సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఫిబ్రవరి 2026 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ (ప్రొవిజనల్ ఆన్సర్ కీ) విడుదలకు రంగం సిద్ధమైంది! అభ్యర్థులు తమ సమాధానాలను సరిచూసుకోవడానికి వీలుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in లో ఈ సీటెట్ ఫిబ్రవరి 2026 ఆన్సర్ కీని ఈరోజు, మార్చి 2న అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఈ ఆన్సర్ కీ ద్వారా అభ్యర్థులు తమ స్కోరును అంచనా వేసుకోవడమే కాకుండా, ఏవైనా అభ్యంతరాలు ఉంటే బోర్డుకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది.
సీటెట్ 2026 ఆన్సర్ కీ- నేడే విడుదలయ్యే అవకాశం!

ఫిబ్రవరి 7, 8 తేదీల్లో 1 నుంచి 5 తరగతులు (పేపర్-1), 6 నుంచి 8 తరగతుల (పేపర్-2) ఉపాధ్యాయ పోస్టుల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. గత రికార్డులను పరిశీలిస్తే, పరీక్ష ముగిసిన 15 రోజుల్లోపు సీబీఎస్‌ఈ కీని విడుదల చేస్తూ వస్తోంది. ఆ లెక్కన చూస్తే.. నేడు, అనగా మార్చి 2, 2026న ఏ క్షణమైనా వెబ్‌సైట్‌లో సీటెట్ 2026 ఆన్సర్ కీ లైవ్ అయ్యే అవకాశం ఉంది.
సీటెట్ 2026 ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్టెప్ 1- ముందుగా అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ను సందర్శించండి.
స్టెప్ 2- హోమ్‌పేజీలో కనిపించే "Login: CTET Feb 2026 Answer Key" లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- మీ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను ఎంటర్ చేయండి.
స్టెప్ 4- ఇప్పుడు స్క్రీన్‌పై మీ రెస్పాన్స్ షీట్, ఆన్సర్ కీ కనిపిస్తాయి.
స్టెప్ 5- భవిష్యత్తు అవసరాల కోసం దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.
సీటెట్ ఫిబ్రవరి 2026 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకునేందుకు కావాల్సిన డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీటెట్ 2026 ఆన్సర్ కీ- అభ్యంతరాల స్వీకరణ..
ఈ సీటెట్ 2026 ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు ఉన్నాయని అభ్యర్థులు భావిస్తే, నిర్ణీత రుసుము చెల్లించి అభ్యంతరాలను దాఖలు చేయవచ్చు. అభ్యర్థులు సమర్పించిన సవాళ్లను నిపుణుల కమిటీ సమీక్షించిన అనంతరం 'ఫైనల్ ఆన్సర్ కీ'ని విడుదల చేస్తారు. ఈ తుది ఆన్సర్ కీ ఆధారంగానే ఫలితాలను సిద్ధం చేస్తారు.
బీహార్‌లో రెండు కేంద్రాల్లో పరీక్ష రద్దు.. మళ్లీ నిర్వహణ..
{{/usCountry}}ఈ సీటెట్ 2026 ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు ఉన్నాయని అభ్యర్థులు భావిస్తే, నిర్ణీత రుసుము చెల్లించి అభ్యంతరాలను దాఖలు చేయవచ్చు. అభ్యర్థులు సమర్పించిన సవాళ్లను నిపుణుల కమిటీ సమీక్షించిన అనంతరం 'ఫైనల్ ఆన్సర్ కీ'ని విడుదల చేస్తారు. ఈ తుది ఆన్సర్ కీ ఆధారంగానే ఫలితాలను సిద్ధం చేస్తారు.
బీహార్‌లో రెండు కేంద్రాల్లో పరీక్ష రద్దు.. మళ్లీ నిర్వహణ..
{{/usCountry}}కొన్ని కారణాల వల్ల బీహార్‌లోని రెండు పరీక్షా కేంద్రాల్లో సీటెట్ పేపర్-2ను సీబీఎస్‌ఈ రద్దు చేసింది. వైశాలి (హాజీపూర్) లోని సెయింట్ జాన్స్ అకాడమీ, బస్మతి నగర్, లక్ష్య ఇంటర్నేషనల్ అకాడమీ కేంద్రాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ కేంద్రాలకు సంబంధించిన అభ్యర్థులకు 15 రోజుల్లోపు తిరిగి పరీక్ష నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పరీక్ష తేదీ,ఇతర వివరాలను అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందజేయనున్నారు.