...
...
Next Story

TVK Vijay : సీఎం దళపతి విజయ్.. టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం!

CM Thalapathy Vijay : తమిళనాడులో టీవీకే విజయ్‌‌కు మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మరికొంత మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Published on: May 5, 2026, 21:55:04 IST
Advertisement

తమిళగ వెట్రి కజగం(TVK) అధినేత విజయ్‌కు కాంగ్రెస్ పార్టీ అనూహ్య మద్దతు ప్రకటించింది. ఈ కీలక పరిణామంతో తమిళనాడులో నూతన రాజకీయ శకం ఆరంభం కాబోతోంది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు మార్గం సుగమమైంది.

టీవీకే విజయ్
టీవీకే విజయ్

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మరియు యువత ఆకాంక్షలకు అనుగుణంగా విజయ్ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్‌లాంటి ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఫలితాలు, అనంతర పరిస్థితులపై సమావేశంలో చర్చించారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని టీవీకే అధినేత విజయ్ కోరారు. 'లౌకిక ప్రభుత్వ ఏర్పాటు, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రజలు తీర్పునిచ్చారు. విజయ్ పార్టీ విజ్నప్తిపై తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశాం.' అని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలు గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్లస్ ఇతర పార్టీలతో మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకుంటుంది.

మెజారిటీకి కావలసిన మద్దతు లభిస్తుండటంతో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విజయ్ మే 7, 2026న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ కలిసి.. ప్రభుత్వ ఏర్పాటు గురించి మట్లాడనున్నారు.

విజయ్ ముఖ్యమంత్రి అవుతుండటంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా యువత, సామాన్య ప్రజానీకం విజయ్ పాలనపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అవినీతి రహిత పాలన, సంక్షేమ పథకాలపై విజయ్ దృష్టి సారిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe