనుక భాగం నుజ్జునుజ్జవ్వడమే కాక, అద్దాలు, ఇతర భాగాలు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి!
ఆ సమయంలో పక్కనే పార్క్ చేసి ఉన్న మరికొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. కారులో గ్యాస్ నింపేటప్పుడు డ్రైవర్ బయటకు వచ్చి దూరంగా నిలబడటం, సీఎన్జీ స్టేషన్ సిబ్బంది కూడా సురక్షిత దూరంలో ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే కర్జన్ ఫైర్ బ్రిగేడ్, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి ముప్పు లేకుండా చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు..
ఈ పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, కారులోని సీఎన్జీ కిట్‌లో గ్యాస్ లీకేజీ ఉండటం లేదా సిలిండర్ వాల్వ్‌లో లోపం ఉండటమే ఈ పేలుడుకు ప్రధాన కారణం కావచ్చని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. గ్యాస్ నింపుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో, ఒత్తిడి తాళలేక సిలిండర్ పేలిందా అనే కోణంలో పోలీసులు, రవాణా శాఖ అధికారులు సమగ్ర విచారణ ప్రారంభించారు.
వాహనంలోని సీఎన్జీ ఫిట్టింగ్స్, సిలిండర్ నాణ్యత, అలాగే రీఫ్యూయలింగ్ సమయంలో బంకు సిబ్బంది భద్రతా నిబంధనలు పాటించారా లేదా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
{{/usCountry}}వాహనంలోని సీఎన్జీ ఫిట్టింగ్స్, సిలిండర్ నాణ్యత, అలాగే రీఫ్యూయలింగ్ సమయంలో బంకు సిబ్బంది భద్రతా నిబంధనలు పాటించారా లేదా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
{{/usCountry}}ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియో చూసి సీఎన్జీ ఓనర్లు భయపడిపోతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రతి సీఎన్జీ వాహనదారుడు పాటించాల్సిన 3 ముఖ్యమైన భద్రతా నియమాలను ఇక్కడ తెలుసుకోండి..
గ్యాస్ నింపేటప్పుడు కారు నుంచి బయటకు రావాలి..
సీఎన్జీ నింపే సమయంలో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులందరూ తప్పనిసరిగా వాహనం దిగి దూరంగా నిలబడాలి. వడోదర ఘటనలో డ్రైవర్, ప్రయాణికులు బయటకు రావడం వల్లనే వారి ప్రాణాలు దక్కాయి.
సీఎన్జీ సిలిండర్, కిట్ రెగ్యులర్ చెకప్..
అనుమతి పొందిన (సర్టిఫైడ్) సీఎన్జీ వర్క్‌షాప్‌లలో నిర్ణీత వ్యవధుల్లో సిలిండర్ నాణ్యత, వాల్వ్ పరిస్థితి, పైప్‌లైన్ లీకేజీలను తనిఖీ చేయించాలి. ఏ చిన్న తుప్పు పట్టడం లేదా లీకేజీ సంకేతాలు కనిపించినా వెంటనే మరమ్మతులు చేయించాలి.
అనధికారిక కిట్లు, ఫిట్టింగ్స్‌ను వాడకండి..
తక్కువ ధరకు వస్తున్నాయని అనధికారిక లేదా నాసిరకం సీఎన్జీ కిట్లను, లోకల్ విడిభాగాలను ఉపయోగించకూడదు. సర్టిఫైడ్ కంపెనీ భాగాలు, నైపుణ్యం ఉన్న టెక్నీషియన్ల ద్వారా మాత్రమే సీఎన్జీ పనులు చేయించాలి. నాసిరకం విడిభాగాలు అధిక ఒత్తిడిని తట్టుకోలేక ఇటువంటి ప్రమాదాలకు దారితీస్తాయి.