ఉస్మానియా యూనివర్సిటీ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశారు అధికారులు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తారు.

Published on: Feb 14, 2026 5:39 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సిలబస్ పూర్తి కాలేదని, హాస్టల్ సౌకర్యాలు, ఇతర అంశాలపై రెండు రోజులుగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. 'పోస్ట్ గ్రాడ్యుయేట్ మెుదటి సెమిస్టర్ పరీక్షలను తిరిగి షెడ్యూల్ చేసినట్లు సంబంధిత అందరికీ ఇందుమూలంగా తెలియజేస్తున్నాము. ఈ పరీక్షలు ఇప్పుడు మార్చి 2026 మొదటి వారం నుండి ప్రారంభమవుతాయి.' అని పరీక్షల కంట్రోలర్ విడుదల చేసిన నోటీసులో తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

సిలబస్‌లోని కొన్ని భాగాలు పూర్తి కాలేదని పేర్కొంటూ విద్యార్థులు గత రెండు రోజులుగా క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్నారు. విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం సమీపంలో నిరసనలు జరిగాయి. పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ గురువారం విద్యార్థి ప్రతినిధులు, సంబంధిత విభాగాల డీన్‌లను విడి విడిగా కలిశారు. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత పరీక్షలను వాయిదా వేయాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. సవరించిన టైమ్‌టేబుల్‌ను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

గత రెండు రోజుల్లో క్యాంపస్‌లో నిరసనలు కేవలం పరీక్ష సంబంధిత డిమాండ్లకే పరిమితం కాలేదు. ఆంక్షలు, సౌకర్యాల సంబంధిత ఫిర్యాదులపై గర్ల్స్ హాస్టల్‌లో ప్రత్యేక నిరసన తలెత్తింది. లైటింగ్, వాష్‌రూమ్‌లు, భోజన ఏర్పాట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు సరిపోవట్లేదని విద్యార్థులు చెబుతున్నారు. నిర్ణీత సందర్శన సమయాల వెలుపల తల్లిదండ్రులను కలవడానికి అనుమతి ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపించారు. దాదాపు 50 మంది పురుష విద్యార్థులు నిరసనకు మద్దతుగా చేరారు.

ఆ ఆరోపణలకు స్పందిస్తూ.. హాస్టల్ డైరెక్టర్ కె. లక్ష్మి మాట్లాడారు. కొన్ని డిమాండ్లు ప్రస్తుత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. విద్యార్థుల డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More