OU Distance Education : ఓయూ దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్లు - ఇలా దరఖాస్తు చేసుకోండి
ఓయూ దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు.
ట్ఉస్మానియా యూనివర్శిటీ దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2025 - 2026 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పించనున్నారు. రెండేళ్లపాటు కోర్సు వ్యవధి ఉంటుంది.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం…
ఈ ప్రవేశాల కోసం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 18వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రూ. 500 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
ఇందుకు సంబంధించిన రాత పరీక్ష ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహిస్తారు. గతేడాది నిర్వహించిన తెలంగాణ ఐసెట్ ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రం నేరుగా అడ్మిషన్లు కల్పిస్తారు. వీరు ప్రత్యేకంగా ఎంట్రెన్స్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు అప్లయ్ చేసుకునే అభ్యర్థులు… డిగ్రీ పాసై ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు… డిగ్రీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి.
ఎంట్రెన్స్ ఎగ్జామ్ మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. గంటన్నర సమయం ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 900 చెల్లించాలి. http://www.oucde.net/ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్ ఇలా….
- ముందుగా www.ouadmissions.com వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. దీంతో రిజిస్ట్రేషన్ ఐడీ జనరేట్ అవుతుంది.
- రిజిస్ట్రేషన్ ఐడీ వివరాలతో లాగిన్ అయ్యాక అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- అభ్యర్థి ఫొటో, సంతకం అప్లోడ్ చేయాలి.
- అభ్యర్థి వివరాలను కూడా ఎంట్రీ చేసి చివరగా సబ్మిట్ చేయాలి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫారమ్ కాపీని పొందవచ్చు.
ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

