...
...
Next Story

CTET 2026 : నేటి నుంచి సీటెట్- అభ్యర్థుల కోసం సీబీఎస్‌ఈ కఠిన మార్గదర్శకాలు, వీటిపై నిషేధం..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) ఫిబ్రవరి 7, 8 తేదీల్లో దేశవ్యాప్తంగా 140కి పైగా నగరాల్లో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్​)ను నిర్వహిస్తోంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిబంధనలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ వివరాలు..

Published on: Feb 7, 2026, 06:45:22 IST
Advertisement

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్​)ను ఫిబ్రవరి 7- 8, 2026 తేదీల్లో దేశవ్యాప్తంగా 140 కంటే ఎక్కువ నగరాల్లో నిర్వహించనుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ). పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిర్దిష్ట మార్గదర్శకాలను పాటించాలి. లేనిపక్షంలో వారు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది.

సీటెట్​ 2026 వివరాలు..
సీటెట్​ 2026 వివరాలు..

ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఫిబ్రవరి 5, 2026న విడుదలైంది. అభ్యర్థులు దీనిని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులో పేర్కొన్న పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయాన్ని జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలని, రిపోర్టింగ్ సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సీబీఎస్‌ఈ సూచించింది. రిపోర్టింగ్ సమయం ముగిసిన తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించబోమని బోర్డు స్పష్టం చేసింది. అలాగే పరీక్షా నగరం, కేంద్రం లేదా తేదీ మార్పు అభ్యర్థనలు అంగీకరించమని తేల్చి చెప్పింది.

సీటెట్​ 2026 పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.

సీటెట్​ 2026 అభ్యర్థుల కోసం కీలక మార్గదర్శకాలు:

సీటెట్​ 2026 అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఐడీ ప్రూఫ్, అడ్మిట్ కార్డ్‌ను పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లాలి; లేని పక్షంలో ప్రవేశం ఉండదు.

నిషేధిత వస్తువుల జాబితా: లోహ వస్తువులు, పుస్తకాలు, లూజ్ పేపర్లు, జామెట్రీ సెట్లు, పెన్సిల్ బాక్సులు, నగలు, ప్లాస్టిక్ పౌచ్‌లు, పెన్సిళ్లు, స్కేళ్లు, లాగ్ టేబుల్‌లు, రైటింగ్ ప్యాడ్‌లు, ఎరేజర్‌లు, వైట్‌నర్‌లు, కార్డ్‌బోర్డ్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, వాచీలు, వాలెట్లు, కళ్లద్దాల బాక్సులు, హ్యాండ్‌బ్యాగులు, మొబైల్ ఫోన్లు, ఇయర్‌ఫోన్లు, మైక్రోఫోన్లు, కెమెరాలు, హెడ్‌ఫోన్లు, పెన్ డ్రైవ్‌లు, పేజర్లు, బ్లూటూత్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, ఎలక్ట్రానిక్ పెన్నులు/స్కానర్లు లేదా ఆహార పదార్థాలను తీసుకెళ్లకూడదు.

సీటెట్ 2026 అడ్మిట్ కార్డులను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

స్టెప్​ 1- అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in లేదా cbse.gov.in సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్‌పేజీలో స్క్రోల్ చేసి 'CBSE CTET 2026 admit card' పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయండి.

స్టెప్​ 4- కాల్ లెటర్ పీడీఎఫ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టెప్​ 5- దానిని డౌన్‌లోడ్ చేసి ప్రింటౌట్​ చేసుకోండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks