ఉద్యానవన యూనివర్సిటీలో 61 పోస్టులు.. అప్లికేషన్ విధానం, ముఖ్యమైన తేదీ!

కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 61 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

Updated on: Jan 01, 2026 6:31 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సిద్దిపేట జిల్లా ములుగులో ఉన్న కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో 61 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఉద్యానవన ఫ్యాకల్టీ, అనుబంధ సబ్జెక్టులలోని వివిధ విభాగాలలో అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల (అసోసియేట్ ప్రొఫెసర్ 44 పోస్టులు, ప్రొఫెసర్ 17) కేడర్‌లో ఎంపిక ప్రక్రియ మెుదలైంది. అర్హతగల ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఉద్యానవన యూనివర్సిటీలో ఉద్యోగాలు
ఉద్యానవన యూనివర్సిటీలో ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థులు నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. పూర్తి చేసిన దరఖాస్తును 31-01-2026న సాయంత్రం 04.00 గంటలలోపు యూనివర్సిటీకి పంపాలి. పోస్టల్ ఆలస్యం కారణంగా దరఖాస్తు ఆలస్యంగా అందితే విశ్వవిద్యాలయం బాధ్యత వహించదని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల కోసం అభ్యర్థి దరఖాస్తు పత్రాన్ని, ధృవపత్రాల జిరాక్స్ కాపీలతో 31-01-2026వ తేదీ సాయంత్రం 4.00 గంటలలోపు 'ది రిజిస్ట్రార్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, పరిపాలనా కార్యాలయం, ములుగు (గ్రామం & మండలం), సిద్దిపేట జిల్లా – 502 279' అనే చిరునామాకు చేరేలా పంపాలి.

దరఖాస్తుతో పాటుగా ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 4000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 2500 రిజిస్ట్రేషన్ ఫీజును 'COMPTROLLER, SRI KONDA LAXMAN TELANGANA HORTICULTURAL UNIVERSITY' పేరు మీద ములుగు, సిద్దిపేట జిల్లాలో చెల్లించదగిన విధంగా డిమాండ్ డ్రాఫ్ట్ తీసి, దరఖాస్తుతో పాటు జతచేయాలి. ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి చెల్లించరు.

ఐదు విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులు, 12 విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్‌డీతో పదేళ్ల బోధన, విస్తరణ, పరిశోధన అనుభవంతోపాటుగా మరికొన్ని అర్హతలు ఉండాలి. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్‌డీతోపాటుగా పీజీలో 55 శాతం మార్కులు, ఎనిమిదేళ్ల అనుభవం కావాలి.

పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి.

ఇతర వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్: www.skltghu.ac.in ని సందర్శించండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More