టీటీడీ మరో కీలక నిర్ణయం - భారీ సబ్సిడీతో పరికరాలు, పంచలోహ విగ్రహాల పంపిణీ..! దరఖాస్తు విధానం ఇలా
టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిందువుల ఆలయాలకు మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలను రాయితీపై అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ప్రపంచ ప్రఖ్యాత హైందవ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా హిందువుల ఆలయాలకు మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలను రాయితీపై అందిస్తుంది.

నిబంధనలకు అనుగుణంగా డీడీతో పాటు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యనిర్వహణాధికారి, టీటీడీ పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి అనే చిరునామాకు పంపాలి. ఇతర వివరాలకు 0877-2264276 అనే నంబరులో సంప్రదించాల్సి ఉంటుంది.
మైక్ సెట్:
• మైక్ సెట్ కొనుగోలుకు అయ్యే ఖర్చు రూ.25,000లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ సి, ఎస్ టి లకు 90 శాతం రాయితీ మినహాయించి రూ.2,500/- డి.డి. తీసి పంపించాల్సి ఉంటుంది. ఇతరులకు 50 శాతం రాయితీ మినహాయించి రూ. 12,500 చెల్లించాల్సి ఉంటుంది.
• ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ నుంచి సిఫార్సు లేఖ, ఆలయ ఫొటో, ఆలయ కరెంట్ బిల్లు, దరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాలి.
గొడుగులు :
హిందూ దేవాలయాలకు కేటగిరీలతో సంబంధం లేకుండా అర్హులైన దరఖాస్తుదారులకు రూ.14,500 విలువ చేసే గొడుగులను 50 శాతం రాయితీతో రూ.7,250 లకే టీటీడీ అందిస్తుంది.
• ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ తో సదరు శాఖ సిఫార్సు లేఖ, దరఖాస్తుదారు ఆధార్ కార్డ్, ఆలయ ఫొటోను జత చేసి దరఖాస్తు చేయాలి. సదరు పత్రాలతోపాటు రాయితీ మినహాయించి రూ. 7,250లకు డి.డిను జత చేసి పంపాలి.
శేష వస్త్రం :
హిందూ దేవాలయాలకు ఉచితంగా శేష వస్త్రాన్ని టీటీడీ ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం ఆలయ అభ్యర్థన లేఖను కార్యనిర్వాణాధికారి, తిరుపతి పేరుతో దరఖాస్తు చేయాలి. సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి సిపార్సు లేఖ, దరఖాస్తు దారు ఆధార్ కార్డు, ఆలయ ఫోటోను జత చేయాలి.
రాతి, పంచలోహ విగ్రహాలు:
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతీ అమ్మవారి రాతి విగ్రహాలను 5 అడుగులు, అంతకంటే తక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలను ఉచితంగా అందిస్తారు. మిగిలిన దేవతా విగ్రహాలకు 75 శాతం సబ్సిడీపై కేవలం 25 శాతం ధరను చెల్లిస్తే వివిధ వర్గాల వారికి అందిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా రాతి విగ్రహాలను అందిస్తారు.
- పంచలోహ విగ్రహాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి 90 శాతం సబ్సిడీతో, ఇతర వర్గాల వారికి 75% సబ్సిడీతో అందిస్తారు.
- దేవతా మూర్తుల రాతి మరియు పంచలోహల విగ్రహాల పేర్లు, కొలతలతో కార్యనిర్వహణాధికారి, టీటీడీ వారికి ఆలయ అభ్యర్థన లేఖ పంపించాలి.
- దరఖాస్తుదారులు ఖచ్చితంగా స్థానిక తహసీల్దార్ / అసిస్టెంట్ కమీషనర్ నుండి సదరు ఎండోమెంట్ శాఖ తాజా సిఫార్సు లేఖ, ఆలయ బ్లూ ఫ్రింట్ ను ఏ4 సైజ్ లో మరియు అవసరమైన విగ్రహాల డ్రాయింగ్ , ఒరిజినల్ ఆలయ ఫోటో, దరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాలి.
- ఎం.ఈ.వో లేదా డీఈవో లతో ఆమోదం పొందిన విద్యా సంస్థలకు సరస్వతీ దేవీ రాతి విగ్రహాన్ని 50 శాతం సబ్సిడీతో టీటీడీ అందిస్తోంది.
- మఠాలు, ట్రస్ట్ లకు, ఆశ్రమాలకు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను 50% రాయితీతో అందిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

