CUET PG 2026 : సీయూఈటీ పీజీ టైమ్ టేబుల్ విడుదల- పరీక్ష తేదీలను ఇలా చెక్ చేసుకోండి!
సీయూఈటీ పీజీ 2026కి సంబంధించిన టైమ్ టేబుల్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టైమ్ టేబుల్లోని ముఖ్యమైన వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కేంద్రీయ, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీయూఈటీ పీజీ 2026 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 4.11 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈసారి అప్లై చేసుకోగా, వారందరికీ సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది.

సీయూఈటీ పీజీ 2026- పరీక్ష తేదీలు, షిఫ్టుల వివరాలు..
మొత్తం 4,11,366 మంది అభ్యర్థుల కోసం మార్చి 6 నుంచి మార్చి 27 మధ్య ఈ సీయూఈటీ పీజీ 2026 పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో (సీబీటీ) జరిగే ఈ పరీక్షలు రోజుకు రెండు లేదా మూడు షిఫ్టుల్లో జరుగుతాయి.
పరీక్ష ప్రారంభం: మార్చి 6, 2026
పరీక్ష ముగింపు: మార్చి 27, 2026
మొత్తం షిఫ్టులు: 44 షిఫ్టులు
పరీక్ష సమయం: ప్రతి పేపర్‌కు 90 నిమిషాల సమయం కేటాయించారు.
ముఖ్యమైన తేదీలు: మార్చి 6, 7, 8, 9, 10, 11, 12, 13, 16, 17, 18, 19, 24, 25, 27 తేదీల్లో ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి.
సీయూఈటీ పీజీ 2026- తొలి రోజు షెడ్యూల్ ఇలా..
సీయూఈటీ పీజీ 2026 టైమ్ టేబుల్ ప్రకారం మార్చి 6న జరిగే మొదటి రోజు పరీక్షలను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు.
మొదటి షిఫ్ట్ (ఉదయం 9:00 - 10:30): యోగా సబ్జెక్టుకు పరీక్ష ఉంటుంది.
రెండొవ షిఫ్ట్ (మధ్యాహ్నం 12:30 - 2:00): స్పోర్ట్స్, సంస్కృతం, ఉర్దూ, టెక్స్‌టైల్ డిజైన్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు.
సీయూఈటీ పీజీ 2026- సిటీ స్లిప్ ఎప్పుడు వస్తుంది?
సీయూఈటీ పీజీ 2026 పరీక్షా కేంద్రం ఏ నగరంలో కేటాయించారో తెలిపే 'సిటీ ఇంటిమేషన్ స్లిప్' పరీక్షకు 10 రోజుల ముందు విడుదల కానుంది. ఉదాహరణకు, మార్చి 6న పరీక్ష రాసే అభ్యర్థులు తమ సిటీ స్లిప్‌ను ఫిబ్రవరి 24 లేదా 25వ తేదీల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు ఆ తర్వాత కొద్ది రోజులకు అందుబాటులోకి వస్తాయి.
సీయూఈటీ పీజీ 2026- పరీక్ష ఏ భాషలో ఉంటుంది?
చాలా సబ్జెక్టులకు పరీక్షలు ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. అయితే:
41 భాషా సంబంధిత పేపర్లు ఆయా భాషల్లోనే ఉంటాయి.
ఎంటెక్, హయ్యర్ సైన్సెస్ పేపర్లు పూర్తిగా ఇంగ్లీష్‌లోనే ఉంటాయి.
ఆచార్య పేపర్లు, హిందూ స్టడీస్ పేపర్లు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటాయి.
సీయూఈటీ పీజీ 2026- షెడ్యూల్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్టెప్ 1- ముందుగా అధికారిక వెబ్‌సైట్ exams.nta.nic.in సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో ఉన్న "CUET PG" విభాగంపై క్లిక్ చేయండి.
స్టెప్ 3- అక్కడ "Candidate Activity" బోర్డు కింద ఉన్న "Subject-Wise Schedule of CUET PG 2026" లింక్‌ను ఎంచుకోండి.
స్టెప్ 4- ఇప్పుడు మీకు పీడీఎఫ్ రూపంలో టైమ్ టేబుల్ కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి.
సీయూఈటీ పీజీ 2026 టైమ్ టేబుల్ని చెక్ చేసుకునేందుకు కావాల్సిన డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఇది కీలకమైన జాతీయ స్థాయి పరీక్ష. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని ఎన్టీఏ సూచించింది.
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న- పరీక్షా కేంద్రం వివరాలు ఎప్పుడు తెలుస్తాయి? అడ్మిట్ కార్డ్ ఎప్పుడు విడుదలవుతుంది?
సమాధానం- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల ప్రకారం, మీ పరీక్షా నగరం వివరాలు పరీక్షకు 10 రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే, ఇది అడ్మిట్ కార్డ్ కాదు. మీ రోల్ నంబర్, పరీక్షా కేంద్రం పేరుతో కూడిన అసలైన అడ్మిట్ కార్డ్ పరీక్షకు కేవలం 3 లేదా 4 రోజుల ముందు మాత్రమే విడుదల అవుతుంది.
ప్రశ్న- పరీక్షా విధానం ఎలా ఉంటుంది? నెగిటివ్ మార్కింగ్ ఉందా?
సమాధానం- సీయూఈటీ పీజీ 2026 పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) పద్ధతిలో జరుగుతుంది. ప్రతి పేపర్‌కు 90 నిమిషాల సమయం ఉంటుంది. సాధారణంగా ఈ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (ఎంసీక్యూ) అడుగుతారు. గత నిబంధనల ప్రకారం, ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు కేటాయిస్తారు, ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సమాధానాలు గుర్తించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


