CUET PG 2026 : సీయూఈటీ పీజీ అప్లికేషన్​కి ఇంకొన్ని గంటలే ఛాన్స్​- ఇలా అప్లై చేసుకోండి..

దేశవ్యాప్తంగా ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీయూఈటీ పీజీ 2026 దరఖాస్తు ప్రక్రియ నేటితో (జనవరి 23) ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 23, 2026 1:05 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్య గమనిక. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ పీజీ 2026) రిజిస్ట్రేషన్ గడువును నేటితో, అంటే జనవరి 23, 2026తో ముగించనుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). దేశంలోని వివిధ కేంద్రీయ, ఇతర గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు వెంటనే తమ దరఖాస్తులను పూర్తి చేయాలి.

సీయూఈటీ పీజీ అప్లికేషన్​కి ఇంకొన్ని గంటలే ఛాన్స్ (Pexels/Representational Image)
సీయూఈటీ పీజీ అప్లికేషన్​కి ఇంకొన్ని గంటలే ఛాన్స్ (Pexels/Representational Image)

సీయూఈటీ పీజీ 2026- కీలక తేదీలు ఇవే..

సీయూఈటీ పీజీ 2026 దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 23, 2026

సీయూఈటీ పీజీ 2026 ఫీజు చెల్లించడానికి గడువు: జనవరి 25, 2026

సీయూఈటీ పీజీ 2026 కరెక్షన్​ విండో: జనవరి 28 నుంచి జనవరి 30, 2026 వరకు

సీయూఈటీ పీజీ 2026 పరీక్ష: మార్చి 2026లో నిర్వహించే అవకాశం ఉంది (తేదీలు వెల్లడించాల్సి ఉంది).

సీయూఈటీ పీజీ 2026- పరీక్షా విధానం..

ఈ సీయూఈటీ పీజీ 2026 పరీక్ష మొత్తం 90 నిమిషాల పాటు జరుగుతుంది. ప్రతి ప్రశ్నాపత్రంలో 75 ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజెస్, ఎం.టెక్, హైయర్ సైన్సెస్, ఆచార్య పేపర్లు మినహా మిగిలిన అన్ని పేపర్లు ఇంగ్లీష్, హిందీ భాషల్లో (బైలింగువల్) అందుబాటులో ఉంటాయి.

సీయూఈటీ పీజీ 2026​- ముఖ్యమైన డాక్యుమెంట్లు..

సీయూఈటీ పీజీ 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలంటే అభ్యర్థులు ఈ కింది పత్రాలను ముందుగానే స్కాన్ చేసి పెట్టుకోవడం మంచిది.

  • పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం.
  • 10వ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా.
  • కుల ధృవీకరణ పత్రం (రిజర్వేషన్ వర్తించే వారైతే).
  • ఆధార్ కార్డు.
  • నివాస ధృవీకరణ పత్రం.
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం.

సీయూఈటీ పీజీ 2026- దరఖాస్తు చేసుకోవడం ఎలా?

అభ్యర్థులు ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే ఈ కింది సులభమైన పద్ధతుల ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు:

స్టెప్​ 1- ముందుగా అధికారిక వెబ్‌సైట్ exams.nta.nic.in/cuet-pg/ ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో కనిపించే 'CUET PG 2026 Registration' లింక్​పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- కొత్త పేజీలో మీ వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.

స్టెప్​ 4- అనంతరం అప్లికేషన్ ఫామ్ నింపి, నిర్ణీత దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించండి.

స్టెప్​ 5- దరఖాస్తు సమర్పించిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోని దగ్గర ఉంచుకోండి.

దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థులు ఎన్‌టీఏ హెల్ప్‌డెస్క్ నంబర్లు 011-40759000 లేదా 011-69227700 ను సంప్రదించవచ్చు. అలాగే helpdesk-cuetpg@nta.ac.in కి మెయిల్ చేయడం ద్వారా కూడా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More