ఇక ఇంటి నుంచే ఆధార్‌లో మొబైల్ నంబర్ని మార్చుకోవచ్చు! ఇలా చేయండి..
ఆధార్ మొబైల్ నంబర్ మార్పు కోసం పొడవైన క్యూలో నిలబడాల్సిన పని లేదు! ఇంట్లోనే సింపుల్‌గా ప్రాసెస్‌ని పూర్తి చేసుకుని, మొబైల్ నంబర్ని మార్చుకోవచ్చు. ఈ మేరకు ఆధార్ యాప్‌లో కొత్త అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. మొబైల్ నంబర్ ఎలా మార్చుకోవాలి? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
ఇకపై మీ ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు! సమీపంలోని ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని వెతకాల్సిన పనిలేదు! యూఐడీఏఐ ఆధార్ యాప్‌లో ఒక కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. సాధారణ ఓటీపీ, ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి వినియోగదారులు ఇంటి నుంచే మొబైల్ నంబర్‌ను మార్చుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన ఇతర విషయాలు ఇక్కడ ఉన్నాయి..

ఆధార్ యాప్‌లో అప్డేట్..
యూఐడీఏఐ అప్డేట్ చేసిన ఆధార్ యాప్‌లో ఇప్పుడు "మొబైల్ నంబర్ అప్డేట్" అనే ప్రత్యక్ష ఆప్షన్ ఉంది. దీని ద్వారా పౌరులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే తమ ఆధార్‌తో లింక్ అయిన నంబర్‌ను డైరక్ట్‌గా మార్చుకోవచ్చు.
దూరం, ఆరోగ్య సమస్యలు లేదా బిజీ షెడ్యూల్స్ కారణంగా భౌతికంగా కేంద్రాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు సహాయం చేయడానికి ఈ కొత్త ప్రక్రియను తీసుకొచ్చారు.
ఈ అప్డేట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. అయితే ఈ సేవలను ఉపయోగించుకోవాలంటే మీ యాప్ తప్పనిసరిగా లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ అయి ఉండాలి.
ఆన్‌లైన్‌లో ఆధార్ మొబైల్ నంబర్ ఎలా మార్చాలి?
యాప్ అప్డేట్/ఇన్‌స్టాల్: ముందుగా, గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌కి వెళ్లి, అధికారిక ఆధార్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి/అప్డేట్ చేయండి.
ఆప్షన్ ఎంచుకోండి: యాప్‌ను తెరిచి, హోమ్ స్క్రీన్‌లో కనిపించే ‘మొబైల్ నంబర్ అప్డేట్’పై ప్రెస్ చేయండి.
ఓటీపీ ధృవీకరణ: మీ కొత్త నంబర్‌కు ధృవీకరణ కోసం ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి.
ఫేస్ అథెంటికేషన్: ఆ తర్వాత, మీ ఫేస్ అథెంటికేషన్‌ను పూర్తి చేయండి. గుర్తింపు నిర్ధారణ కోసం మీ ముఖాన్ని స్కాన్ చేయమని అడుగుతుంది. ఇది.. గతంలో ఆధార్ కేంద్రాల్లో జరిగే బయోమెట్రిక్ ధృవీకరణతో సమానం.
అప్డేట్ పూర్తి: ధృవీకరణ పూర్తయిన వెంటనే, అప్డేట్ చేసిన నంబర్ యూఐడీఏఐ డేటాబేస్‌లో రికార్డ్ అవుతుంది.
అంతే! ఎటువంటి పేపర్‌వర్క్ లేదా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు.
ఆన్‌లైన్‌లో ఇంకా అప్డేట్ చేయలేనివి ఇవి..
ఆధార్ యాప్‌లో మీరు పేరు, ఈమెయిల్ వంటి వివరాలను అప్డేట్ చేయడానికి ఆప్షన్లను కూడా చూడవచ్చు. అయితే, ఈ విభాగాల్లో సెల్ఫ్-అప్‌డేట్ సౌకర్యం ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి, కింది మార్పుల కోసం ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లడం తప్పనిసరి:
వేలిముద్ర/బయోమెట్రిక్ అప్‌డేట్‌లు
ఐరిస్ స్కాన్
ఫోటో అప్డేట్‌లు
పుట్టిన తేదీలో తప్పులు
చిరునామాను అప్డేట్ చేసే వెసులుబాటు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆధార్ ధృవీకరణ కోసం కొత్త యూఐడీఏఐ నియమం..
కస్టమర్ వెరిఫికేషన్ కోసం ఆధార్‌ను ఉపయోగించే ముందు సంస్థలు తప్పనిసరిగా తమను తాము రిజిస్టర్ చేసుకోవాలని యూఐడీఏఐ ఒక కొత్త నియమాన్ని కూడా ప్రవేశపెట్టింది.
ఈ నియమం ముఖ్యంగా హోటళ్లు, ఈవెంట్ వేదికలు, ఆధార్ ఫోటోకాపీలను సేకరించే వ్యాపారాలకు వర్తిస్తుంది.
స్టోర్ చేసిన ఆధార్ డేటాను దుర్వినియోగం చేయకుండా నిరోధించడం, భారత డేటా రక్షణ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా క్యూఆర్-కోడ్ ఆధారిత డిజిటల్ ధృవీకరణను ప్రోత్సహించడం దీని లక్ష్యం. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


